హెవీ వర్కవుట్స్ వలన గుండె సంబంధిత ప్రాబ్లమ్స్ వస్తాయా ?

కరోనా రావడం ఏమిటో గానీ అందరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరిగింది. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉండడం, హెల్త్ ఇష్యూస్ ఉన్నవారికి వైరస్ త్వరగా సోకుందని తెలిశాక చాలామంది ఫిట్నెస్పై దృష్టి పెట్టారు. ఇమ్మ్యూనిటి పెంచుకోవడానికి ఇంటి చిట్కాలు తెగ ట్రై చేస్తున్నారు. లాక్ డౌన్లో జిమ్లు, ఫిట్నెస్ సెంటర్లు క్లోజ్ అయినా ఆన్లైన్లో లైవ్ క్లాసులను వింటూ ఇంట్లోనే వర్కవుట్లు చేయడం మొదలుపెట్టారు.

Risks of doing heavy workouts in the summerజిమ్లకు వెళ్తున్నవారితో పాటు ఇండ్లలో ఎక్సర్సైజ్లు చేస్తున్న వారు 50శాతానికి పైనే ఉన్నారు. అయితే ఒక్కసారిగా తెచ్చిపెట్టుకున్న అలవాటుతో అనారోగ్యాల పాలవుతారని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. సూచనలు లేకుండా ఇష్టమొచ్చినట్టుగా వర్కవుట్లు చేస్తే శరీరం తీసుకోలేదని చెప్పుకొస్తున్నారు. ఇక సమ్మర్లో ఎక్కువగా వర్కవుట్లు చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయని అంటున్నారు. ముఖ్యంగా గుండె సంబంధిత హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవారు హెవీ ఎక్సర్ సైజ్ లు చేయకపోవడమే మంచిదని పేర్కొంటున్నారు.

Risks of doing heavy workouts in the summerసమ్మర్లో ఎక్సర్ సైజ్ చేసినా, చేయకపోయినా బాడీలో వాటర్ లాస్ ఎక్కువగా ఉంటుంది. టెంపరేచర్ వల్ల బాడీ టెంపరేచర్ నార్మల్ గా ఉండదు. 20 నుంచి 25నిమిషాలు వర్కవుట్స్ చేసి డైట్ మెయింటెన్ చేస్తే సరిపోతుంది. హెవీగా వర్కవుట్స్ చేయడం వల్ల బాడీ డీ హైడ్రేట్ అయ్యే అవకాశం ఉంది. వాటర్ లాస్ వల్ల తలనొప్పి, నిద్రలేమి, చిరాకు, వాంతులు, కళ్లు తిరిగి కిందపడిపోవడం లాంటివి జరుగుతాయి. ఇవి రాకుండా ఉండాలంటే వర్కవుట్ తర్వాత ఎలక్ట్రో లైట్స్ ప్యాకెట్ ని 300, 350 ఎంఎల్ వాటర్ లో కలిపి తీసుకోవాలని ఫిట్నెస్ ట్రైనర్లు చెప్తున్నారు.

Risks of doing heavy workouts in the summerహెవీ వెయిట్స్ లిఫ్ట్ చేస్తేనే మజిల్ పెరుగుతుందనేది అపోహ మాత్రమేనని ట్రైనర్లు అంటున్నారు. శరీరానికి కావలసిన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, గుడ్ ఫ్యాట్స్, ఫైబర్ అన్నీ తగినట్టుగా ఇవ్వగలితే కండరాలు పెరగడం, తగ్గడం అవుతుందంటున్నారు. అధికబరువు ఎత్తడం వల్ల ప్రమాదాలు జరుగుతాయని హెచ్చరిస్తున్నారు. ఎక్కువ వెయిట్స్ లిఫ్ట్ చేయడం వల్ల జాయింట్ పెయిన్స్ తదితర కండరాల నొప్పులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయంటున్నారు.

Risks of doing heavy workouts in the summerఎక్సర్సైజ్లు చేసేవాళ్లు రోజు ఒక వర్కవుట్ని 10 నుంచి 12 సార్లు రిపీట్ చేస్తూ ఒక మూడు ఎక్సర్ సైజ్ లు చేసుకోవచ్చు. రోజూ ఎక్సర్ సైజ్ చేసేవాళ్లు మూడు నుంచి 3.5 లీటర్ల వాటర్ తీసుకోవాలి. బటర్ మిల్క్, గ్లూకోజ్, కొబ్బరి నీళ్లు తాగాలి. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఉంటాయి. లేదంటే నీరసంగా అయిపోతారు. అలవాటు లేని వారు ఒక్కసారిగా వర్కవుట్స్ చేసి బయటకు వెళితే ఎండదెబ్బ తగిలే అవకాశాలు ఎక్కువ. బాడీలో వాటర్ లెవల్స్ తగ్గిపోతాయి. 60 ఏండ్లు దాటిన వారు వీటికి దూరంగా ఉండాలి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR