Shri subramanya swamy naagulaku rakshakudigaa velisina aalaya rahasyam

0
12762

పార్వతీపరమేశ్వరుల రెండవ కుమారుడు సుబ్రమణ్యస్వామి. ఈ స్వామికి ఎన్నో ఆలయాలు ఉన్నాయి. అయితే ఇక్కడ వెలసిన ఆలయానికి ఒక విశేషం ఉండటం తో పాటు ఒక పురాణ కథ కూడా వెలుగులో ఉంది. మరి ఆ విశేషం ఏంటి? ఆ స్వామి ఆలయానికి గల చరిత్ర ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. subramanya swamyకర్ణాటక రాష్ట్రంలోని సులియా ప్రాంతంలో కుక్కె గ్రామంలో శ్రీ సుబ్రమణ్యస్వామి వారి ఆలయం ఉంది. చుట్టూ కుమార పర్వతశ్రేణుల మధ్య ప్రకృతి ఒడిలో నెలకొన్న స్వామివారు నాగులకు రక్షకుడిగా ఇక్కడ వెలిసి పూజలందుకొంటున్నాడు.subramanya swamy

ఇక ఆలయ పురాణానికి వస్తే, సుబ్రమణ్వస్వామి, వినాయకునితో కలిసి తారకాసురునిపై యుద్ధం చేస్తారు. ఈ యుద్ధంలో అసుర సంహారం జరుగుతుంది. అనంతరం ఇక్కడ విశ్రమించిన స్వామి వేలాయుధాన్ని ధార నదిలో పరిశుభ్రంచేస్తారు. దీంతో ఈ నదిని కుమారధార అని పిలుస్తారు. రాక్షస సంహారం చేసిన కుమారస్వామికి దేవేంద్రుడు తన కుమార్తె దేవసేనతో మార్గశిర శుద్ధ దశమి నాడు వివాహం జరిపిస్తారు. అయితే సాక్షాత్తూ స్వామివారి వివాహవేదిక కావడంతో ఈ క్షేత్రం మరింత ప్రాశస్త్యం చెందింది. పశ్చిమ కనుమల్లోని ఏడు పరశురామ ప్రతిష్టాపిత క్షేత్రాల్లో కుక్కె సుబ్రమణ్య ఒకటి కావడం విశేషం. శంకర భగవత్‌పాదులు సుబ్రమణ్య భుజంగ స్తోత్రంలో కుక్కెలింగ అని ప్రస్తావించారు.subramanya swamy

ఇది ఇలా ఉంటె స్వామివారు నాగులకి రక్షకుడిగా ఎందుకు మారాడు అంటే, నాగులలో శ్రేష్టుడు వాసుకి. ఆయన క్షీరసాగర మథనంలో కవ్వానికి తాడులాగా వ్యవహరించాడు. అయితే గరుత్మంతుడి బారినుంచి రక్షించాలని కోరుతూ ఇక్కడ కొండల్లో అనేక కఠోరమైన తపస్సు చేశాడు. అప్పుడు తపస్సుకు అనుగ్రహించిన మహేశ్వరుడు అతనికి వరమివ్వాలని సుబ్రమణ్యస్వామిని ఆదేశిస్తారు. దీంతో స్కందుడు వాసుకికి ప్రత్యక్షమై కుక్కె క్షేత్రంలో నాగులకు రక్షణ వుంటుందని వరమిస్తాడు. దీంతో నాగులకు ఇది రక్షణ క్షేత్రమైంది. ఇప్పటికీ ఈ క్షేత్రంలో అనేక వందల సర్పాలను మనం చూడవచ్చు. ఇంకా ఆది సుబ్రమణ్య మందిరంలో అనేక పుట్టలు కూడా వుంటాయి.subramanya swamyప్రధాన మందిరంలోని స్వామి ఆదిశేషు, వాసుకిలపైన వుండి పూజలను అందుకుంటారు. సర్పదోషం పోవాలనుకొనే భక్తులు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. ఇంకా శ్రీ సుబ్రమణ్యస్వామి, దేవసేనల వివాహం సందర్భంగా పలు పవిత్ర నదీజలాలను దేవతలు కుమారధారలో కలిపారు. అంతేకాకుండా స్వామివారి ఆయుధం వేలాయుధం ప్రత్యక్షంగా మునిగిన ప్రాంతం కావడంతో కుమారధారలో పలువురు భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారు. ఈ నీటితో పలు రకాల జబ్బులు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢవిశ్వాసం.subramanya swamyఈవిధంగా నాగులకి రక్షకుడిగా వెలసిన శ్రీ సుబ్రమణ్యస్వామి దర్శించుకొనుటకు చుట్టూ పక్కన ఉన్న గ్రామాలే కాకుండా అనేక ప్రాంతాల నుండి భక్తులు తరలి వస్తుంటారు.