ఈ ఆలయంలో షాకింగ్ ఆచారం!!

 ప్రతి రోజూ గుడికి వెళ్లే పద్దతిని మన పెద్దలు మనకు చిన్నతనం నుంచే అలవాటు చేసారు. గుడికి వెళ్ళడమంటే అదేదో మొక్కుబడి వ్యవహారం కాదు. ఆలయాలను దర్శించుకోవడం వెనుక శాస్త్రీయ ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అంతే కానీ మూఢనమ్మకాలను ప్రోత్సహించడానికి గుడికి వెళ్ళండి అని ఎవరు చెప్పలేదు. మ‌న దేశం సాంకేతిక ప‌రంగా ఎంత ముందుకు వెళ్తున్నా మూఢ న‌మ్మ‌కాల విష‌యంలో మాత్రం ఇంకా వెనుక‌బ‌డే ఉంద‌ని చెప్ప‌వ‌చ్చు.
  •  ఇప్ప‌టికీ మ‌న దేశంలో అనేక ప్రాంతాల్లో వింత వింత ఆచారాల‌ను, మూఢ న‌మ్మ‌కాల‌ను పాటించేవారున్నారు. మ‌రీ ముఖ్యంగా కొన్ని పురాత‌న‌, చారిత్ర‌క ఆల‌యాల విష‌యానికి వ‌స్తే వాటిల్లో అనేక విశ్వాసాల‌ను పాటించేవారున్నారు.
  •  ప్ర‌కాశం జిల్లా రాచర్ల మండలం జి.పుల్లలచెరువు సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో కొలువై ఉన్న నెమ‌లిగుండ్ల రంగ‌నాయ‌క స్వామి దేవాల‌యంలోనూ మూఢ విశ్వాసాల‌ను ఇప్ప‌టికీ పాటిస్తున్నారు. ఇంత‌కీ అదేమిటంటే…
  •  నెమ‌లిగుండ్ల రంగ‌నాయ‌క స్వామి ఆల‌యానికి నెల‌సరి వ‌చ్చిన స్త్రీలు వ‌స్తే వారిని అక్క‌డే ఆల‌య ప్రాంగంణంలో చెట్ల‌కు తుట్టెల్లో ఉన్న తేనెటీగ‌లు కుడ‌తాయ‌ట‌. అందుక‌ని పీరియ‌డ్స్ స‌మ‌యంలో ఉన్న మ‌హిళలు ఎవ‌రూ ఈ ఆల‌యానికి రారు. వ‌స్తే వారితోపాటు వారితో వ‌చ్చిన మ‌గ‌వారిని కూడా ఆ తేనెటీగ‌లు కుడ‌తాయ‌ట‌.
  •  అలా అని చెప్పి కొంద‌రికి ఆ అనుభ‌వం కూడా అయింద‌ట‌. అందుక‌ని ఆ ఆల‌యంలో ఎంతో కాలం నుంచి ఈ ఆచారాన్ని పాటిస్తున్నారు. 1,500 సంవత్సరాల క్రితం మయూర మహర్షి కోరిక మేరకు శ్రీ మహావిష్ణువు ఇక్కడ స్వయంభువుగా వెలిశాడని, రంగ అనే గిరిజన మహిళ తపస్సుకు మెచ్చి ఆమెను వివాహం చేసుకొని రంగనాయకుడయ్యాడన్నది స్థానికులు చెబుతున్న స్థలపురాణం.
  •  ఇక మయూర మహర్షి నెమలి ఆకారాన్ని ధరించి తన పొడవాటి ముక్కు, కాలిగోళ్ళ సహాయంతో ఆలయ సమీపంలో ఓ నీటి గుండాన్ని తవ్వి తన దాహాన్ని తీర్చుకున్నాడని, అందుకే దీన్ని నెమలి గుండంగా పిలుస్తుంటారనీ చెబుతున్నారు. కాలక్రమంలో ఈ ప్రాంతం నెమలిగుండ్ల రంగనాయకస్వామి క్షేత్రంగా ప్రసిద్ధి గాంచింది.
  •  అలాగే తేనెటీగలు ఈ క్షేత్ర పవిత్రతను కాపాడుతుంటాయని, ముఖ్యంగా పీరియడ్స్ సమయంలో స్త్రీలను ఆలయంలోకి ప్రవేశించకుండా తేనెటీగలు అడ్డుకుంటాయని స్థలపురాణం కింద చెప్తారు. ఇదే విషయం ఇక్క‌డ‌ విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. ఏది ఏమైనా ఈ ఆచారం షాకింగ్‌గా ఉంది క‌ద

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,750,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR