సతీదేవిని కామాఖ్యా దేవిగా కొలుస్తారు. అయితే సతీదేవి, కామాఖ్యాదేవిగా ఎలా అవతరించింది? ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఆ ఆలయం యొక్క విశిష్టత ఏంటి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.కామాఖ్య దేవాలయం, గౌహతి నగరానికి పశ్చిమ భాగంలో నాలాచల్ కొండల యందు ఉన్నది. ఇది అనేక దేవాలయాలు కలిగిన ప్రత్యేక దేవాలయం. కామాఖ్య దేవాలయం లో పది ఆలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలన్నీ పది మహావిద్యలకు అంకితం చేయబడ్డాయి. సాధారణ హిందూ భక్తులకు మరియు తాంత్రిక భక్తులకు ఇదొక ముఖ్యమైన యాత్రా స్థలం. కాళికా పురాణం ప్రకారం కామాఖ్య భక్తుల కోరికలను తీర్చేదిగా, శివుని చిన్న భార్యగా, ముక్తిని ప్రసాదించేదిగా వర్ణించారు.ఇక ఈ ఆలయ స్థల పురాణానికి వస్తే, పరమేశ్వరుని భార్య అయినా సతీదేవి తన తండ్రి అయినా దక్షుడు ఒక మహాయాగాన్ని నిర్వహిస్తూ ఆ యాగానికి తనను, తన భర్తని ఆహ్వానించకపోయిన ఆ యాగానికి వెళ్ళడానికి నిర్ణయించుకుంటుంది. పరమశివుడు ఎంతగా వాదించిన ఆమె వినకుండా ఆ యాగానికి వెళుతుంది. అక్కడికి వెళ్లిన సతీదేవికి అందరి ముందు అవమానం కలుగగ, ఆ అవమానం భరించలేక యజ్ఞగుండంలో దూకి ఆత్మహత్య చేసుకుంటుంది. ఆ విషయం తెలుసుకున్న పరమశివుడు పట్టా రాని కోపంతో తన జటాజూటంలో నుండి ఒక వెంట్రుక తీసి నెలకు కొట్టగా, వీరబద్రుడు జన్మించి, ఆ యజ్ఞశాల మొత్తాన్ని చిన్నాభిన్నం చేసి దక్షుని తల నరికివేసాడు.పరమేశ్వరుడు దుఃఖిస్తూ ఆవేదనతో సతీదేవి మృత శరీరాన్ని భుజాన వేసుకొని, భూమి అంత తిరుగుతూ, మహా రౌద్రాకారంతో ప్రళయతాండవం చేయడం ప్రారంభించాడు. అప్పుడు భయంతో బ్రహ్మాది దేవతలు వెళ్లి విష్ణుమూర్తిని ప్రార్ధించగా, సతీదేవి శరీరం శివుని బుజం మీద ఉన్నంతవరకు అతని ఆవేశం తగ్గదు అని గ్రహించి, విష్ణుమూర్తి తన చక్రయుధంతో ఆ శరీరాన్ని ముక్కలుగా నరికివేశాడు. ఆలా సతీదేవి శరీరం 51 ముక్కలు అయి వివిధ ప్రాంతాల్లో పడ్డాయి. అందులో 18 ప్రదేశాలను అతి పవిత్రంగా చెబుతారు. వీటినే అష్టాదశ శక్తి పీఠాలు అంటారు. సతీదేవి శరీరం నుండి ఆమె యోని భాగం పడ్డ చోటున కామాఖ్యా దేవి రూపంలో వెలసింది. విశ్వకర్మ చేత ఈ ఆలయం నిర్మించబడింది. ఆ మందిరాన్ని శక్తి స్థూలంగా పూజిస్తారు.అమ్మవారు ప్రతిఏటా జూన్ రెండవ వారంలో బహిష్టు అవుతుంది. ఆ సమయంలో గుడిని నాలుగు రోజులు మూసేస్తారు. అయిదవ రోజు స్నానం తర్వాత దేవాలయాన్ని తెరిచి భక్తులకు దర్శనం కలిగిస్తారు. అస్సామీ భాషలో దీనిని అంబుబాచి అని పిలుస్తారు. ఆ సమయంలో జరిగే వేడుకలను అంబుబాచి మేళా గా జరుపుకుంటారు.ఈ ఆలయం ఒక చిన్న కొండా మీద ఉంది. ఈ కొండ సాక్షాత్తు శంకరుని శరీరమే అని, సతీదేవి శరీరంలో నుండి ఆమె యోనిభాగం ఈ కొండమీద పడగానే, ఈ కొండ మొత్తం నీలం రంగు మారిపోయిందని అందుకే ఈ కొండని నీలాచలం అంటరాని స్థలపురాణం వివరిస్తుంది.ఇంతటి పవిత్ర క్షేత్రం కనుకే ఈ ఆలయానికి భక్తులు ఎప్పుడు అధికసంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.