సాబుదానా లేదా సగ్గుబియ్యం గర్భిణీలు తినొచ్చా?

సగ్గు బియ్యం అంటే కొంతమందికి తెలియకపోవచ్చు. మ‌న‌లో చాలా మందికి సాబుదానా అంటే తెలుసు. వీటినే సాగో అని కూడా అంటారు. వీటితో అనేక ర‌కాల పిండి వంట‌లు చేస్తుంటారు. సగ్గు బియ్యాన్ని కర్ర పెండలం పొడితో తయారు చేస్తారు. దుంప నుంచి తయారు చేస్తారు. కాబట్టి ఇందులో కార్బోహైడ్రేట్స్ పుష్కలంగా ఉంటాయి. మనకు ఆరోగ్యాన్ని అందించే చక్కని ఆహారం ఇది. సగ్గుబియ్యంలో మన శరీరానికి ఉపయోగపడే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వీటిలో కార్బొహైడ్రేట్స్, ప్రోటీన్స్, విటమిన్ సి, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి. వంద గ్రాముల సగ్గుబియ్యంలో 355క్యాలరీలు, 94గ్రాముల కార్బో హైడ్రేడ్లు, ఫ్యాట్ కలిగివుంటాయి. అందువల్ల సగ్గు బియ్యం తీసుకుంటే ఎక్కువ శక్తి అందుతుంది.

sagoఇందులో ఫ్యాట్ తక్కువగానే ఉంటుంది. బరువు తగ్గాలని భావించేవారు వీటిని తగిన మోతాదులో తీసుకోవాలి. సగ్గుబియ్యం తినడం వల్ల శరీరంలో ఉన్న కొవ్వు కరుగుతుంది. శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ ను సరిగ్గా ఉంచి హెల్తీగా ఉండటానికి సహాయపడతాయి. ఇవి అందరికీ అందుబాటులో ఉంటాయి. పెద్దవారికి, బరువు తగ్గాలనుకునే వారికే కాదు ఈ సగ్గుబియ్యం పసిపిల్లలు, చిన్నపిల్లలకి కూడా అమృతం వంటిదే. సగ్గుబియ్యం తేలికగా జీర్ణం అయ్యే ఆహారం కాబట్టి పాల త‌ర్వాత‌ చిన్న పిల్లలకి తినే ఆహార పదార్థంగా సగ్గుబియ్యాన్ని సూచిస్తారు వైద్యులు. సగ్గుబియ్యాన్ని రసాయనాలు లేని న్యాచురల్ స్వీటనర్‌గా పనిచేస్తుంది. పోషకాల శాతం ఎక్కువగా ఉండి, ఎటువంటి ఇతరేతర కృత్రిమ పదార్థాలు క‌లువ‌క‌పోవం ఇంకా కలిసొచ్చే విషయం.

sago spicyసగ్గుబియ్యంలో పాలు, చక్కెర పోసి వండుకుని తిన్నా లేదంటే.. ఉప్మా తరహాలో సగ్గుబియ్యం తిన్నా శరీరానికి చలువ చేస్తుంది. ఎండలో తిరిగే వారు సగ్గుబియ్యం తింటే ఉపశమనం కలుగుతుంది. వేసవి తాపం నుంచి తప్పించుకోవచ్చు. వీటిలో ఫోలిక్ యాసిడ్, విటమిన్ బి ఉంటాయి కాబట్టి గర్భిణీలు వీటిని డైట్ లో చేర్చుకోవాలి. దీంతో శిశువుకు పోష‌ణ స‌రిగ్గా ల‌భిస్తుంది. బిడ్డ ఎదుగుద‌ల స‌రిగ్గా ఉంటుంది. ఆరోగ్యంగా పుడ‌తారు. స‌గ్గు బియ్యంలో ఉండే ఫోలేట్ బిడ్డ‌కు ఎలాంటి లోపాలు రాకుండా చూస్తుంది. అందువ‌ల్ల గ‌ర్భిణీలు స‌గ్గు బియ్యాన్ని రోజూ తీసుకోవడం తల్లికీ బిడ్డకి కూడా మంచిది.

sago sweet paisamవీటిలో ఉండే విటమిన్ కె మెదడుకి మంచిది. ఇవి బ్లడ్ ప్రెజర్ ని కంట్రోల్ చేయడంతో పాటు బ్లడ్ కొలెస్ట్రాల్ ని మెరుగుపరుస్తాయి. వీటిలో ఎక్కువ మొత్తంలో పొటాషియం ఉండటం వల్ల రక్తప్రసరణ సజావుగా సాగి గుండె సంబంధింత వ్యాధులకు దూరంగా ఉండవచ్చు. స‌గ్గు బియ్యం తిన‌డం వ‌ల్ల కండ‌రాలు నిర్మాణ‌మ‌వుతాయి. ఇవి కండ‌రాల‌కు మ‌ర‌మ్మ‌త్తులు చేయ‌డంతోపాటు శ‌క్తిని అందిస్తాయి. దీంతో బాగా అల‌సిపోయిన వారు వీటిని తీసుకుంటే వెంట‌నే శ‌క్తి ల‌భించి ఉత్సాహంగా మారుతారు. యాక్టివ్‌గా ప‌నిచేస్తారు. స‌గ్గు బియ్యంలో కాల్షియం అధికంగా ఉంటుంది. ఇది ఎముక‌ల‌ను దృఢంగా, ఆరోగ్యంగా ఉంచేందుకు స‌హాయ ప‌డుతుంది.

vitamin k in sagoసగ్గు బియ్యంలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. హృదయ కవాటాల మీద ఒత్తిడి పడకుండా చూడటంలోనూ వీటిలోని పోషకాలు ఉపయోగపడతాయి. నీరసంగా అనిపించినప్పుడు సగ్గు బియ్యంతో కాచిన జావ తీసుకుంటే తక్షణం శక్తి అందుతుంది. ఇందులో స్టార్చ్ శాతం ఎక్కువగా ఉంటుంది. జీర్ణ సమస్యలు ఉన్నవారు సగ్గుబియ్యం తింటే ఆ సమస్యల నుంచి బయట పడవచ్చు. గ్యాస్ ప్రాబ్లమ్స్, బ్లోటింగ్ వంటి సమస్యలను తక్షణం నివారిస్తాయి. జ్వరం, విరేచనాలు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు సగ్గుబియ్యం జావ తాగితే ఎంతో మేలు. సాధారణంగా మ‌న‌కు సగ్గుబియ్యాన్ని పాలతో కలిపి తీసుకోవడం తెలిసిందే. అలానే కాదు, నీటితో ఉడికించిన‌ తర్వాత చక్కెర అందులో కలిపి తీసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల జీర్ణ సమస్యలన్నీ దూరం చేసుకోవచ్చు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR