పరమశివుడికి శివుడు, త్రినేత్రుడు, నీలకంఠుడు, అర్ధనారీశ్వరుడు ఇలా అనేక రకాలుగా పిలుస్తుంటారు. అయితే శివుడు వెలసిన ఈ ఆలయంలో ఆయనను నంజుండేశ్వర స్వామి అని పిలుస్తున్నారు. మరి శివుడిని ఎందుకు అలా పిలుస్తున్నారు? ఈ ఆలయం ఏక్కడ ఉంది? ఈ ఆలయ విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.కర్ణాటక రాష్ట్రం, మైసూరుకు దక్షిణంగా సుమారు 18 కి.మీ. దూరంలో సంజనగూడ్ లో అతి పురాతనమైన శ్రీ కంటేశ్వర ఆలయం ఉన్నది. కంబిని నది తీరంలో గల శ్రీ కంటేశ్వర దేవాలయం చాలా ప్రసిద్ధి పొందింది. ఏ దేవాలయాన్ని సంజనగూడ్ దేవాలయం అని కూడా పిలుస్తారు.
ఇలా పిలవడం వెనుక కారణం ఏంటంటే, పాలసముద్రంలో ఉధ్బవించిన హాలాహలాన్ని శివుడు తన కంఠంలో నిలుపుకొనుటచే శివుడికి నంజుండేశ్వర అనే పేరు వచ్చింది. ఆ స్వామి పేరు మీదుగానే ఈ పట్టణానికి నంజన్ గూడ్ అనే పేరు ఏర్పడినట్లు చెబుతారు. ఈ ఆలయం చిన్నదైనప్పటికీ, అతి ప్రాచీన కాలం నుండి గొప్ప మహామాన్వితమైనదిగా ప్రసిద్ధి చెందింది.
ఈ దేవాలయ నిర్మాణం ద్రావిడ శైలిలో ఉంటుంది. ఈ ఆలయ ప్రకారం చుట్టూ శైవభక్తులైన నాయనారులు 63 మంది విగ్రహాలు ఉన్నాయి. ఇవి 11 వ శతాబ్దంలో స్థాపించినట్లుగా తెలియుచున్నది. ఈ ప్రాంగణంలో రాతిపై శివలీలలు అధ్బుతమైన దృశ్యాలతో చెక్కబడినాయి. ఇంకా ఈ ఆలయంలో శ్రీసుబ్రహ్మణ్య స్వామి వారు నెమలివాహనంపై కూర్చొని ఉండగా, నాగేంద్రస్వామి సుబ్రహ్మణ్యస్వామి తలపై పడగవిప్పిన శిల్పం అధ్బుతంగా ఉంటుంది.
నంజన్ గూడ్ కి దగ్గరలో పరశురామ దేవాలయం ఉంది. ముందుగా శివుడిని దర్శించి, తరువాత ఈ దేవాలయాన్ని దర్శిస్తే కానీ తీర్థయాత్ర పూర్తికాదని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ పరశురామ దేవాలయం కౌండిన్య నది గుట్టపైన ఉన్నది. ఇక్కడ పరశురాముడు మాతృ హత్యాదోషం పోగొట్టుకోవడానికి తపస్సు చేసాడని ప్రతీతి. ఈ స్వామిని దర్శించినవారికి తెలిసి తెలియక చేసిన పాపాలు, దీర్ఘరోగాలు నివారించబడతాయని భక్తుల నమ్మకం. ఇచటి మృత్తికా ఔషధంతో సమానమంటారు. అనేక చర్మ రోగాలకు ఈ మృత్తికను ఉపయోగిస్తారు.
ఇలా శివుడు వెలసిన ఈ ఆలయంలో మూడు రోజుల పాటు జరిగే బ్రహ్మాండమైన ఈ రథోత్సవానికి వేలకొలది భక్తులు దక్షిణ దేశం మారుమూలాల నుండి వస్తారు.
Sign in
Welcome! Log into your account
Forgot your password? Get help
Password recovery
Recover your password
A password will be e-mailed to you.