Home Unknown facts Rendu eddula Shilaroopamlo darshanam ichhe Trimurthulu kulovai unna aalayam thelusa?

Rendu eddula Shilaroopamlo darshanam ichhe Trimurthulu kulovai unna aalayam thelusa?

0

త్రిమూర్తులు పూజలందుకుంటున్న ఈ ఆలయంతో ఇప్పటికి రెండు ఎద్దులు శిల రూపంలో భక్తులకి దర్శనం ఇస్తున్నాయి. ఈ ఆలయంతో వీరభద్రస్వామి కూడా కొలువై ఉన్నాడు. మరి ఎంతో ప్రాచీన చరిత్ర కలిగిన ఈ ఆలయంతో వీరభద్రస్వామి ఎలా వెలిసాడు? అక్కడ ఎద్దులు శిలారూపంలో దర్శనం ఇవ్వడం వెనుక పురాణం ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. trimurthuluఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అస్సారిమండలంలో కైరుప్పల అనే గ్రామంలో అతి పురాతనమైన శ్రీ వీరభద్రస్వామి క్షేత్రం ఉంది. ఈ ఆలయంతో వెలసిన అమ్మవారిని భద్రకాళిగా భక్తులు కొలుస్తారు. అయితే హంద్రీ నది తీరాన గల ఈ ఆలయాన్ని ప్రాచీన కాలంలో దేవరాయపురంగా పిలిచేవారు. ఇంకా ఈ ఆలయానికి పశ్చిమ దిశలో కొండమీద అగస్త్యాశ్రమం ఉంది. అంతేకాకుండా కొండని ఆనుకొని అగస్త్య సరోవరం కూడా ఉంది. ఇక ఈ ఆలయ పురాణానికి వస్తే, పూర్వం ఒకసారి త్రిశంకు మహారాజు మహర్షి దర్శనార్థం వచ్చి ఈ స్థలం ఎంతో మహిమగలదని తెలుసుకొని అగస్త్యుని ఆదేశానుసారం ఇచట ఆలయం నిర్మించి త్రిమూర్తులను ప్రతిష్టించి పూజించినట్లు స్థల పురాణం చెబుతుంది. ఆ తరువాతి కాలంలో ఇక్కడ నివసించే ఒక భక్తుడికి కలలో వీరభద్రుడు కనిపించి, హంద్రీ నది ఉన్న ప్రదేశంలో తను ఉన్నట్లు తెలియచేయగా, మరునాడు స్వామి చెప్పిన ప్రదేశానికి గ్రామా ప్రజలందరూ వెళ్లి అక్కడ ఉన్న ఒక శిలని తొలగించి చూడగా అక్కడ వీరబద్రుడి విగ్రహం కనిపించింది. ఇక ఎంతో ఆనందంతో ఆ గ్రామా ప్రజలు ఆ మూర్తిని ఎద్దుల బండిలో తీసుకొని వచ్చి త్రిమూర్తులు కొలువై ఉన్న ఈ ఆలయంతో వేణుగోపాలస్వామి, మహేశ్వర విగ్రహాల మధ్య ప్రతిష్టించినట్లు చరిత్ర తెలుపుతుంది. అలా ఆ ఎద్దులు ఇప్పటికి అలయంలో శిల రూపంలో ఉండటం విశేషం. ఈవిధంగా వెలసిన ఈ అలయంలో వీరభద్రుడికి బ్రహ్మోత్సవాలు చాలా గొప్పగా నిర్వహిస్తారు. ఇందులో భాగంగా ఇక్కడ నిర్వహించే సుగ్గులాట ఎంతగానో ప్రాచుర్యం పొందింది. ఈ సుగ్గులాటను ఇచ్చట ఘనంగా జరుగును. అయితే ఇలా జరుపుకోవడానికి ఒక పురాణం ఉంది, కృతయుగంలో భద్రకాళి అమ్మవారు వీరభద్రుడిని వివాహం చేసుకోమని అడగ్గా చేసుకోనని ఆ స్వామి ఆటపట్టించారంటా. అప్పుడు కోపానికి గురైన అమ్మవారు స్వామి వచ్చే సమయానికి పిడకలు తయారు చేయించి తన అనుచరులతో ఆ స్వామి పైన పిడకలు వేయించిందంటా. ఆనాటి దాడికి గుర్తుగా నేటికీ భక్తులు సుగ్గులాట అనే పేరుతో వేడుక నిర్వహిస్తారు. ఈ వేడుకలో అమ్మవారి తరుపున కొందరు, వీరభద్రుని వైపు కొందరు ఉండి పిడకలని విసురుకుంటారు. ఇలా సరదాగా సాగె ఈ వినోదాన్ని చూడటానికి అనేక గ్రామాల నుండి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి ఈ వేడుకని ఆనందంగా తిలకిస్తారు.

Exit mobile version