ప్రోటీన్ షేక్స్ వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసా ?

0
252

కొన్ని ఆహార పదార్థాలను తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. వాటి వల్ల శరీరంలో కొన్ని లాభాలు ఉంటాయని తీసుకుంటాం. కానీ, వీటి వల్ల కొన్ని నెగేటివ్ రిజల్ట్స్ కూడా ఉంటాయి. అలంటి వాటిలో ప్రోటీన్ షేక్స్ కూడా ఉంటాయి.. మరి ప్రోటీన్ షేక్స్ వలన వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో తెలుసుకుందాం..

protein shakesప్రోటీన్స్ అనేవి ఆరోగ్యానికి చాలా మంచివి. వీటిని తీసుకోవడం వలన శరీరానికి మేలు జరుగుతుంది. అయితే, అదే పనిగా తీసుకుంటే మాత్రం అవి కిడ్నీలపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయని చెబుతున్నారు నిపుణులు. ప్రోటీన్లు తీసుకోవడం శరీరానికి మంచిదే. ప్రోటీన్లు శరీరంలోని అవయవాలన్నీ సక్రమంగా పనిచేసేందుకు ఉపయోగపడతాయి. బరువు తగ్గేందుకు, కండరాలు, కణజాల నిర్మాణంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి. కానీ, అతిగా తీసుకుంటే మాత్రం అనర్థం తప్పదు… ఎందుకంటే ప్రోటీన్ షేక్స్ ఎక్కువగా తీసుకుంటే.. ఫ్యూచర్‌లో కిడ్నీలు పాడయ్యే ప్రమాదం కూడా ఉందని హెచ్చరిస్తున్నారు. కారణమేంటంటే.. ప్రోటీన్ షేక్స్ అనేవి బరువుని తగ్గించడంలో కీ రోల్ పోషిస్తాయి. అయితే, వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల అవి మనకు తెలియకుండానే కిడ్నీలపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయి.

protein shakesమన రక్తంలో వ్యర్థాలు, అదనపు పోషకాలు, ద్రవాలను కిడ్నీలు ఫిల్టర్ చేస్తాయి. అవన్ని కూడా యూరిన్ ద్వారా బయటకి వెళ్లిపోతాయి. మోతాదుకు మించిన ప్రోటీన్స్‌ని ఆహారంగా తీసుకుంటే వాటిని వడపోసేందుకు కిడ్నీలు మరింత ఎక్కువగా శ్రమించాల్సి వస్తుంది. ఇది చాలా ప్రమాదకరం. ముఖ్యంగా.. కిడ్నీ సమస్యలతో బాధపడేవారు వీటికి దూరంగా ఉంటె మంచిది..

protein shakesఅధిక ప్రోటీన్లను తీసుకోవడం వల్ల కిడ్నీల పనితీరు నెమ్మదిస్తుంది. వడపోత ప్రక్రియ నిలిచిపోతే అనోరెక్సియా, బలహీనత, వికారం ఏర్పడతాయి. శరీరంలోని ప్రతి అవయవాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. అదే విధంగా కిడ్నీలను కూడా.. ముఖ్య అవయవాల్లో ఒకటైన కిడ్నీలను ముందు నుంచే కాపాడుకోవడం చాలా ముఖ్యం..

protein shakesఈ నేపథ్యంలో అధిక ప్రోటీన్ల ఆహారాన్ని తీసుకోవాలని భావించినప్పుడు తప్పకుండా వైద్యుల సలహా తీసుకోండి.

SHARE