శివలింగం, నందీశ్వరుడు వేరు వేరుగా దర్శనం ఇచ్చే ఆలయం!!

శివాలయంలోకి అడుగుపెట్టగానే పరమేశ్వరునికంటే ముందుగా నందినే దర్శించుకుంటాం. కొందరు నంది రెండు కొమ్ముల మధ్య నుంచీ పరమేశ్వరుని చూస్తే, మరికొందరు ఆయన చెవిలో తమ అభీష్టాలని
చెప్పుకుంటారు. నంది పరమేశ్వరునికి ద్వారపాలకుడు కాబట్టే ఆయనకి అంత ప్రాముఖ్యత…

Sri Airavateshwara Swamy Templeసాధారణంగా శివాలయానికి వెళ్ళినప్పుడు మనం ఆలయానికి ప్రదక్షిణ చేసి పరివార(ఇతర)దేవతల దర్శనం చేసి పరమశివున్ని దర్శించుకుంటాము. కొందరు భక్తులు నందీశ్వరునికి నమస్కరించి
వెళ్ళిపోతారు. కానీ అది అసంపూర్ణ దర్శనం అని శాస్త్రాలు చెబుతున్నాయి. పరమేశ్వరుడికి అనుంగుభక్తుడు నందీశ్వరుడు. అందుకనే ఆ లయకారకుడు నందిని తన వాహనంగా చేసుకున్నాడు. ప్రతి శివాలయంలోనూ శివలింగానికి ఎదురుగా నంది విగ్రహం వుంటుంది.

Sri Airavateshwara Swamy Temple nandiఅయితే మన దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ శివాలయంలో శివునికి ఎదురుగా నంది దర్శనం ఇవ్వదు. మరి ఇలాంటి ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ విశిష్టత ఏమిటి అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం…

తమిళనాడు రాష్ట్రం, తంజావూరు జిల్లా, ధారసూరం అనే గ్రామంలో శ్రీ ఐరావతేశ్వర స్వామి దేవాలయం ఉంది. ఇక్కడ మనకు రెండు ఆలయాలు దర్శనమిస్తాయి. ఒక ఆలయంలో స్వామివారి దర్శనం ఇవ్వగా మరొక ఆలయంలో అమ్మవారు దర్శనమిస్తారు.

Sri Airavateshwara Swamy TempleSri Airavateshwara Swamy Templeఈ ఆలయంలో కొలువై ఉన్న స్వామివారిని రాజరాజేశ్వరుడిగా, అమ్మవారిని రాజరాజేశ్వరీ దేవిగా భక్తులు పూజిస్తారు. అయితే ఈ ఆలయాన్ని నిర్మించిన రాజు తన పేరు వచ్చే విధంగా ఈ ఆలయానికి ఐరావతేశ్వర స్వామిగా పిలువబడుతూ భక్తులకు దర్శనమిస్తోంది.

Sri Airavateshwara Swamy Templeఇక ఆలయం విషయానికి వస్తే ఆలయం లోపలికి వెళ్లడానికి, బయట వైపు గోపుర ద్వారానికి ఎదురుగా రెండు చిన్న మండపాలు ఉంటాయి. ఈ మండపం ఒక దానిలో మనకు నందీశ్వరుడు దర్శనమిస్తాడు.ఈ ఆలయం ఈ విధంగా స్వామివారి విగ్రహానికి ఎదురుగా కొండా బయటవైపు నందీశ్వరుడు దర్శనమివ్వడం ఈ ఆలయ ప్రత్యేకత అని చెప్పవచ్చు.

Sri Airavateshwara Swamy Templeఈ ఆలయ గోడలపై ఏక్కడ కూడా ఏ మాత్రం ఖాళీ స్థలం లేకుండా అద్భుతమైన శిల్పాలు చెక్కబడి వున్నాయి. ఈ విధంగా మన దేశంలో ఎక్కడా లేని విధంగా శివలింగం, నందీశ్వరుడు వేరు వేరుగా ఉండి భక్తులకు దర్శనం కల్పిస్తూ ఉండడం ఈ ఆలయంలో చూడవచ్చు

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,570,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR