మిస్టరీ గా మిగిలిపోయిన 2,500 ఏళ్ల నాటి రంగులు మారే శివలింగం!

ఈ అనంత విశ్వంలో ఎన్నో వింతలు, విచిత్రాలు..సైంటిస్టులు కూడా ఛేదించలేని రహస్యాలు..మర్మాలు ఎన్నో..ఎన్నెన్నో అటువంటి మర్మాలు సైన్స్‌కి కూడా అందవు. ముఖ్యంగా దేవాలయాలకు సంబంధించిన రహస్యాల గురించి తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగక మానదు. అందులోను శివాలయాల్లో రహస్యాలకు కొదువ లేదు. వాటిలో ఓ శివాలయంలోని శివలింగం రోజుకు మూడు రంగుల్లోకి మారుతుంది.

రంగులు మారే శివలింగంఇప్పటివరకు శివలింగాలను నల్లని రూపంలో, తెల్లని మంచు రూపంలో (అమర్నాథ్ లో మాత్రమే) చూసివుంటాం. మరి రంగురంగుల శివలింగం గురించి మాటేమిటి ? ఇక్కడి ఆలయంలో ఉన్న శివలింగం గురించి కథలు కథలుగా చెప్పుకుంటున్నారు. సందేహపడకుండా చెప్పవచ్చు .. ఇది ఇండియాలో ఉన్న శివాలయాలలో మిస్టరీ ఆలయం అని. ఇంకెందుకు ఆలస్యం, రోజులో మూడు సార్లు రంగులు మార్చే ఆ శివలింగ మహత్యం ఏమిటో తెలుసుకోవటానికి రాజస్థాన్ వెళదాం పదండి !

రంగులు మారే శివలింగం దేశంలో ఉన్న పురాతన శివాలయాల్లో రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో ఉన్న’ అచలేశ్వర మహాదేవ మందిరం’ ఒకటి. దీనికి దాదాపు 2500 సంవత్సరాల చరిత్ర ఉంది. ఇక్కడి గర్భగుడిలోని శివలింగానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ శివలింగం రోజులో మూడుసార్లు.. రంగులు మారుతూ అందర్నీ.. ఆశ్చర్యపరుస్తోంది. ఉదయం ఎరుపు వర్ణంలో, మధ్యాహ్నం కాషాయ రంగులో దర్శనమిస్తుంది. సాయంత్రం కాగానే ఈ శివలింగం నలుపు రంగులోకి మారిపోతుంది. దీనికితోడు ఈ శివలింగం పక్కకు కదులుతుంటుంది. ఈ శివలింగం ఎలా వచ్చిందో, ఎప్పుడు ఆవిర్భవించిందో ఎవరికీ తెలియదు.

రంగులు మారే శివలింగంఈ శివయ్య స్వయంభువుగా వెలసినట్లు చెబుతుంటారు. ఈ విచిత్ర శివలింగాన్ని దర్శించుకునేందుకు  భక్తులు భారీ సంఖ్య‌లో త‌ర‌లివ‌స్తుంటారు. ఈ శివలింగం ఎంతో మహిమాన్వితమైనదని…కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా అచలేశ్వరుడు పూజలందుకుంటున్నారు. ఈ ఆలయంలో కోరిన కోరికలు తీరుతాయని భక్తులు నమ్ముతుంటారు. ఎప్పుడూ భక్తులతో కిటకిటలాడే ఈ దేవాలయం మహా శివరాత్రి పర్వదినాన భారీ సంఖ్యలో వచ్చే భక్తులతో కళకళలాడిపోతుంటుంది.

రంగులు మారే శివలింగంఅచలేశ్వర లింగం రంగులు ఎందుకు మారుతోంది? అనే మర్మంపై ఎంతో మంది శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు. కానీ ఎటువంటి ఆధారాలు తెలియలేదు. హేతు వాదులు కూడా రంగులు మారే సీక్రెట్ ఏంటో తేల్చేస్తామని ఎన్నో రకాలుగా ప్రయత్నాలు చేశారు గానీ ఏమీ తేల్చలేకపోయారు. దీంతో అచలేశ్వరుడి మహత్యం మిస్టరీగా మిగిలిపోయింది.

రంగులు మారే శివలింగంస్కంధ పురాణం ప్రకారం భూలోక పర్యటన చేసే సమయంలో ఈ మౌంట్ అబు పర్వతానికి శివుడు ఒకసారి వస్తాడు. అప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సాధు పుంగవులు ‘స్వామి మీరు ఎప్పుడూ ఇక్కడే ఉంటూ మమ్ములను అనుగ్రహించండి’ అని వేడుకున్నారు. ఇందుకు స్వామి వారు నేను భూలోక సంచారిని ఒకే చోట ఉండటం కుదరదు. అయితే నా శరీరంలో అతి ముఖ్యమైన అవయవం కాలి బొటనవేలుకు సంబంధించిన గుర్తును ఇక్కడ వదిలి వెలుతున్నానని చెబుతాడు. దీనిని పూజిస్తే నన్ను పూజించినట్టే అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు.

రంగులు మారే శివలింగంమరో కథనం ప్రకారం ఈ మౌంట్ అబుని పూర్వ కాలంలో అర్బుదారణ్యం అని పిలిచే వారు. ఈ పర్వత ప్రాంతం ఎప్పుడూ కదులుతూ ఉండటం వల్ల ప్రజలు, ప్రాణులు నశించేవి. సమస్య పరిష్కారం కోసం శివుడు తన కాలి బొటనవేలితో తొక్కి పెట్టారని అందువల్లే ఇక్కడ శివుడి బొటనవేలును పూజిస్తారని చెబుతారు. ఈ ఆలయం అందం చూడటానికి రెండు కళ్లూ చాలవు. రాజస్థాని పాలరాళ్లతో అత్యంత అద్భుతంగా నిర్మించారు. .మహాదేవ్ ఆలయంలో మాత్రం శివుడి కుడి కాలు బొటన వేలును పూజిస్తారు. ఆలయం లోపల సగం గుడ్రంగా ఉన్న ఓ చిన్న గొయ్యి ఉంటుంది. అది శివుడి బొటనవేలు అని చెబుతుంటారు.

రంగులు మారే శివలింగంఎవరైనా ఆ కన్నంలో నీరు పోస్తే… ఆ నీరు మాయమవుతుంది..అలా దాంట్లో పోసిన నీళ్లు ఎక్కడికి పోతాయో కూడా ఎవ్వరికీ అంతుపట్టటం లేదు. ఈ బొటన వేలుకు విశేష పూజలు చేయడం పురాణ కాలం నుంచి వస్తోందని చెబుతారు. ముఖ్యంగా ఈ బొటన వేలుకు శివుడికి ఇష్టమైన రోజులైన సోమవారం, శివరాత్రి, పౌర్ణమి తదితర రోజుల్లో ప్రత్యేకంగా జలాభిషేకం చేస్తారు. ఆ జలం పరమ పవిత్రమైనదిగా భావించి భక్తులు దానిని ఇళ్లకు కూడా తీసుకువెళుతారు.ఈ ప్రాచీన ఆలయంలో మరో ఆకర్షణ శివయ్యకు అత్యంత ప్రీతిపాత్రమైన పుష్పాల చెట్లు చంప పుష్పాల చెట్టు ఉంటుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR