Home Unknown facts అమ్మవారు తాబేలు ఆకారంలో భక్తులకి దర్సనం ఇచ్చే ఆలయం ఎక్కడ ఉంది ?

అమ్మవారు తాబేలు ఆకారంలో భక్తులకి దర్సనం ఇచ్చే ఆలయం ఎక్కడ ఉంది ?

0

పార్వతీదేవి దేహాన్ని శ్రీ మహావిష్ణువు ఎనిమిది ఖండలుగా ఖండించినప్పుడు అందులో అమ్మవారి కుడిపాదం పడిన ప్రదేశం ఇదేనని చెబుతారు. అందుకే అమ్మవారి శక్తి పీఠాలలో ఈ ఆలయం కూడా ఒకటిగా చెబుతారు. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే అమ్మవారి ఆలయం తాబేలు ఆకారంలో భక్తులకి దర్శనమిస్తుంది. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

త్రిపుర సుందరీ దేవిత్రిపుర రాష్ట్రం, పశ్చిమ త్రిపుర జిల్లాలో అగర్తలకు కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండపైన త్రిపుర సుందరీ దేవి ఆలయం ఉంది. ఇది చాలా పురాతన ఆలయంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ వెలసిన అమ్మవారు కాళీదేవిగా భక్తులకి దర్శనం ఇస్తుంది. ఈ దేవాలయం కూర్మం (తాబేలు) ఆకారంలో ఉంటుంది. అందుకే దీన్ని కూర్మపీఠం అని, అమ్మవారిని మాతాబరి అని కూడా పిలుస్తారు.

ఈ ఆలయాన్ని 1501 లో ధన్యమణిక్య మహారాజు నిర్మించారు. అయితే మొదట ఇక్కడ శ్రీమహావిష్ణువికి ఆలయాన్ని కట్టుటకు భూమి పూజ చేయబడి నిర్మాణం కొనసాగుతుండగా, మహారాజుకు త్రిపురసుందరీ దేవి కలలో కనిపించి చిట్టికాంగ్ సమీపంలో తన విగ్రహం ఉందని తన విగ్రహం ఇక్కడ ప్రతిష్టించమని చెప్పగా దేవి ఆజ్ఞ ప్రకారం ఇచట త్రిపురసుందరీదేవి ఆలయం నిర్మించబడిందని తెలుస్తుంది.

ఇక్కడ త్రిపురసుందరీదేవి విగ్రహంతో పాటు, చోటిమ అనే మరో చిన్న విగ్రహం ఉన్నది. ఒకే రకమైన రెండు విగ్రహాలు ఈ ఆలయంలో ఉన్నాయి. చోటిమ విగ్రహాం రెండు అడుగులు కాగా, త్రిపుర సుందరీ విగ్రహం ఎత్తు ఐదు అడుగులు. ఇంకా ఈ ఆలయంలో ఎర్రరాతితో మలచబడిన కాళీమాత విగ్రహం కూడా ఉంది.

దీపావళి రోజున ఈ ఆలయంలో ఉత్సవం జరుగుతుంది. ఆ రోజున దాదాపు రెండు లక్షల మంది అమ్మవారిని దర్శించుకొని తరిస్తారు. ఈ మందిరం బెంగాలీ పద్దతిలో నిర్మించబడింది. ఈ గుడిలో హిందూ పురాణాలలో వర్ణించినట్లుగా 51 పీఠాలున్నాయి.

Exit mobile version