హీల్స్ వేసుకోడం వల్ల కీళ్ళ నొప్పులు వచ్చే ప్రమాదము ఉందా ?

0
211

అమ్మాయిలకి ఎన్ని రకాల చెప్పులు ఉన్నా, ఇంకా కొత్త మోడల్స్ కోసం చూస్తూనే ఉంటారు. ఇప్పుడున్న ట్రెండ్ కి తగ్గట్టు మార్కెట్లోకి హైహీల్స్, పెన్సిల్ హీల్, షూస్ వంటి రకరకాల చెప్పులు అందుబాటులోకి వచ్చాయి. ఇవి చూడ్డానికి చాలా బాగుంటాయి. కానీ ఇలాంటివి ఎక్కువ సేపు ధరించటం వల్ల మడమలు విపరీతమైన నొప్పి వస్తాయి. ఎత్తు చెప్పులను వేసుకోవడం వల్ల కాళ్ళ నొప్పులు, ఆ తర్వాత కీళ్ళ నొప్పులు కూడా వచ్చే ప్రమాదము ఉంటుంది.

risk of joint pain due to wearing heelsకొన్ని చెప్పుల వల్ల ఒత్తిడి పెరిగి బొటన వేళ్ళు వంకర పోవడం, మోకాళ్ల నొప్పులు, కీళ్లు మరియు కాలి మడమలు అరిగిపోవడం, నరాలు తొలిగిపోవడం, పాదాలు దెబ్బతినడం గోళ్ల ఇన్ ఫెక్షన్ రావడం వంటి ప్రమాదాలున్నాయని ఆర్థోపిడిషియన్స్ అంటున్నారు. ఇలాంటి చెప్పులను వేసుకొని ఎక్కువసేపు నడిచినా, ఎక్కువసేపు నిలబడి ఉన్నా కీళ్ళ నొప్పులతో పాటు నడుమునొప్పి వచ్చే ప్రమాదం ఉంది. పెన్సిల్ హీల్ వంటి వాటితో జారిపడి కాళ్ళు ఫ్యాక్చర్ అయ్యే అవకాశం ఎక్కువ.

risk of joint pain due to wearing heelsఅందుకే మనం చెప్పులు కొనుగోలు చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. హై హీల్స్ చాలా అందంగా ఉంటాయి. కాని ఎక్కువ కాలం ధరించడానికి మాత్రం అంత సౌకర్యంగా ఉండవు. అయితే చాలామంది ఇవి వేసుకోవడానికి కష్టాంగా ఉన్నా వాటినే వేసుకుంటారు. కొన్ని చిట్కాలు పాటిస్తే ఎక్కువ సేపు వాటిని ధరించగలరు.

risk of joint pain due to wearing heelsఎత్తు చెప్పులు కొనేటప్పుడు వాటిని వేసుకొని ఎక్కువ సేపు నించో గలమా లేదా అన్నది చూసుకోవాలి. మడమలకు సౌకర్యవంతంగా ఉండేలా సరైన రకమైన ఎత్తు చెప్పులను కొనుగోలు చేయాలి. చెప్పులు కొనేటప్పుడు బెల్ట్ ఉండే విధంగా చూసుకోండి. మహిళలు ఎక్కువ పెన్సిల్ మరియు సన్నగా ఉండే హై హీల్స్ ఎక్కువగా వేసుకుంటారు. ఎందుకంటే అవి అందంగా, స్టైలిష్‌గా ఉంటాయి. కానీ వాటిని ధరించడం వల్ల మడమలుకు నొప్పిని కలిగిస్తాయి.

risk of joint pain due to wearing heelsఅందుకే బ్లాక్ హీల్స్ మరియు వెడ్జెస్ వంటివి కొనుగోలు చెయ్యండి. ఇవి పాదాలపై ఒత్తిడిని తగ్గిస్తాయి. ఇలాంటి చెప్పులను కాస్త ఎక్కువ సేపు ధరించగలం మరియు సౌకర్యంగాను ఉంటుంది. కొత్తలో చెప్పులు కాస్త టైట్ ఉంటాయి దీని వల్ల కాలి పై మచ్చలు పడే అవకాశం ఉంది. అందుకే కొత్త చెప్పులను ధరించే ముందు కొంచెం వాటిని స్ట్రెచ్ చెయ్యండి. మందపాటి సాక్స్ మీద వాటిని ధరించి కొంత సమయం చుట్టూ నడవండి. ఈ చిట్కా మడమలను సౌకర్యవంతంగా చేస్తుంది. ఎంత సౌకర్యవంతంగా ఉన్నా వాటిని రెగ్యులర్ గా వేసుకోవటం అంత మంచిది కాదు.

 

SHARE