ఇంటి గుమ్మానికి గుమ్మడికాయ ఎందుకు కడతారు ?

మనం ఉన్నతంగా ఎదుగుతున్నప్పుడు ఇతరులు ఓర్వలేక వారి చెడు మనసుతో చెడును కోరుకోవటం ద్వారా నరదృష్టి మన కుటుంబం మీద పడుతుంది. ఇరుగు పొరుగు వారు లేదా మన బంధువుల లో కూడా మనల్ని చూస్తూ అసూయ పెంచుకోవడం ద్వారా వారి చెడు ప్రభావం మన మీద పడుతుంది. నరదృష్టి పడినప్పుడు ఆ కుటుంబం ఎన్నో అష్ట కష్టాలను అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.

Significance Of Hanging A Pumpkin In Front Of The Houseదిష్టి తీయడానికి గుమ్మడి కాయలను వాడుతారు. కాయగూరలలో సంవత్సర కాలం పాటు పాడవకుండా నిలువ ఉండేది గుమ్మడి కాయ ఒక్కటే. అంత కెపాసిటి కలిగిన భూడిద గుమ్మడి కాయ మనం దృష్టి దోష నివారణ కోసం గుమ్మం పై కడితే కట్టిన కొన్ని రోజులకే పాడై పోతూ ఉంటాయి. ఇలా తరచూ పాడై పోవడానికి అనేక కారణాలు ఉంటాయి.

Significance Of Hanging A Pumpkin In Front Of The Houseఅందులో మొదటిది నరదృష్టి ఎక్కువగా ఉంది అని అర్ధం. ఇంకొకటి ఆ ఇంటిపై నకారాత్మక శక్తి ఎక్కువగా ఉన్నది అని కుడా భావించ వచ్చు. నరదృష్టి తగిలితే నాపరాయి కూడా పగిలిపోతుంది అని మన పెద్దలు చెబుతుంటారు. మీ ఇంటికి కాని వ్యాపార సంస్థలలో కాని దిష్టి నివారణ కోసం గుమ్మడికాయ కట్ట౦డి. ఒకవేళ మీ ఇంటి ముందు దిష్టి గుమ్మడికాయ కట్టకపోతే ఒక బూడిద గుమ్మడికాయ, నరదృష్టి నివారణకు గోమాత సహిత నవ యంత్ర యుక్త ఐశ్వర్య కాళీ ఫోటో ఇంటి లోపల గుమ్మం పైన అమర్చుకోండి.

Significance Of Hanging A Pumpkin In Front Of The Houseగుమ్మడి కాయను శాస్త్రోక్తంగా కూష్మాండ పూజ అనుభవజ్ఞులైన పండితులచేత చేయించుకుని ఇంటి ప్రధాన ద్వారం పైన ఉట్టిలో వేలాడదీయండి. ప్రతీ రోజు రెండు అగరబత్తీలు వెలిగించి గుమ్మడికాయకు, ఐశ్వర్య కాళీ ఫోటో యంత్రానికి ధూపం చూపించండి. ప్రతీ రోజు ఇంట్లో పూజ చేసుకున్నపుడు రెండు అగరబత్తిలను వెలిగించి గుమ్మడి కాయదగ్గర పెట్టండి. ఇంటి ముందు గుమ్మడికాయ ఐశ్వర్య కాళీ ఫోటో యంత్రం ఉండటం వల్ల ఇంట్లోకి వచ్చేటువంటి నకారాత్మక శక్తిని అంటే నెగిటివ్ ఎనర్జీని రాకుండా ఇంటిని కాపాడుతుంది.

Significance Of Hanging A Pumpkin In Front Of The Houseమన ఇంటికి చూపించేటువంటి నరదృష్టి చెడు ప్రభావాన్ని అది లాక్కుంటుంది. మీరు ఎక్కువగా బూడిద గుమ్మడికాయలు కడుతున్నప్పుడల్లా కొద్ది రోజులకే కుళ్ళి పోతున్నాయంటే మీ ఇంటి మీద ఎక్కువగా నరఘోష, నరద్రుష్టి, నరపీడ ఉందని గుర్తుంచుకోండి. మీకు తగలవలసినటువంటి ఆ దోషాన్ని ఆ గుమ్మడికాయ లాక్కొని చెడిపోతుందని గమనించాలి. గుమ్మడికాయ ఇంటి బయట ఉంటే కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లు వెంటనే ఆ పాడైపోయినటువంటి గుమ్మడికాయను పారేసి వేరొక గుమ్మడికాయని పూజ చేయించుకుని కొత్తగా మల్లి కట్టాలి.

Significance Of Hanging A Pumpkin In Front Of The Houseఇంట్లో అద్దెకు నివసిస్తున్న వారైనా కూడా ఇంటి ద్వారం పైన గుమ్మడికాయను కట్టుకోవాలి. గుమ్మడికాయ ఇంటికి ఉంటే కాలభైరవుడు రక్షణగా ఉన్నట్లు గుర్తు. ఇంటి ముందుకు వచ్చేటువంటి దోషాలు అంటే నరఘోష, నరపీడ, నరదృష్టి, నరశాప, నకారాత్మక శక్తిని అంతా కూడా కాలభైరవ స్వరూపమైనటువంటి గుమ్మడికాయకు నిరోధించే శక్తి ఉంది కాబట్టి గుమ్మడికాయ విషయంలో ఎప్పుడూ కూడా అశ్రద్ధ చేయకండి.

Significance Of Hanging A Pumpkin In Front Of The Houseగుమ్మడికాయ ఒకటి మాత్రమే కాకుండా దానికి ఐశ్వర్య కాళీ ఫోటో యంత్రాన్ని జోడించినప్పుడే ఆశక్తి మరింత రెట్టింపు అయి పూర్తి స్థాయి ఫలితాలు మీకు అందిస్తుంది. మన ఇంటికి కాని వ్యాపార సంస్థలకు కాని కట్టిన గుమ్మడికాయ పాడవకున్నా ఎప్పుడేప్పుడు తోలగించి కొత్తది కట్టాలా.. అని చాలా మందికి సందేహం వస్తూ ఉంటుంది. శాస్త్ర సూచన ప్రకారం మన ఇంటికి గాని వ్యాపార సంస్థలలో కాని పూజించి కట్టిన గుమ్మడికాయను ఒక సంవత్సరం దాటితే తప్పక తీసివేయాలి. ఇంకా మధ్యలో గ్రహణాలు వచ్చినా, ఇంట్లో పురుడు మైల వచ్చినా, మృతౌ సంబంధించి సూతకం వచ్చినా, ఇంట్లో అమ్మయిలు పుష్పవతి అయినా ఇలాంటి ఏ సూతకం అయినా వస్తే ఆ పూజచేసి కట్టిన గుమ్మడికాయ శక్తిని కోల్పోతుంది కాబట్టి సూతకం అయిపోగానే కొత్తది కట్టుకోవాలి.

Significance Of Hanging A Pumpkin In Front Of The Houseపాడైపోయినప్పుడల్లా కొత్తది కట్టాలి. మనమే ఇంట్లో కాస్త పసుపు పూసి కుంకుమ బొట్టు పెట్టి కడితే సరిపోదు. వాటికి విధి విధానంగా శాస్త్రోక్తంగా పూజ జరిపించి శుభ మూహూర్థ౦లో కడితే శుభం కలుగుతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR