Home Unknown facts సతీదేవి వక్షస్థలం పడిన శ్రీ మంగళగౌరి దేవి ఆలయం

సతీదేవి వక్షస్థలం పడిన శ్రీ మంగళగౌరి దేవి ఆలయం

0

మన దేశంలో ఉన్న అష్టాదశ శక్తి పీఠాలలో శ్రీ మంగళగౌరి దేవి ఆలయం కూడా ఒకటిగా వెలుగొందుచున్నది. సతీదేవి వక్షస్థలం పడిన ప్రదేశం ఇదేనని చెబుతారు. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Mangalagowriబీహార్ రాష్ట్రంలోని పాట్నాకు సుమారు 96 కి.మీ. దూరంలో, గయ బస్టాండ్ నుండి 3 కి.మీ. దూరంలో, విష్ణుపద మందిరానికి కి.మీ. దూరంలో ఫల్గుణీ నది తీరంలో శ్రీ మంగళగౌరి దేవి ఆలయం ఉంది. ఈ ఆలయం తూర్పుముఖంగా మంగళగిరి అనే పర్వతం పై నెలకొని ఉంది.

ఈ ఆలయంలో అమ్మవారిని భక్తులు మంగళ గౌరీ లేక సర్వమంగళాదేవి అని పిలుస్తారు. ఈ ప్రదేశం ఫల్గుణీ, మధుర, శ్వేద నదుల సగమస్థానముగా ప్రసిద్ధి చెందింది. ఇంకా ఇక్కడ దశావతారాలు చెక్కిన ఆలయం, మహిషాసుర మర్దిని ఆలయం, అరణ్య దేవి ఆలయం, కాళిదాసుని కరుణించిన దేవత, రాత్రి పూట మాత్రమే ఆరాధించే ఓ స్వామి ఆలయం, నిరంజన, అహల్యాదేవి ఆలయాలు ఈ పవిత్ర గయా క్షేత్రంలో ఉన్నాయి.

ఈ ఆలయంలో గర్భాలయం వైశాల్యం తక్కువగా ఉంటుంది. ఇక్కడ కేవలం ఇద్దరు లేక ముగ్గురు వెళ్ళడానికి మాత్రమే లోపలకు వీలు ఉంటుంది. గర్భాలయానికి ఎదురుగా గణేశమందిరం ఉంటుంది. ఇక గర్భాలయంలో ఉన్న దేవి పట్టువస్ర్తాలతో, రాక్షస సంహారిణిగా భక్తులకు దర్శనమిస్తుంది. ఈ ఆలయ ప్రవేశ ద్వారం వద్ద మంటపం, హోమగుండం ఉంటాయి. ఆలయ ప్రాంగణంలో నంది, నందికి ఎదురుగా శివలింగాకారంలో ఉన్న పరమేశ్వరుడు భక్తులకి దర్శనమిస్తారు.

ఈ ప్రాంతంలోనే ఉన్న జనార్దనస్వామి ఆలయం అతి ప్రాచీనమైనది. ఇక్కడ స్వామివారు నయనమనోహరంగా భక్తులకి దర్శనమిస్తారు.

ప్రతి మంగళవారం, శ్రావణ మంగళవారాలలో అమ్మవారికి విశేష పూజలు, వ్రతాలు చేస్తారు. ఇంకా మహాశివరాత్రి, కార్తీకమాసాలలో విశేష పూజలు ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు.

Exit mobile version