శరీరంలో మెగ్నీషియం పాత్ర ఏంటి? తక్కువైతే వచ్చే సమస్యలేంటి?

శరీరం ఒక వాహనం లాంటిది. వాహనం ఎలాగైతే దానికి కావాల్సిన ఇంజన్, ఆయిల్, బ్యాటరీ అన్నీ బాగుంటేనే పని చేస్తుందో శరీరం కూడా అంతే. ప్రొటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేట్లు, మినరల్స్.. శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి ఎన్నో రకాల పోషకాలు కావాలి. అలా శరీరానికి అవసరమయ్యే లవణాల్లో అతి ముఖ్యమైనది మెగ్నీషియం. మెగ్నీషియం శరీరంలో వందలాది జీవరసాయన ప్రతిచర్యలలో పాల్గొంటుంది. శక్తి ఉత్పత్తి, ప్రోటీన్ ఉత్పత్తి, జన్యువుల నిర్వహణ, కండరాలు మరియు నాడీ వ్యవస్థ కోసం మినహాయింపు లేకుండా మన శరీరంలోని అన్ని కణాలకు మెగ్నీషియం అవసరం.

proteinsరక్తపోటును నియంత్రణలో ఉంచడంలోనూ, గుండె, కండరాల వ్యవస్థ, నాడీ వ్యవస్థ ఇవన్నీ సక్రమంగా పనిచేయడంలోనూ మెగ్నీషియం పాత్ర కీలకమైనదే. అలాగే ఎముకల దారుఢ్యానికీ , వ్యాధినిరోధక శక్తిని పెంచడంలో ప్రొటీన్‌ తయారీలో మెగ్నీషియంది ప్రధాన భూమిక. ఇది సాధారణ ఆహార పదార్థాలన్నింటిలోనూ లభించేదే అయినా చాలామందిలో ఈ లోపం కనిపిస్తూనే ఉంది. ఎందుకంటే, సోడియం, పొటాషియం, క్యాల్షియంల పట్ల చూపే శ్రద్ధ చాలా మంది మెగ్నీషియం పట్ల చూపలేకపోతున్నారు. రక్తపోటు పెరిగిందనగానే సోడియం తగ్గించమని క్యాల్షియం లభించే ఆహారం ఎక్కువగా తీసుకొమ్మని చెబుతారు. కానీ వందలాది జీవరసాయన ప్రతిచర్యల మూలంగా ఉండే మెగ్నీషియం లోపాల్ని ఎవరూ పరిగణనలోకి తీసుకోవడం లేదు.

magnesiumపురుషులు సగటున రోజుకు 400 మిల్లీగ్రాములు, స్త్రీలు 320 మిల్లీ గ్రాముల దాకా మెగ్నీషియం లబించే ఆహార పదార్థాలు తీసుకోవాలి. మెగ్నీషియం లోపాలు స్వల్పంగానే ఉన్నప్పుడు ఆ ప్రభావమేమీ కనిపించదు. కానీ, ఆ నిలువలు బాగా తగ్గిపోయినప్పుడు మాత్రం నీరసం, కండరాలు పట్టేయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. మెగ్నీషియం లోపాల్ని పరీక్షల ద్వారా గుర్తించడమే ఒక కష్టమైన పని. ఎందుకంటే ఎక్కువ మొత్తం మెగ్నీషియం ఎముకల్లో ఉంటుంది. రక్తంలో ఉండదు. అందుకే మెగ్నీషియం లోపాల్ని ఆయా వ్యక్తుల జీవన శైలి… అంటే వారి ఆహారపు అలవాట్లు, శారీరకశ్రమ ఆధారంగానే అంచనాకు వస్తారు.

bonesసాధారణంగా తినే ఆహారంలో సరిపడా మెగ్నీషియం లేకపోతే.. కిడ్నీలు తమ దగ్గరున్న మెగ్నీషియం ఇస్తాయి. అలాగని పదే పదే కిడ్నీలపై ఆధారపడితే.. సైడ్ ఎఫెక్ట్స్ రావడమే కాదు.. కిడ్నీలు కూడా పాడవుతాయి. మెగ్నీషియం సరిపడా లేనప్పుడు మనకు కొన్ని సింప్టమ్స్ ద్వారా గుర్తించవచ్చు. మెగ్నీషియం లోపం ద్వారా ఆకలి వేయదు. వికారంగా ఉంటుంది. వామ్టింగ్ వస్తున్నట్లు అనిపిస్తుంది. నీరసంగా ఉంటారు. గుండె కొట్టుకొనే వేగంలో హెచ్చుతగ్గులు వస్తాయి. కళ్లకు మసకగా అనిపిస్తుంది. కండరాల్లో నొప్పి వస్తుంది. అలసట ఉంటుంది. టెన్షన్ పెరుగుతుంది. నిద్ర సరిగా పట్టదు. హైబీపీ వస్తుంది. అస్తమా సమస్య కూడా పెరుగుతుంది.

asthmaఇలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే వీలైనంతవరకూ ఫ్రైఫుడ్ తగ్గించి.. సహజమైన ఆహారం తినండి. పండ్లు, పప్పులు తినండి. పప్పుధాన్యాలు, పండ్లు, కూరగాయలతోపాటు ముడిధాన్యాలకు కూడా కాస్త ప్రాధాన్యతనిస్తే సరిపోతుంది. వీటిలో మెగ్నీషియం సమృద్ధిగా ఉంటుంది. ముడి ధాన్యాలకు అధిక ప్రాధాన్యతనివ్వడంతో పాటు మెగ్నీషియం సమృద్ధిగా ఉండే, బాదం. జీడిపప్పు, వేరు శెనగలు, పాలకూర, కర్బూజ, అరటి పండ్లు, లెంటిల్స్‌, లెగ్యూమ్స్‌, అవకాడోలను ఎక్కువగా తీసుకోవాలి. సముద్రపు చేపల్లో కూడా మెగ్నీషియం సమృద్ధిగానే ఉంటుంది.

మెగ్నీషియం వెంటనే రావాలంటే ఓ కాఫీ తాగేయాలి. డార్క్ చాకొలెట్ తినేయాలి. అదేపనికా డార్క్‌చాకొలెట్స్ తినడం మంచిది కాదు. రోజుకొకటి తినొచ్చు అలాగని మెగ్నీషియం కోసం దానిపైనే ఆధారపడకుండా కాయగూరలు, ఆకుకూరలు తినాలి. ఒకవేళ ఆహారం ద్వారా మీకు కావలసినంత మెగ్నీషియం లభించకపోతే, మెగ్నీషియం మాత్రలైనా తీసుకోవాలి. ఇది రక్తపోటును, గుండె పనితీరును నియంత్రిస్తుంది. చాతినొప్పి రాకుండా కాపాడుతుంది.అయితే మెగ్నీషియం ఎక్కువైతే కూడా ఇబ్బందే.. డయేరియా, కడుపుతో నొప్పి వంటివి వస్తాయి. కాబట్టి.. ఎంత మెగ్నీషియం అవసరమో డాక్టర్ సలహా పాటించడం మేలు.

dark chocolate

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,620,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR