Shri Mahavishnuvu Shri kurmanadha venugopalaswamyga darshanam ichhe aalayam

0
3923

శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో శ్రీ కూర్మావతారం ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. అయితే ఆ స్వామి కూర్మావతారంలో దర్శనం ఇచ్చే ఆలయాలు చాలా తక్కువగా ఉంటాయి. శ్రీ కూర్మం తరువాత శ్రీ మహావిష్ణువు కూర్మావతారంలో దర్శనమిచ్చే ప్రసిద్ధ దేవాలయం ఇదేనని చెబుతారు. మరి ఆ స్వామివారు కూర్మావతారంలో కొలువై ఉన్న ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయ స్థల పురాణం ఏంటనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. mahavishnuvuఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు మండలంలోని పెద్దకావవరం అనే గ్రామంలో శ్రీ కూర్మనాథ వేణుగోపాలస్వామి ఆలయం ఉంది. ఈ ఆలయాన్ని 16 వ శతాబ్దంలో ఆనాటి పాలకులు పెదకావవరంలో శ్రీ వేణుగోపాలస్వామి వారి దేవాలయాన్ని నిర్మించారు. దాదాపుగా 200 సంవత్సరాలు ఆ వంశంవారే ఈ ఆలయానికి ధర్మకర్తలుగా వ్యవహరించారు. ఆ తరువాత 18 వ శతాబ్దం చివరి రోజుల్లో ఆలయ ధర్మకర్తగా శ్రీ కఠారి శేషన్న గారు వ్యవహరించారు. mahavishnuvuఆలయ స్థల పురాణానికి వస్తే, ఒకరోజు రాత్రి వేణుగోపాలస్వామి శేషన్న కలలో స్వామివారి దివ్యమంగళ రూపం కూర్మావతారంతో దర్శనమిచ్చి నేను ఫలానా ప్రాంతంలో ఉన్నాను అని అంతరార్థం అయ్యడంటా. మరుసటి రోజున ఈ విషయం అయన గ్రామస్థులకు చెప్పగా అందరు స్వామివారి కీర్తిస్తూ ఉండగా ఒక గరుడ పక్షి ఆకాశంలో కనిపించింది. ఇక భక్తులందరూ ఆ పక్షిని అనుసరించి కొంతదూరం వెళ్ళాక గరుడ పక్షి ఒక మట్టి దిబ్బపైన వాలింది. అప్పుడు భక్తులందరూ ఆ మట్టిదిబ్బ తావి చూడగా స్వామి వారి శ్రీకూర్మ రూప శిల కనిపించింది. ఈవిధంగా ఆ స్వామివారిని అక్కడే భక్తిశ్రద్ధలతో ప్రతిష్టించారు. mahavishnuvuఈ స్వామికి నిత్య పూజలతో పాటు పండుగ పర్వదినాల్లో ప్రత్యేక పూజలు చాలా గొప్పగా జరుగుతాయి. ఇలా వేణుగోపాల రూపం, శ్రీ కూర్మావతార రూపంలో వెలసిన రెండు అవతారాల దివ్యమంగళ ఏకారరూపం అయినా ఆ శ్రీ మహావిష్ణువు చూడటానికి భక్తులు ఎప్పుడు అధిక సంఖ్యలో వస్తుంటారు.mahavishnuvu