Home Unknown facts ప్రపంచం మొత్తంలో శివపార్వతులు ధ్యానంలో ఉండే ఏకైక విగ్రహం

ప్రపంచం మొత్తంలో శివపార్వతులు ధ్యానంలో ఉండే ఏకైక విగ్రహం

0

పరమ శివుడు యొక్క భార్య పార్వతీదేవి. అయితే పార్వతి దేవికి దేశంలో ఎన్నో ఆలయాలు అనేవి ఉన్నాయి. అందులో ఈ ఆలయం చాలా ప్రత్యేకమని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ ఆలయంలోని అమ్మవారు ఒక్కో సమయంలో ఒక్కో రూపంలో భక్తులకి దర్శనం ఇస్తారంటా. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? అమ్మవారి రూపం అలా మారడానికి కారణం ఏంటి అనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

The Change Of Lord Parvati Form

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లా సాలూరు ప్రాతంలో  శ్రీ పారమ్మ కొండ క్షేత్రం ఉంది. ఒక ఎత్తైన కొండ మీద ఈ ఆలయం వెలసింది. ఈ కొండ దిగువన నుండి అమ్మవారి ఆలయాన్ని చేరుకోవడానికి సుమారు 2800 మెట్లు వుంటాయి. ఇక్కడి కొండకి విశేషం ఏంటంటే ఈ శిఖరం శివలింగాకారంలో ఉంటుంది. ఇంకా ఈ ఆలయంలో అమ్మవారి విగ్రహం పై శివుడు ధ్యానం చేస్తూ కనిపిస్తాడు. అయితే ప్రపంచం మొత్తంలో శివపార్వతులు ధ్యానంలో ఉండే ఇటువంటి విగ్రహం ఇక్కడ మాత్రమే కనిపిస్తుంది. కొన్ని వందల సంవత్సరాల పూర్వం జైనుల కాలంలో అమ్మవారిని ప్రతిష్ఠించినట్లు చెబుతారు.

అయితే పూర్వము దేవతలు ఇక్కడ నిత్యం ధ్యానం చేసేవారంట.  మహిమ గల అమ్మవారి విగ్రహం 36 చేతులు శిరస్సుపై శివుడు కలిగి ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైనది. జైన్ లకు సంబంధించిన కొన్ని పురాతన గ్రంథాలలో కూడా మన అమ్మవారి చరిత్రవుంది. అయితే  అమ్మవారి రూపం ఒక్కోసమయంలో ఒక్కోలా ఉంటుంది. ఒకసారి నవ్వుతు ఒకసారి చిన్నపిల్లలా ఒకసారి మౌనంగా ఒకసారి పెద్దమ్మలా ఇలా చాలా రకాలుగా అమ్మవారి విగ్రహం మారుతూ మనకు కనిపిస్తుంది. కొన్ని విశిష్టమైన రోజుల్లో మరియు ఆమావాస్యరాత్రులలో కొండపై వెలుగులతో కూడిన జ్యోతుల కనిపిస్తాయి అని ప్రత్యక్షంగా చుసిన కొండ క్రింద గ్రామాలలో నివసించే గిరిజనులు చెప్తారు. ఇందుకు నిదర్శనంగా ఇప్పుడు కూడా అమ్మవారిని దేవతలు శక్తులు జ్యోతిరూపంలో దర్శించి పూజిస్తారు అని ఇక్కడ ప్రజల నమ్మకం.

ఇక్కడ కొండ మధ్యలో ఓ గుహ వుంది. అయితే పాండవులు వనవాస సమయంలో కొద్ది రోజులు ఇక్కడే ఉన్నారట అందుకే ఆ గుహకు పాండవుల గుహ అని పేరు. ఆ గుహలో చాలా పురాతన శివలింగం ఒకటి ఉంది. కొండపై హనుమంతు అనే కోతి జాతి గుంపు ఒకటుంది ఇవి 3నుండి 5 అడుగుల ఎత్తు ఉంటాయి. ఈ మహిమగల కొండపై ధ్యానం చేసేవారికి త్వరగా సిద్దులు వస్తాయి అని నమ్మకం. సిద్దులు ప్రసాదిస్తుంది కనుక తల్లిని సిద్దేస్వరి అని, చేతిలో చక్రాలు వున్నాయి కనుక చక్రేస్వరి అని పార్వతీదేవి కనుక పారమ్మతల్లి అని వనదుర్గ అని అమ్మవారి పేర్లు రకరకాలుగా పిలుస్తారు. కాని స్థానికులు మాత్రం పారమ్మతల్లి గానే కొలుస్తారు.

గత కొన్ని సంవత్సరాలుగా ప్రతి పౌర్ణమి రోజున క్రమం తప్పకుండా అమ్మను సనాతన ధర్మపరిషత్ భక్తులు దర్శించి పూజలు చేస్తున్నారు. మిగతా రోజుల్లో ఈ కొండ ఎక్కడం చాలా కష్టం. ఒకవేళ కొండ ఎక్కి అమ్మవారిని దర్శించాలి అంటే స్థానిక గిరిజనుల సహాయం తీసుకోవాల్సిందే అని చెబుతున్నారు.

ఈవిధంగా కొండ ప్రాంతంలో ఎన్నో విశేషాల నడుమున వెలసిన ఈ శ్రీ పారమ్మ కొండ క్షేత్రం గిరిజనుల ఆరాధ్య దైవంగా విరాజిల్లుతుంది.

Exit mobile version