తిమ్మురులకు గల ప్రధాన కారణాలు ఏంటో తెలుసా ?

0
1753

శరీరమంతా సూదులతో గుచ్చుతున్నట్లుగా.. నడుస్తుంటే మంటగా.. జివ్వుమని లాగేస్తున్నట్లుగా అనిపించడమే ‘తిమ్మిరి’. మనం ఒకే చోట కదలకుండా ఉండేప్పుడు ఏర్పడే తిమ్మిరిలతో పెద్దగా ప్రమాదం ఉండదు. కానీ, దీర్ఘకాలికంగా వేదించే తిమ్మిర్లతోనే జాగ్రత్తగా ఉండాలి. అది వ్యాధులకు సంకేతంగా భావించాలి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే.. నరాల వ్యవస్థ నాశనమవుతుంది. ఆ తర్వాత కోలుకోలేనన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

Seizure Symptoms and causesఈ సమస్యకు గల కారణాలను శాస్త్రవేత్తలు ఇంకా పూర్తిస్థాయిలో నిర్ధారించలేదు. కానీ, తరచుగా ఈ సమస్య తలెత్తడం కొన్ని విపరీత ఆరోగ్య పరిస్థితులకు దారితీయవచ్చని వారు అనుమానిస్తున్నారు.

తిమ్మురులకుగల ప్రధాన కారణాలు :

  • రక్తప్రసరణ సమస్యలు
  • సుదీర్ఘకాలం తక్కువ ఉష్ణోగ్రతలలో ఉండడం
  • థైరాయిడ్ వ్యాధి
  • డీహైడ్రేషన్
  • నిర్దిష్టరకాల ఔషదాలు.
  • కిడ్నీవ్యాధులు
  • గాయాలు
  • అధిక శారీరకశ్రమ
  • కండరాల ఓవర్లోడ్ కాల్షియం లేకపోవడం
  • గర్భం
  • పొటాషియం లోపించడం
  • మెగ్నీషియం లోపించడం

ఈ తిమ్మిరికి, తీవ్రమైన ఆరోగ్య సమస్యలు కారణం కాదని గమనించినట్లయితే, సులువుగా తగ్గించుకోవచ్చు.

Seizure Symptoms and causesతిమ్మిరుల చికిత్స :

మెగ్నీషియం :

Seizure Symptoms and causesమీరు తరచుగా తిమ్మిరిని ఎదుర్కొంటున్నట్లయితే మీ రోజువారీ ఆహారంలో మెగ్నీషియం ఉండేలా జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుంది. మీరు ఈ పోషక పదార్ధంతో కూడిన విత్తనాలు మరియు గింజలను కూడా తీసుకోవచ్చు. ముఖ్యంగా కొబ్బరినీళ్ళలో కూడా అధిక మెగ్నీషియం నిల్వలు ఉంటాయి. సప్లిమెంట్స్ తీసుకోవాలని అనుకుంటే సంబంధిత వైద్యుని సంప్రదించడం మంచిది.

కదలకుండా ఉండకండి :

Seizure Symptoms and causesఎటువంటి వ్యాయామాలు చేయకపోయినా, కనీసం నడవాలి. శరీరం స్తబ్దుగా ఎటువంటి కదలిక పాటించని పక్షంలో రోగనిరోధకత కూడా మందగిస్తుంది. కాబట్టి మీ రోజూవారీ విధానంలో భాగంగా వ్యాయామం కూడా ఉండేలా చర్యలు తీసుకోవలసి ఉంటుంది. క్రమంగా మీ కండరాల తిమ్మిరి సమస్య కూడా తొలగిపోతుంది.

నీటిని తీసుకోవడం పెంచండి :

Seizure Symptoms and causesకాళ్ళ తిమ్మురులకు గల ప్రధాన కారణాలలో నిర్జలీకరణం(డీహైడ్రేషన్) కూడా ఒకటి. రోజూవారీ అవసరానికి మాత్రమే నీటిని తీసుకోవడం చేస్తుంటారు కొందరు. అధిక శారీరిక శ్రమ, ఎండతాకిడి, శరీర జీవక్రియలు వంటి అనేక కారకాల మూలంగా శరీరానికి ఎప్పటికప్పుడు నీటి అవసరం ఉంటుందని మరవకండి. రోజూవారీ శరీర అవసరాల దృష్ట్యా నీటిని తరచుగా తీసుకోవడం మూలంగా కూడా మీ ఆరోగ్యం కుదుటపడుతుంది.

ఎప్సోమ్ ఉప్పు కలిపిన నీటితో స్నానం :

Seizure Symptoms and causesఅనేకమంది నిపుణులు, మరియు శిక్షకుల ప్రకారం, ఎప్సోమ్ ఉప్పు కలిపిన స్నానం శరీరానికి మంచిదని సూచించబడింది. ఇది తిమ్మిరులను తొలగించడమే కాకుండా, దీనిలోని మెగ్నీషియం కండరాలకు ఉపశమనాన్ని అందిస్తుంది. తరచుగా కనీసం వారానికి ఒకసారైనా ఎప్సోం ఉప్పు కలిపిన నీటితో స్నానం చేయడం మంచిది.