శని దోష నివారణకు పాటించాల్సిన కొన్ని నియమాల

మనలో చాలామంది జ్యోతిషం, జాతకాన్ని నమ్ముతారు.. అలాంటి వారందరినీ ఎక్కువగా టెన్షన్ పెట్టేది శని దోషం. ఎవరికైనా శనిదోషం ఉంటే ఆరోగ్య సమస్యలను ఎదుర్కొవచ్చు లేదా వ్యాపారాల్లో నష్టాలు, కెరీర్ లేదా వ్యక్తిగత సంబంధాల్లో వైఫల్యం పొందడం లాంటివి జరిగే అవకాశముంటుంది. ముఖ్యంగా గ్రహాలు, నక్షత్రాల స్థితిని బట్టి చెడు ప్రభావాలు ఒక వ్యక్తికి ఇంకొ వ్యక్తికి మారవచ్చు. ఒక్క సారి శనిదోషం ఏర్పడితే ఏడున్నరేళ్ల పాటు ఉంటుంది. అందుకే మన పెద్దవాళ్లు ఏడున్నర్ధం శని అని అంటారు. అంతేకాకుండా జీవితంలో మతిమరుపుతో తీవ్ర పరిణామాలతో అనేక సవాళ్లను ఎదుర్కుంటుంటారు. అన్నింటికంటే శని ప్రభావాలు చాలా ముఖ్యమైనవి ఎందుకంటే ఇది ఒక వ్యక్తి జీవితాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తుంది.

Saniఅరుదుగా మాత్రమే శని దాని ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది ఎందుకంటే ప్రస్తుత లేదా మునుపటి జన్మలో చేసిన కర్మపై ఈ శని ప్రభావం ఆధారపడి ఉంటుంది. అంటే శని చెడుప్రభావాలు మనుషులు చేసే కర్మలకు అనుగుణంగా ఉంటుంది. ముఖ్యంగా మనదేశంలో పిల్లలు పుట్టగానే కుండలిని ఏర్పాటు చేసి వారు జన్మించిన గ్రహం, నక్షత్రం ఆధారంగా శనిదోష నివారణకు పూజలు చేస్తారు. దీని వల్ల వారి భవిష్యత్తు బాగుంటుందని, ఎలాంటి సమస్యలకు అనారోగ్యాలకు, దుష్ప్రభవాలకు గురికాకుండా ఉంటారని నమ్ముతుంటారు. మరి ఇలాంటి శని దోష నివారణకు పాటించాల్సిన కొన్ని నియమాల గురించి మనం ఇపుడు తెల్సుకుందాం..

Sani Doshamశని దేవుడిని తలుస్తూ శనివారం నాడు నలపు లేదా ముదురు నీలం రంగులో ఉన్న బట్టలను ధరించి.. ఆ రోజు ఆయనకు అంకితమివ్వాలి.నలుపు రంగు నువ్వులను నల్లటి వస్త్రంలో మూటకట్టి నువ్వుల నూనేలో ముంచాలి. అనంతరం ఆ వస్త్రాన్ని దీపం మాదిరి వెలిగించి భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని, శనిదేవుడిని పూజించాలి. హనుమంతుడిని ఎందుకు పూజించాలి అంటే.. పూర్వం రావాణాసురుడి భారి నుంచి శనిదేవుడిని ఆంజేనేయుడు కాపాడుతాడు. అందుకు రుణపడిన శనీశ్వరుడు.. హనుమంతుడిని సేవించేందుకు ముందుకు వచ్చాడు. అప్పుడు ఆంజనేయుడు తన భక్తులకు శని ప్రభావం లేకుండా చూడాలని శనీశ్వరుడిని అడుగుతాడు. అప్పటి నుంచి హనుమంతుడిని కొలిచేవారికి శని చెడు ప్రభావం అంటదు.

saniపొద్దున్నే నిద్రలేచిన తర్వాత స్నానమాచరించి భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా, శని చాలీసా పఠించాలి. మంగళవారం, శనివారాల్లో మద్యపానం, పొగాకు సేవించడం, మాంసం తినడం లాంటి వాటిని త్యజించి భక్తి శ్రద్ధలతో హనుమంతుడిని, శని దేవుడిని పూజించాలి. మీ పనులు, మాటలు వల్ల గానీ ఎవరికీ ఆపద తలపెట్టకుండా ఇతరుల పట్ల గౌరవ మార్యాదలతో మెలగాలి. ఎందుకంటే మన కర్మలమీద మన క్రియలు ఆధారపడి ఉంటాయి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR