పసుపు వలన ఆరోగ్యమే కాదు అనారోగ్య సమస్యలు వస్తాయా ?

ప్రాచీన కాలం నుండి భారతీయ గృహాల్లో పసుపు ఉపయోగించబడుతుంది. ఇటీవల, పశ్చిమ దేశాల్లో పసుపు బాగా ప్రజాదరణ పొందింది. పసుపు ఆరోగ్యానికి మేలు చేసే ఎన్నో లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ, ఏదైనా ఎక్కువ తీసుకోవడం హానికరం అని గుర్తుంచుకోవాలి.

Side effects of turmeric->పసుపులో ఉండే కర్కుమిన్ అనేది అలెర్జీలను కూడా కలిగిస్తుంది ఎందుకంటే పసుపు కొందరు వ్యక్తులు తాకడం వలన కలిగే అలెర్జీలకు కారణం కావచ్చును . ఇది చర్మవ్యాధికి కారణమవుతుంది. వ్యక్తులు పసుపును తాకినా లేదా సేవించినా దాని వలన చర్మ దద్దుర్లు మరియు అలెర్జీ ప్రతి చర్యలు కూడా కలుగవచ్చు.

Side effects of turmeric->పసుపులో 2% ఆక్సలేట్ ఉంటుంది. కాబట్టి దీన్ని ఎక్కువ మోతాదులలో తీసుకోవడం వల్ల మూత్రపిండాల్లో రాళ్ళు ఉన్నవారిలో సమస్యలకు దారితీస్తుంది.

Side effects of turmeric->కర్కుమిన్, పసుపులో ఉండే రసాయనం, మధుమేహం కలిగిన వారిలో రక్త చక్కెర స్థాయిని బాగా తగ్గిoచవచ్చును.

Side effects of turmeric->పసుపు ఐరన్ ను నిరోధించవచ్చు మరియు ఇనుము లోపానికి కారణం కావచ్చు. ఐరన్ లోపం ఉన్న వ్యక్తులు అధిక మోతాదులో పసుపును తీసుకోకూడదు.

Side effects of turmeric->జీర్ణాశయం యొక్క పిత్తాశయమును కర్కుమిన్ ప్రేరేపిస్తుంది. అందుకే పిత్తాశయ రాళ్లు లేదా పిత్త వాహిక అవరోధం విషయంలో పసుపు నివారణ అవసరమని నిపుణులు సూచిస్తున్నారు.

->పసుపు యాంటిసిడ్లతో చర్య జరపొచ్చు. టాగమేట్, పెప్సిడ్, జంటాక్, నెక్సియం, లేదా ప్రీవాసిడ్ వంటి యాంటాసిడ్ ఔషధాలతో తీసుకున్నట్లయితే, అది కడుపులో యాసిడ్ పెరుగడానికి కారణం కావచ్చు. పసుపును అధిక మోతాదులో ఉపయోగించడం వలన జీర్ణశయ వికారం వంటి సమస్యలకు మరియు కడుపు నొప్పికి కారణమవుతుందని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి.

Side effects of turmeric->పసుపు రక్తం గడ్డకట్టడాన్ని ఆలస్యం చేస్తుంది. మీకు రక్తం గడ్డకట్టడంలో లోపాలు లేదా రెండు వారాలలోపు చికిత్స ఉంటే పసుపు వాడకూడదు.

Side effects of turmeric->పసుపులో ఉండే కర్కమిన్ గ్యాస్ట్రిక్ దురదలు కలిగిస్తుంది, అది అతిసారం మరియు వికారం వంటి సాధారణ లక్షణాలకు దారి తీస్తుంది.

Side effects of turmericఅయితే యుగాలుగా మన సంస్కృతిలో పసుపు ఒక భాగంగా ఉంది. దుష్ప్రభావాల కంటే పసుపు ఎక్కువ లాభాలను కలిగిస్తుంది. అందుకని పసుపును తగిన మోతాదులో వాడితే మంచిదే కానీ డయాబెటిక్ లేదా గర్భిణి అయినట్లయితే ప్రత్యేకంగా పసుపు ఏ రూపoలో అయినా తీసుకునే ముందు వైద్యుని సంప్రదించడం మంచిది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,740,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR