వేసవి వచ్చిందంటే చాలు మామిడి పండ్ల సీజన్ వచ్చేస్తుంది.. ఈ పండ్లను ఇష్టపడని వారుండరు అని అంటారు. వేసవిలో మనకు లభించే అద్భుతమైన ఫలం మామిడి. వేసవి వస్తే చాలు చాలా మంది మామిడి పండ్ల కోసం ఎదురుచూస్తున్న అంటే అతిశయోక్తి కాదు. బంగినపల్లి, తోతాపురి, కొబ్బరి మామిడి, రసాలు ఇలా అనేక రకాల మామిడి పండ్లు మన కళ్ళముందు కనబడుతుంటే ఆగలేక తినేస్తాం. అందుకే మామిడిని పండ్లలో రారాజు అంటారు. అయితే మామిడి పండ్లను మితంగా తీసుకుంటే ఫర్వాలేదు కానీ.. లెక్కకు మించి తీసుకుంటే ఆరోగ్యానికి హానికరమే. మరి మామిడి పండ్లను అపరిమితంగా తీసుకోవడం వల్ల వచ్చే ఇబ్బందులేమిటి ఇప్పుడు తెలుసుకుందాం.
బరువు పెరుగుతారు:
ఒక మీడియంసైజ్ మామిడి పండులో 135 క్యాలరీలుంటాయి. ఒకే సారి ఎక్కువ మామిడిపండ్లు తినడం వల్ల క్యాలరీలు పెరిగి బరువు పెరుగుతారు. అయితే క్యాలరీలతో మాకు పనిలేదు అనేవారు. మామిడి పండ్లు తింటూనే ఒక అరగంట వ్యాయాం చేస్తే బరువు పెరుగుతామన్న భయమక్కర్లేదు.
బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరుగుతాయి:
మామిడి పండ్లలో ఫ్రూట్ షుగర్(ఫ్రక్టోజ్) అధికంగా ఉంటుంది. ఇది పండ్లు తియ్యగా ఉండటానికి కారణం. కాబట్టి, షుగర్ లేదా స్వీట్ కంటెంట్ అధికంగా ఉన్న వాటిని ఎక్కువ తినడం వల్ల షుగర్ లెవల్స్ పెరుగుతాయి. శరీరంలో ఇన్సులిన్ లెవల్స్ అమాంతం పెరిగిపోతాయి.
ఫెరిఫెరల్ న్యూరో థెరఫి వంటి సమస్యలు :
కొంత మంది మ్యాంగో డీలర్స్ మామిడి పండ్లు త్వరగా పండులా మారడానికి క్యాల్షియం కార్బైడ్ అనే కెమికల్స్ ను ఉపయోగిస్తుంటారు. ఈ కెమికల్స్ ఆరోగ్యానికి హానికలిగిస్తాయి. ముఖ్యంగా కాళ్ళు చేతులు లాగడం, తిమ్మెర్లు మరియు ఫెరిఫెరల్ న్యూరో థెరఫి వంటి సమస్యలు వస్తాయి.
గ్యాస్ట్రో ఇన్ టెన్షినల్ సమస్యలు:
మామిడిపండ్లను ఎక్కువగా తినడం వల్ల ముఖ్యంగా సరిగ్గా మాగని పండ్లు తినడం వల్ల గ్యాస్ట్రో ఇన్ టెన్షనల్ కు సంబంధించిన అజీర్థ సమస్యలను ఎదుర్కొంటారు . కాబట్టి, పచ్చిమామిడికాయలను తినడం నివారించాలి.
ఇరిటేషన్ :
కొన్ని మామిడి పండ్లు గొంతు సమస్యలకు దారితీస్తుంది. గొంతలో చీకాకకు కలిగిస్తుంది. మామిడి పండ్లు తిన్న వెంటనే చల్లని నీళ్లు తాగడం వల్ల గొంతులో చీకాకు కలుగుతుంది.
మ్యాంగో మౌత్ :
మ్యాంగో మౌత్ అంటే మామిడి పండ్లు ఎక్కువగా తినడం వల్ల దురద, వాపు , పెదాల చుట్టూ పగలడం వంటి లక్షణాలు కనబడుతాయి. ముఖ్యంగా ఈ లక్షణాలు పచ్చిమామిడి పండ్లను తిన్నప్పుడు కనబడతాయి.
అలర్జిక్ రియాక్షన్:
మామిడి పండ్లను తినడం వల్ల కొన్ని అలర్జీలు వస్తాయి. కొంత మంది అలర్జిక్ రియాక్షన్ వల్ల కళ్లు ముక్క నుండి నీళ్లు కారడం, శ్వాససమస్యలు, పొట్ట ఉదరంలో నొప్పి, శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.
ఆర్థ్రైటిస్ తో బాధపడే వారికి మంచిది కాదు:
ఆర్థ్రైటిస్, సైనటిస్ వంటి నరాల వ్యాధితో బాధపడేవారికి మంచిది కాదు. వీరు పచ్చిమామిడి, మామిడి పండ్లు, లేదా జ్యూస్ ఏరూపంలో తీసుకున్నా మంచిది కాదు.