కుటుంబం క్షేమంగా ఉండడానికి చేయవలసిన పూజల్లో ముఖ్యమైనవి రెండు ఒకటి ఇలవేలుపుని కొలుచుకోవడం రెండు ఇంటి ప్రధాన గుమ్మం “గడప”కు పూజ చేయడం. ఇంటి గడపను సింహ ద్వారమని లక్ష్మీ ద్వారమని , ద్వారలక్ష్మి అని అంటారు. ఈ గడపకు పసుపు , కుంకుమ , పువ్వులు పెట్టడం వరకు చాలా మందికి తెలిసినదే ఎందుకు చేయాలో తెలియక పోయినా పెద్దవారి నుండి సాంప్రదాయంగా ఆచరిస్తున్నారు.
- అందువల్ల లక్ష్మిదేవికి ఇష్టమైన పసుపును గడపకురాసి కుంకుమ బొట్టు పెడతారు. గడపను తొక్కకుండా దాటి వెళ్ళాలి. అది ఇల్లు అయినా దేవాలయం అయినా గడపను దాటి మాత్రమే వెళ్ళాలి. ఇంటి గడపకు వారానికి ఒకసారైనా తప్పనిసరిగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి.
- అలాగే పర్వ దినాల్లో కూడా చేయాలి. ఇలా చేయటం వలన లక్ష్మి దేవి ఇంటిలో ఉండటమే కాకుండా దుష్ట శక్తులు అన్ని పోతాయి. ప్రతి శుక్రవారం గడపకు పసుపురాసి కుంకుమ బొట్టు పెట్టి నల్లని తాడుతో పటిక కడితే నర దిష్టి తొలగిపోతుంది.
- అన్ని రకాల దిష్టిలో నర దిష్టి చాలా పవర్ ఫుల్. నర దిష్టికి రాళ్ళూ కూడా పగులుతాయనే సామెత కూడా ఉంది. గడప ద్వార ప్రమాణానికి అనుగుణంగా ఉండాలి. చీలికలు లేకుండా అఖండంగా ఉండాలి. గడప దోషంగా ఉంటే హాని కలుగుతుంది.
- ఏ ఇంటికి అయినా గడపలు తప్పనిసరిపూర్వం నిర్మించిన ఇళ్లలో సింహద్వారానికి గడపలే కాకుండా ప్రతి గదికి గడపలు ఉండేవి. ఇక ఈ రోజుల్లో అయితే సింహద్వారం మరియు ఇంటి చుట్టూ ఉండే గుమ్మాలకు మాత్రమే గడపలు ఉంటున్నాయి. అన్ని గడపలకు పసుపు రాసికుంకుమ పెట్టకపోయినా సింహద్వారానికి ఉన్న గడపకు రాసిన సరిపోతుంది.