Home Unknown facts Shabarimala aalayam paina aavidhanga raasi undatam venuka kaaranam

Shabarimala aalayam paina aavidhanga raasi undatam venuka kaaranam

0

శబరిమల యాత్ర అనేది అయ్యప్ప మాలా ధరించిన భక్తులు 45 రోజుల పాటు భక్తి శ్రద్దలతో దీక్ష చేసి ఇరుముడి కట్టుకొని శబరిమలకి బయలుదేరుతారు. అయితే మనం శబరిమల ఆలయాన్ని చూసినట్లయితే ఆ ఆలయం పైన “తత్వమసి” అని రాసి ఉంటుంది. మరి అలా ఎందుకు రాసి ఉంది? అలా రాసి ఉండటం వెనుక కారణం ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. shabarimalaప్రపంచంలోని ప్రతి జీవి కూడా భగవంతుడు సృష్టించినదే. అలాగే అన్ని జీవులూ పరమాత్మ నుంచి పుట్టి, చివరకు ఆ పరమాత్మలో ఐక్యం అవుతాయి. ఆయన అందరిలోనూ ఆత్మరూపంలో ఉన్నాడు. మనల్ని జీవాత్మలు అంటారు. పవిత్రమైన ఇరుముడిని శిరస్సున పెట్టుకొని, పావన పదునెట్టాంపడి ఎక్కగానే మనకి భగవంతుడి కన్నా ముందే దర్శనమిచ్చే మహావాక్యం తత్వమసి. అంటే భక్తితో అయ్యప్పకు నమస్కరించే ముందే, నమస్కారానికి మూలమైన తత్వమసి మహావాక్యం మనకు దర్శనమిస్తుంది. అంటే నమస్కరించే ముందు ఎందుకు, ఎవరికి నమస్కరిస్తున్నామో తెలుసుకొని నమస్కరించమని తెలియజేస్తుంది. మనం నమస్కారం చేసేప్పుడు రెండు చేతులను కలిపి నమస్కరిస్తాము. అంటే నిలోని ఆత్మ , నాలోని ఆత్మ ఒక్కటే అని చెప్పడం. ఎదుటి వ్యక్తికి, మనకి భేదం లేదని, మనమంతా ఒక్కటే అని చెప్పకనే చెబుతాం. అంతా ఒక్కటిగా మెలగమని మన పూర్వీకులు మనకు నేర్పించిన అద్భుతమైన సంస్కారం ఈ నమస్కారం. తత్వమసి అనేది సంస్కృత పదం. తత్‌+త్వం+అసి అను మూడు పదముల కలయికే తత్వమసి, అంటే తత్‌=అది, త్వం=నీవై, అసి=ఉన్నావు. అది నీవై ఉన్నావు అనున‌ది తత్వమసి వాచ‌కానికి అర్థము. ఇన్నాళ్లూ మాలధరించి, దీక్షబూని, కొండలు, కోనలు దాటి పావన మూడార్ల మెట్లుదాటి, ఏ పరబ్రహ్మ తత్వమును చూడదలిచి వచ్చావో అది నీవై ఉన్నావు, నీలో పరమాత్మ అంతర్యామియై ఉన్నాడు అని తెలియజేస్తుంది. అందరికీ అంతర్ముఖంగా పరమాత్మ సాక్షాత్కారం కలిగించే ప్రక్రియయే నీవు. మండల కాల బ్రహ్మచర్య దీక్ష అనే ఆత్మ ప్రబోధ‌ను కలిగించి, అందరిలోనూ స్వామి అయ్యప్పను దర్శించేలా మానవాళిని తీసుకెళ్లే సత్‌ ప్రబోధ‌మే తత్వమసి అని వర్ణిస్తారు.
అందుకే శబరిమలలో పదునెట్టాంపడి ఎదురుగా సన్నిధానం పైభాగాన అందరికీ కనిపించేలా దీన్ని లిఖించారు.

Exit mobile version