పామ్ ఆయిల్ ను ఎక్కువుగా వాడటం వలన కలిగే నష్టాలు

దాదాపు చాలా వంటిళ్లల్లో పామాయిల్ ఉండడం చూస్తూనే ఉంటాం. పామాయిల్ తో ఎన్నో రకాల వంటకాలు చేస్తారు. ముఖ్యంగా అప్పాలను పామాయిల్ తోనే చేస్తారు. కొందరు దీన్నే వంట నూనెగానూ వాడుతారు. ఎందుకంటే అన్ని నూనెల కన్నా ఈ నూనె ధర చాలా తక్కువగా ఉంటుంది. అందుకే.. ఈ నూనెనే ఎక్కువగా కొంటున్నారు జనాలు. ప్రపంచంలో పామ్ ఆయిల్‌ని ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న దేశం భారతే. ప్రస్తుతం దేశంలోని ఫాస్ట్ ఫుడ్ సెంటర్లన్నీ పామ్ ఆయిల్‌నే వాడుతున్నాయి. అయితే పామ్ ఆయిల్‌తో కలిగే నష్టాలు తెలియక చాలా మంది ఈ నూనెతో చేసిన వంటకాల్ని తినేస్తున్నారు. బయట మార్కెట్ లో దొరికే ప్యాక్ చేసిన ఆహారం మొత్తం ఈ ఆయిల్ తోనే తయారు అవుతుంది.

Risks Of Overuse Of Palm Oilచిప్స్ కానీ.. మిక్చర్ కానీ.. బోందీ కానీ.. నామ్ కీన్స్ కానీ.. ఇతర స్నాక్స్ ఆహార పదార్థాలన్నింటినీ పామాయిల్ తోనే తయారు చేస్తారు. అంటే.. ఇంట్లో మనం పామాయిల్ ఉపయోగించకున్నా.. బయట ఖచ్చితంగా ఏదైనా ఆహారం తింటే.. అందులో పామాయిల్ ఖచ్చితంగా ఉంటుంది. పామాయిల్ ను తయారు చేసే పండ్లలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఎరుపు రంగులో ఉండే పండ్లు, రెండోది కాషాయం రంగులో ఉండే పండ్లు. ఈ పండ్ల నుంచే నూనెను తయారు చేస్తారు. ఈ పండ్ల నుంచి నూనె తీశాక.. దాన్ని రిఫైన్ చేయకపోతే.. దాన్ని రెడ్ పామ్ ఆయిల్ అంటారు. అయితే.. దీంట్లో అన్ సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. దాని వల్ల.. అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

Risks Of Overuse Of Palm Oilఇతర ఆయిల్స్ తో కంపేర్ చేసుకుంటే పామ్ ఆయిల్ లో ఎక్కువగా సాచురేటెడ్ ఫ్యాట్ కంటెంట్ ఉంటుంది. పామ్ ఆయిల్ లో 34 శాతం శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది అదే ఆలివ్ ఆయిల్ లో అయితే సగమే ఉంటుంది. అందుకే పామ్ ఆయిల్ తీసుకోవడం వల్ల గుండె సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

Risks Of Overuse Of Palm Oilపామాయిల్ ను ఎక్కువగా ఉపయోగిస్తే.. ఫ్యాటీ లివర్ సమస్య వస్తుందట. అలాగే.. క్యాన్సర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా వస్తాయట. ముఖ్యంగా ఒబెసిటీ, వాస్క్యులర్ డిసీజ్ లు వస్తాయి. పామ్ ఆయిల్ ను ఎక్కువగా వాడటం వల్ల శరీరంలో చెడు కొలెస్టరాల్ పెరుగుతుంది.

Risks Of Overuse Of Palm Oilరీసర్చ్ ప్రకారం పామ్ ఆయిల్ ని వాడడం వల్ల ఆకలి విపరీతజంగా పెరిగిపోతుందని చెప్పడం జరిగింది. మనిషి ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా మనిషి యొక్క ఎన్విరాన్‌మెంటల్ అని కూడా ఇది హాని చేస్తుంది. వాతావరణంలో కూడా మార్పులు తీసుకు వస్తుంది. పామ్ చెట్లతో వచ్చే పొగ కారణంగా మన పర్యావరణం కూడా హాని కలుగుతుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,490,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR