Home Entertainment Shyam Kasarla, The Man And Pen Behind Blockbuster Folk Songs In Telugu...

Shyam Kasarla, The Man And Pen Behind Blockbuster Folk Songs In Telugu Movies

0

Shyam Kasarla, The Man And Pen Behind Blockbuster Folk Songs In Telugu Movies

ఒకప్పుడు తెలుగు సినిమాల్లో తెలంగాణ యాస, బాషా అంటే దాన్ని కామెడీ లేదా విలనిజం కోసమే పనికొచ్చే కథ వస్తువుగా మాత్రమే చూసేవాళ్ళు . ఒసేయ్ రాములమ్మ, ఆర్ నారాయణమూర్తి చేసిన సినిమాల్లో మాత్రమే తెలంగాణ యాస బాషా కి పెద్ద పీట వేశారు తప్ప…తెలంగాణ భాషలో ఉన్న మాధుర్యం, యాసలో ఉండే చమత్కారం, తెలంగాణ పాటలు, జానపదాల్లో ఉండే సహజత్వానికి తెలుగు సినిమాల్లో పెద్దగా చోటు దక్కలేదు.

కానీ ఇప్పుడు అంత మారింది…తెలంగాణ భాషకు, తెలంగాణ యాసకు, తెలంగాణ పాటకు మంచి గుర్తింపు ఇవ్వడమే కాదు పెద్ద పీట వేసి తెలంగాణ నేపథ్యం ఉన్న కథలకు, పాటలకు పెద్ద పీట వేస్తున్నారు మన సినిమా వాళ్ళు. సినిమాల్లో తెలంగాణ పాటల విషయానికి వస్తే చిన్న సినిమాల దగ్గర నుండి పెద్ద సినిమాల వరకు ఒక తెలంగాణ జానపదంతో కూడిన పాటలకు ఇప్పుడు మంచి గిరాకీ ఉంది.

ఇక సినిమా వాళ్ళకి తెలంగాణ జానపదం, తెలంగాణ పాట అనగానే మొదట కాసర్ల శ్యామ్ గారి పేరు గుర్తు వస్తుంది. ఈ మధ్య వచ్చిన తెలుగు సినిమాల్లో తెలంగాణ పాటల వెనక కలం ఎవరిద్ అంటే అది కాసర్ల శ్యామ్ అన్నదే. మహ్మత్మా సినిమాలో ‘నీలాపురి గాజుల’ పాట దగ్గర నుండి నిన్న మొన్న వచ్చిన ‘టిల్లు డీజే పెడితే’ దసరాలో ‘చమ్కీల అంగీలేసి’ పాట వరకు ప్రతి హిట్ తెలంగాణ పాట ఈయన రాసిందే.




ఎవరు ఈ కాసర్ల శ్యామ్?

వరంగల్ జిల్లా హన్మకొండలోని బ్రాహ్మణవాడలో మధుసూదన్‌ రావు, మాధవి దంపతులకు కాసర్ల శ్యామ్ జన్మించారు. శ్యామ్ అన్న తండ్రి రంగస్థల, టీవీ, సినీనటుడు కావడంతో శ్యామ్ అన్నకు చిన్నప్పటి నుండే కళల పట్ల ఇష్టం అయ్యింది. స్చహోల్, కాలేజీ రోజుల నుండే శ్యామ్ అన్న సాహిత్యం పట్ల అభిలాషతో వరంగల్‌లో ఎక్కడ ఏ కార్యక్రమం జరిగినా వెళ్లేవారు, అట్లా పాటలు పాడుడు , రాసుడు నేర్చుకున్నాడు.

