శనీశ్వరుని అనుగ్రహం కోసం పాటించాల్సిన నియమాలు

భారతీయ జ్యోతిష శాస్త్రం మీద కనీస అవగాహన ఉన్నవారు ఎవరైనా, శని దేవుని పట్ల కూసింత భయాన్ని కలిగి ఉంటారు అనడంలో ఏమాత్రం ఆశ్చర్యంలేదు.
అయినప్పటికీ, అనేకమందికి హిందూ పురాణాలకు సంబంధించిన జ్ఞానం పాక్షికంగానే ఉన్న కారణాన, శని దేవుని ప్రతికూల ప్రభావాల బారిన పడడం సర్వసాధారణంగా ఉంటుంది. శని దేవుడు ఎవరినైనా చూడాలని నిర్ణయించుకుంటే, ఆ వ్యక్తి ఖచ్చితంగా నాశనం చేయబడతాడు. అలాగని శని దేవుడు క్రూరమైన దేవుడేమీ కాదు. కానీ ఎందుకు ఇలా జరుగుతుంది?

navgrahaluశని దేవుడు ప్రజలను, వారి వారి తప్పుల ప్రకారమే శిక్షిస్తాడు, మరియు అంత సులభంగా క్షమించడు. క్రమంగా ప్రజలు అతని ఆశీస్సులు పొందడానికి మరియు వారి అనాలోచిత తప్పుల కారణంగా శని దేవుని కోపం నుండి తమని తాము రక్షించుకోవడానికి పలు మార్గాల్లో ఆరాధించడం జరుగుతుంది

శని దేవుడిని పూజించడం వల్ల అనేక ఇబ్బందులు కలుగుతాయని చాలామంది అపోహ పడుతుంటారు.
కానీ వాస్తవానికి అది ఏమాత్రం నిజం కాదు. నవగ్రహాలలో శనిగ్రహం ఒక్కటి.

shani godశనివారం శని దేవునికి అత్యంత ప్రీతికరమైన రోజు. శనివారం శని దేవుని భక్తి శ్రద్ధలతో పూజించిడం వల్ల ఆయన అనుగ్రహం కలిగి, ఏళ్లతరబడి ఉన్న శని పోగొట్టుకోవచ్చు.

శాస్త్రం ప్రకారం శనివారం శనిని పూజించడం వల్ల సిరి, సంపదలు కలుగుతాయని పండితులు చెబుతున్నారు. మరి శని పూజ ఎలా నిర్వహించాలో ఇప్పుడు తెలుసుకుందాం…

shani

మనకు శనీశ్వరుని దేవాలయం అందుబాటులో లేకపోతే, నవగ్రహాలకు వెళ్లి శనీశ్వరుని దర్శించుకోవాలి.
అలా వెళ్లేటప్పుడు నల్లటి నువ్వులను తీసుకొని, నవగ్రహాలలోని శని పాదాల ముందర వాటిని సమర్పించాలి. అలాగే నువ్వుల నూనెతో శనీశ్వరునికి తలనుండి పాదాల వరకూ వచ్చేలా నువ్వుల నూనెతో అభిషేకం చేయాలి. ఇలా చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు తొలగి, అష్టైశ్వర్యాలు చేకూరుతాయి.

అలాగే నల్లటి వస్త్రమును తీసుకొని శనీశ్వరుని మెడలో మాలగా వేయాలి. శనీశ్వరుని పూజ చేసేటప్పుడు ముదురు నీలం రంగు దుస్తులు లేదా నలుపు రంగు దుస్తులు ధరించాలి. శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపమెలిగించడం ద్వారా శుభ ఫలితాలను పొందవచ్చు.

sesame oilశనీశ్వరుడిని మాటిమాటికి శని, శని అని పిలవకూడదు. శనివారం రోజున రావిచెట్టుకు, మీరు పాలతో కలిపిన చక్కెరను పోసి, దీపం వెలిగించడం ద్వారా శనీశ్వరుని దయ ఎప్పటికీ అలాగే ఉంటుంది ఇదే సమయంలో మీరు అప్పుల నుంచి ఉపశమనం పొందుతారు. శనివారం పేదలకు దానం చేయడం ద్వారా శనీశ్వరుని అనుగ్రహం మీకు కలుగుతుంది.

శనివారం రోజు ఎరుపు రంగు మిరియాలకు బదులుగా నలుపు రంగు మిరియాలను వాడాలి. శనివారం ఎట్టి పరిస్థితుల్లో కూడా నువ్వుల నూనెను, నువ్వులను, ఇనుప వస్తువులను ఇంటికి కొన్ని తెచ్చుకోకూడదు.
అలా చేయడం ద్వారా శుభఫలితాలు కలుగవని పండితులు చెబుతున్నారు.

 

miriyalu

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR