సాలగ్రామం శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావిస్తారు. ఇవి చాలా అరుదైనవిగా చెబుతారు. నర్మదా నది యందు మరియు ఖాట్మండు నగరానికి ఉత్తరాన గండకీనదిలో మాత్రమే ఇవి లభిస్తాయని చెబుతారు. మరి శ్రీ మహావిష్ణవు సజీవ రూపమే సాలగ్రామం అని ఎందుకు అంటారు? అసలు సాలగ్రామం ఎలా ఏర్పడుతాయనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.
పూర్వము శాలంకాయనుడనే ఋషి తపస్సునకు మెచ్చి శ్రీ మహావిష్ణువు గండిక నది ఒడ్డున ఒక సాలా వృక్షాన్ని కల్పించి అక్కడ తాను స్వయం వ్యక్త శిలామూర్తిగా వెలిశాడని వరాహ పురాణం చెబుతుంది. అందువల్లనే సాలాగ్రామానికి మొదటి పేరు సాలగ్రావం అని చెప్తారు.
సాలి గ్రావం అంటే కీటకంతో చేరిన శిల అనే అర్ధం వస్తుంది. అయితే సాక్షాత్తు విష్ణుమూర్తి సజీవ దివ్యరూపమే సాల గ్రామమని పురాణాలూ చెబుతున్నాయి. అందుకే వాటిని శ్రీమూర్తులు అని అంటారు.
వజ్ర కీటకాలు ఈ సాలగ్రామ శిలల్ని తమ వాడి పండ్లతోను, రెక్కలతోను తొలచి అలా ఏర్పడిన రంద్రాలలో కొంత కాలం ఉండి వేసవి కాలంలో వెళ్లిపోతాయి. ఈ కీటకాలనే స్వర్ణ భ్రమరాలని పిలుస్తారు. అందుకే సాలాగ్రామాల్లో స్వర్ణ రేఖలు, మచ్చలు కూడా కనబడతాయి.
సాలగ్రామం ముఖ్య చిహ్నం చక్రం. దాని మీద ఉన్న చక్రాన్ని బట్టి, రూప చిహ్నాలను బట్టి వివిధ దేవతామూర్తులుగా వీటిని గుర్తిస్తారు. అయితే వీటిని ఆలయాల్లో, గృహ ఆరాధనలలో పూజించవచ్చు. ఇవి ఒకటిగానే తప్ప ఇతర బేసి సంఖ్యలలో ఉండరాదు. ఇంకా రెండు తప్ప ఇతర సరి సంఖ్యల్లో ఉండవచ్చు.
పురుష సూక్త, శ్రీ సూక్తములతో సాలాగ్రామములకు అభిషేకము, షోడశోపచార అర్చన చేసి, తులసి తో కూడిన సాలగ్రామ తీర్థమును, ప్రసాదమును స్వీకరించాలి. ఈ నిత్యపూజకు ఎలాంటి ఆటకం కలుగకూడదు. ఉసిరిక పండు పరిమాణం కంటే సాలగ్రామం చిన్నదిగా ఉండటం మంచిది. ఒకవేళ సాలగ్రామాలు కొత్తవి అయితే పెద్దలకు చూపెట్టిన తరువాతే పూజలో పెట్టుకోవాలి. ఇక నెలసరి ఆటంకాలు ఉన్న స్త్రీలు సాలాగ్రామార్చన చేయరాదని శాస్రాలు చెబుతున్నాయి.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.