Home Health బర్త్ కంట్రోల్ పిల్స్ తో కలిగే సైడ్ ఎఫెక్ట్స్

బర్త్ కంట్రోల్ పిల్స్ తో కలిగే సైడ్ ఎఫెక్ట్స్

0

కొంతమంది పెళ్లి అయినా..వెంటనే పిల్లలు వద్దు అనుకుంటారు. మరికొంతమంది ఒక బేబీ తరువాత కొంత గ్యాప్ తీసుకోని మరొకరిని కనాలనుకుంటారు. దీని కోసం గర్భనిరోధక సాధనాలు వాడుతూ ఉంటారు, అందులో ముఖ్యంగా బర్త్ కంట్రోల్ పిల్స్ వాడకం ఈ మధ్య బాగా పెరిగిపోయింది.

Side Effects of Birth Control Pillsనెలకి లక్షల్లో మందులు అమ్ముడు అవుతున్నాయి అంటే అర్థం చేసుకోవచ్చు, వీటి వాడకం ఎంతగా పెరిగిపోయిందో. అయితే చాలా మంది ఇవి డాక్టర్ ని కన్సెల్ట్ అవ్వకుండానే మెడికల్ షాపుల్లో నేరుగా తీసుకుంటున్నారు.

అయితే ఇవి వాడితే చాలా ప్రమాదం అంటున్నారు వైద్యులు. అంతేకాదు వీటి వల్ల పిల్లలు కావాలనుకున్నప్పుడు పిల్లలు పుట్టడానికి ఇంకా లేట్ అవుతుంది అంటున్నారు. ఈ పిల్స్ వాడితే మహిళల శరీరంలో విటమిన్–బి, సి, ఈ, జింక్, సెలీనియం, మెగ్నీషియం తగ్గుతుందట. ఈ మందులు వాడేవారిలో ఎమోషన్స్ బాగా పెరిగిపోతాయట.

అంతేకాదు వీటిని వాడటం వల్ల అమ్మాయిలు బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట. అలాగే ఓవర్ డోస్ అవడం వల్ల వివిధ రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి. ఇలాంటి మందులు వాడితే ఇవి అమ్మయిలకి కాలేయం పై ఎఫెక్ట్ చూపిస్తాయట. కొందరు వారానికి 10 కూడా వాడతారు. దీని వల్ల రాబోయే రోజుల్లో వారికి పిల్లలు పుట్టే సమయంలో అడ్డంకి ఏర్పడే ప్రమాదం ఉంది అంటున్నారు నిపుణులు.

 

Exit mobile version