మహాశివుడుని ఎక్కువగా సోమవారం రోజు మాత్రమే పూజిస్తారు ఎందుకు ?

హిందు ధర్మంలో దేవదేవుడైన ఆ మహా శివుడికి ఎంతో ప్రత్యేకత ఉంది. తనని నమ్మి భక్తి శ్రద్ధలతో పూజిస్తే రాక్షసులను సైతం అనుగ్రహించి వారు కోరిన వరాలను ప్రసాదించే బోళా శంకరుడు. అయితే మనలో చాలామందికి ఒక సందేహం తప్పక కలుగుతుంది.. మహాశివుడుని ఎక్కువగా సోమవారం రోజు మాత్రమే పూజిస్తారు. శివునికి సోమవారం చాల ప్రత్యేకమని చెప్తారు.. మరి ఇలా పూజించడానికి గల ప్రత్యేకమైన కారణమేంటి మనం ఇపుడు తెల్సుకుందాం..

Maha shivuduసోమవారం లో ‘సోమ’ అంటే చంద్రుడు అని అర్థం. చంద్రుడు, శివుడు గురించి పురాణాల్లో ఓ ఆసక్తికరమైన కథ ఉంది. దక్ష రాజు తన 27 మంది దత్త పుత్రికలను చంద్రుడికిచ్చి వివాహం జరిపిస్తాడు. ఈ 27 మంది 27 నక్షత్రాలను సూచిస్తారు. అయితే వీరందరిలో చంద్రుడికి రోహిణి అంటేనే ఎంతో ఇష్టం. ఆమెతో ఎక్కువగా గడుపుతూ.. మిగిలిన వారిని నిర్లక్ష్యం చేస్తుంటాడు. చంద్రుడి ప్రవర్తన పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన రోహిణి సోదరీమణులు తండ్రి దక్ష రాజుకు ఫిర్యాదు చేస్తారు. ఇందుకు దక్షుడు పలుమార్లు చంద్రుడిని బతిమాలినా, హెచ్చరించినా ప్రయోజనముండదు. దీంతో కోపోద్రేక్తుడైన దక్ష రాజు.. చంద్రుడిని శపిస్తాడు. ఫలితంగా చంద్రుడు రోజు రోజు తన సౌందర్యాన్ని కోల్పోవడమే కాకుండా.. తన మెరుపును, పరిమాణంలోనూ కుంచించుకుపోతాడు.

Chandruduతనకు ఈ ఆపద దక్ష శాపం వల్ల కలిగిందని గ్రహించిన చంద్రుడు.. సహాయం కోసం బ్రహ్మదేవుడు శరణుగోరుతాడు. అయితే విషయాన్ని అర్థం చేసుకున్న విధాత.. ఈ సమస్యకు పరిష్కారమార్గం శివుడొక్కడే చూపించగలడని చంద్రుడికి చెప్పగా.. అతడు శివుడికి తన గోడును వెల్లబోసుకున్నాడు. పరమ భక్తితో మహేశ్వరుడు ఆలపించేంత వరకు ప్రార్థించి త్రినేత్రుడిని సంపన్నం చేసుకంటాడు చంద్రుడు. అయితే అప్పటికే దక్ష శాపం ప్రభావం చూపిచడం మొదలు పెట్టగా.. ఆ శాపాన్ని పూర్తిగా ఉపసంహరింపలేకపోతాడు శివుడు.

Lord Shivaఅందువల్ల పదిహేను రోజులకోసారి పూర్తి రూపంతో పాటు సహజ సౌందర్యాన్ని పొందుతూ.. మిగిలిన 15 రోజులు కుంచించుకు పోతూ అదృశ్యమయ్యే వరకు తగ్గిపోతాడు చంద్రుడు. ఈ కారణంగానే మనకు పౌర్ణమి, అమవాస్యలు ఏర్పడుతున్నాయి. చంద్రుడు రూపాన్ని పూర్తిగా పోకుండా కాపాడాడు కాబట్టి శివుడిని సోమనాథుడని పిలుస్తున్నారు. అంతేకాకుండా నెలవంకను నెత్తిన ధరించిన కారణంగా మహేశ్వరుడిని చంద్రశేఖరుడు అని కూడా పిలుస్తుంటారు.

Shivaఇలా చంద్రుడికి శాప విమోచనం కలిగించింది సోమవారం రోజు కావటం.. ఆ రోజు మహేశ్వరుడిని సేవిస్తే అందరిని వారి వారి సమస్యల నుంచి బయటపడి.. మహాదేవుడు తమను కూడా రక్షిస్తాడని భక్తులు విశ్వసిస్తున్నారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,660,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR