శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారు ఈ ఆలయంలో సాలగ్రామ శిలపై గరుడపీఠంపై స్వయంభువుగా వెలిశాడని స్థల పురాణం చెబుతుంది. ఇలా స్వామివారు వెలసిన ఈ ఆలయ స్థల పురాణం ఏంటి? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. తెలంగాణ రాష్ట్రంలోని, నల్లగొండ జిల్లా, నకిరేకల్ మండలానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో మూసి నది తీరంలో పాలెం గ్రామంలో శ్రీలక్ష్మీనరసింహస్వామి వారి ఆలయం ఉంది. ఇది చాలా పురాతన ఆలయంగా చెబుతారు. ఇది 13 వ శతాబ్దంలో నిర్మించినట్లుగా కొన్ని ఆధారాల ద్వారా తెలియుచున్నది.
ఇక ఆలయ పురాణానికి వస్తే, ఆనాటి జమీందారు క్రీ.శే. గుండమరాజు కృష్ణయ్యకి ఒకనాటి రాత్రి కలలో స్వామి దర్శనం ఇచ్చి, పాలెం గ్రామానికి ఉత్తర ఈశాన్య దిశలో అడవి ప్రాంతంలో తాను వెలసి మునులచే పూజలు అందుకుతున్నానని, ఇకపై భక్తులను అనుగ్రహించుటకు దర్శనం ఇచ్చెదనని చెప్పి అంతరార్థుడైనాడు. ఇక ఉదయం వెళ్లిన ఆ జమిందారుకి ఎంత వెతికిన స్వామివారి ఆచూకీ అనేది లభించలేదు.
అప్పుడు అయన నిరాశతో వెనుతిరుగుతుండగా ఒక వృద్ధు ఎదురై దగ్గరలో గల ఒక ఎత్తైన వృక్షం దగ్గర గరుడ పక్ష్మి ఉంటుంది అది నీకు స్వామి ఆచూకీ తెలియచేస్తుంది అని చెప్పడం తో అయన ఆ వృక్షం దగ్గరికి వెళ్ళగానే ఆ గరుడపక్షి ఒక పొద దగ్గర రివ్వున మరి ఎగురుగా ఆ పొదలో స్వామి వారు దర్శనం ఇచ్చారు. ఆ జమీందారు అలా స్వామివారికి ఆలయం నిర్మించాడని స్థల పురాణం.
సాలగ్రామ శిలపై లక్ష్మీసమేత శ్రీ లక్ష్మీనరసింహస్వామి గరుడ పీఠం పైన వెలసిన భూభాగం అంత ఒక రాతి శిల. ఆ శిలపైనా స్వామివారు ఉన్నారు. ఈ ఆలయానికి క్షేత్రపాలకుడిగా ఆంజనేయస్వామివారు దర్శనం ఇస్తారు. పాంచరాత్ర ఆగమశాస్త్ర ప్రకారం నిర్మించిన ఈ దేవాలయంలో విశిష్ట ఆళ్వారులతో పాటు శ్రీమణవాళ మహామునుల ప్రతిష్ట జరిపి ఒక దివ్యక్షేత్రంగా రూపొందించబడింది.
ఈ ఆలయం ధ్వజస్తంభ శిఖరాగ్రమున గరుడాళ్వారు స్వామిని సేవిస్తూ మంకు దర్శనం ఇస్తారు. ఇక్కడ గోదాదేవి ప్రత్యేక్ష దైవంగా కల్యాణ కల్పవల్లిగా భక్తులను అనుగ్రహిస్తుంది. ఆలయంలోని ఈశాన్యదిశలో రావి మరియు వేపచెట్ల క్రింద శేషశాయి ప్రతిష్ట జరిగింది. సర్పదోష నివారణ మరియు సంతాన ప్రాప్తికై భక్తులు ఇచట ప్రదిక్షణలు చేస్తారు. ఈ ఆలయంలో వివాహ కంకణం ధరించినవారికి వెంటనే కళ్యాణం జరుగునని భక్తుల విశ్వాసం.