మొదటి సినిమా పాట రాసే అవకాశం నుండి తెలంగాణ పాట అంటే మొదట గుర్తు వచ్చే పేరు ‘కాసర్ల శ్యామ్’ వరకు:

తెలంగాణ జానపదం మీద మమకారంతో పాటలు రాయడం మొదలు పెట్టిన శ్యామ్ అన్న… “కాలేజీ పిల్ల చూడరో..యమ ఖతర్నాక్‌గుందిరో, మస్తుగుంది పోరి, గల్ గల్ గజ్జెలు లాంటి అనేక ప్రైవేటు ఆల్బమ్స్ రాసారు. వీటితో మంచి పేరు వచ్చిన శ్యామ్ అన్నకు దర్శకులు బి. జయ గారు చంటి గాడు సినిమాలో ‘కోకోకో .. కొక్కొరోకో’ పాటతో సినీ గేయ రచయితగా పరిచయం చేసారు. ఈ పాట తరువాత శ్యామ్ అన్న మహాత్మా సినిమాకి రాసిన ‘నీలాపురి గాజుల ఓ నీలవేణి’ పాట తెలుగు రాష్ట్రాల్లో ఒక ఊపు ఊపేసింది. తరువాత లై చిత్రంలో “బొమ్మోలే ఉన్నదిరా పోరి” అంటూ జానపద బాణీని జోడించి రాసిన పాట అందరినీ ఆకట్టుకుంటుంది.




రాములో రాముల, దిమాక్ ఖరాబ్ నుండి చమ్కీల అంగీలేసి వరకు… ఆగేది లే అంటున్న కాసర్ల శ్యామ్ అన్న తెలంగానం….

శ్యామ్ అన్న రాసిన రాములో రాములు పాట…తెలుగు రాష్ట్రాల్లో పెద్ద హిట్ అయ్యింది. తెలంగాణ, ఆంధ్రలో ఏ పెళ్ళికి పోయిన…ఇదే పాట వినిపించింది. ఈ పాట తరువాత శ్యామ్ అన్న వెనక్కి తిరిగి చూసుకోలే.

తెలుగు సినిమాలో కాసర్ల శ్యామ్ తెలం’గానం’:

తెలుగు సినిమా, తెలుగు పాటల్లో గోదారొళ్ల వెటకారం నుండి చార్మినార్ హైదరాబాదీల మజాక్ ఎన్నో బాషా, యాసలు చూసాము. కానీ ఇప్పుడు ఉన్న తెలుగు సినిమాల్లో పాతాళ విషయానికి వస్తే తెలంగాణ తెలంగాణ జానపదం, తెలంగాణ నేపధ్యం ఉన్న పాటలకి ఆదరణ చాలా ఉంది.

తెలుగు జానపదంతో కూడిన పాదాలను వాడి మంచి పాట రాసే గేయ రచయితల్లో చాలా మంది ఉన్నారు…ఈ చాలా మందిలో ఒకరు మన కాసర్ల శ్యామ్ అన్న. రాములో రాములో తరువాత కాసర్ల శ్యామ్ అన్న రాసే తెలంగాణ జానపద గీతాలు హిట్ అవ్వడంతో ఇప్పుడు ఆయన పాట లేని సినిమా ఆల్బమ్ రావడం లేదు. మొన్నటి వరకు శ్యామ్ కాసర్ల అన్న రాసిన రాములో రాముల, టిల్లు అన్న డీజే పెడితే పాటలకు ఊగిపోయిన తెలుగు ఆడియన్స్ ఇప్పుడు దసరా సినిమాలోని ధూమ్ ధామ్ దోస్తాన్, చమ్కీల అంగీలేసి పాటలకు ఊగిపోతున్నారు. చమ్కీల అంగీలేసి పాటలో భార్య-భర్తల మధ్య ఉండే కొట్లాటలు – ప్రేమని శ్యామ్ అన్న రాసినంత అందంగా ఎవరు రాయలేరు అనిపించింది.




శ్యామ్ అన్న రాసాడంటే… ఆ పాట ప్రతి ఇంట మోగాల్సిందే. ఇలా ఇవి మాత్రమే కాదు శ్యామ్ అన్న పెన్ను నుండి యల్టీని పాటల రావాలా…మేము అవి ఇంటూ ఉండాలి అని కోరుకుంటూ కాసర్ల శ్యామ్ అన్న రాసిన పాటల్లో కొన్ని…

Best Songs of Shyam Kasarala

Neelapoori Gaajula Oo Neelavaeni – Mahatma

Bombhaat – Lie

Ramulo Ramula – Ala Vaikuntapurramulo

Whattey Beauty – Bheeshma

Dj Tillu – Dj Tillu




Life Ante – F3

Dhoom Dhaam – Dasara




Chamkila Angeelesi – Dasara

OoruPalleturu – Balagam

 

Exit mobile version