Home Unknown facts Shivalingam leni aa jaladhara aalayam ekkada undho thelusa?

Shivalingam leni aa jaladhara aalayam ekkada undho thelusa?

0

పరమ శివుడి ప్రసిద్ధ ఆలయాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఇక్కడ ఆలయంలో శివలింగం అనేది భక్తులకు దర్శనం ఇవ్వదు. ఇక్కడ ఉండే జలధారనే భక్తులు దైవంగా భావించి పూజలు చేస్తుంటారు. మరి ఆ ఆలయం ఎక్కడ ఉంది? ఆ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. shivalingamగుజరాత్ రాష్ట్రము, మెహ్సానా జిల్లా సాల్ది గ్రామం లో శ్రీ పి౦ప్లేశ్వర మహా దేవాలయం ఉంది. సాల్ది నొ మెనో అంటే నవ్వుల పండగ అనే వార్షిక ఉత్సవానికి మిక్కిలి ప్రసిద్ధమైనది. శ్రావణ మాసం చివరి సోమవారం ఈ ఉత్సవం ఇక్కడ జరుగుతుంది . ఇక్కడి మరో విశేషం ప్రతి శివాలయం లో ఉన్నట్లు ఈ ఆలయం లో శివ లింగమే లేక పోవటం. అయితే లింగానికి బదులు భూమిలో ఉన్న జలశాల నుంచి పైకి ఉబికే జలధార నే దైవంగా భావించి పూజిస్తారు అందుకని దీన్ని జలధారి అంటారు. ఈ సహజ సిద్ధ జల ధార అత్యంత పవిత్రమైనదిగా భావిస్తారు.సాల్ది గ్రామం అహ్మదాబాద్ కు 60 కిలోమీటర్లలో ఉన్నది .అందమైన గ్రామీణ వాతావరణం ,ఇక్కడే ప్రత్యేకమైన రావి చెట్లు, బిల్వవృక్షాలు , వాఖాడ వ్రుక్షాలవలన ఈ ఆలయానికి శోభా , జనాకర్షణ ఎక్కువ. రావి చెట్టు అత్యంత పవిత్రంగా భావిస్తారు. అంతేకాకుండా వృద్ధ వృక్షాలు అత్యంత శక్తి జనకాలని నమ్మకం. ఆరోగ్యానికి రావి చాలా ముఖ్యమైనది . రావి చెట్టు గాలి చల్లదనానికి, ఆరోగ్యానికి, శ్రేయస్సుకు, ఆయుర్ వృద్ధికి, మానసిక ప్రశాంతత కు ప్రసిద్ధి. దాదాపు 100 ఏళ్ళుగా ఈ ఆలయానికి మరమ్మత్తులు చేయలేదు కనుక చాలా పాతః దేవాలయంగా కనిపిస్తుందిఆలయ స్థల పురాణానికి వస్తే, సుమారు 200 ఏళ్ళక్రితం సాల్వభాయ్ పటేల్, తేజా పటేల్ అనే తండ్రీ కొడుకులు గుజరాత్ లోని చామ్పనేర్ నుండి ఇక్కడికి వచ్చి స్థిరపడ్డారు. 7 తరాలుగా వారి వంశం ఇక్కడ వర్దిల్లుతోంది . కనుక గ్రామ నామం వారి పేరు మీదనే సాల్ది అయింది . ఆ వంశం లో పేథాపటేల్ అనే ఆయన గారి ఆవు రోజూ ఒక చోటరావి చెట్టుకింద పాలు కారుస్తున్నట్లు గమనించాడు. ఆ గోవు తన క్షీరం తో నిత్యాభిషేకం శివునికి చేస్తున్నట్లు గ్రహించారు అప్పటినుంచి ఈ ప్రదేశానికి విపరీతమైన ప్రసిద్ధి ఏర్పడి భక్త జన సందోహం తో కళకళ లాడుతోందిపేథా పటేల్ ఇక్కడే మొట్టమొదట ఆలయం క్రీ.శ.1086 లో కట్టించాడు. ఇప్పుడున్న దేవాలయాన్ని బరోడా మహారాజు సాయాజీ రావు గైక్వాడ్ 1895 లో నిర్మించాడు. ఈ ప్రసిద్ధ అశ్వత్ధ శివ మహా దేవాలయం సుమారు 50 ఎకరాల విస్తీర్ణం లో ఉన్నది. ఇక్కడే ఉమయా, అంబా లక్ష్మి గణేష్, పార్వతి నాగ దేవత, హనుమాన్ దేవాలయాలున్నాయి. ధ్యానానికి మందిరం కట్టారు అందులో శివ పంచాక్షరి మంత్రం జపం చేసుకొంటారు భక్తులు. శివరాత్రి నాడు మహా వైభవం గా పూజలు భజనలు ,సంకీర్తనలు నిర్వహిస్తారు. శ్రావణమాసం లో ఎంతో దూరాన్నుంచి భక్తులు శివపంచాక్షరి, దూన్ ఉచ్చరిస్తూ పి౦ప్లేశ్వరాలయానికి వచ్చి శివమహా దేవుడైన జలదారి ని అర్చించి తరిస్తారు . ఇంకా ఇక్కడ నంది పై శివుని ఉంచి 5 సార్లు ఆలయం చుట్టూ ప్రదక్షిణ గా ఊరేగిస్తారు.ఇక శ్రావణ మాస చివరి సోమవారం భారీ ఎత్తున నిర్వహించే సలాది నొ మెలో ఉత్సవానికి దాదాపు మూడు లక్షలమంది యాత్రిక భక్తులు హాజరై పాల్గొంటారు. బిల్వ పత్ర పూజ రోజున భక్తులు పూజారికి సహకరిస్తూ లక్ష పత్రి పూజ ఘనంగా చేసి మృత్యుంజయ జపాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో భక్తులు ఆచరిస్తారు.

Exit mobile version