అత్యంత ఘనంగా నిర్వహించబడే సమ్మక్క సారక్క జాతరలోని ప్రత్యేకతలు ఏంటో తెలుసా ?

0
7172

1) సమ్మక్క సారక్క జాతర అనేది గిరిజనుల పెద్ద పండుగ. వరంగల్ కు సరిగ్గా 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడారంలో జరిగే ఈ వేడుకను చాలా భారీ స్థాయిలో నిర్వహిస్తారు. అందుకే ఈ పండుగను “తెలంగాణా కుంభమేళా” అని కూడా పిలుస్తారు.

sammakka2) రెండేళ్ళకోసారి అత్యంత ఘనంగా నిర్వహించబడే ఈ సమ్మక్క సారక్క జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద పండుగగా అభివర్ణిస్తారు. బ్రాహ్మణుడు లేకుండా నిర్వహించబడే ఏకైక వేడుక ఈ సమ్మక్క సారక్క జాతర.

sammakka3) నాలుగు రోజులపాటు అత్యంత భక్తిశ్రద్ధలతో ప్రజలు జరుపుకొనే ఈ పండగకు దాదాపు కోటికి పైగా జనాలు హాజరై ఆ సమ్మక్క-సారక్క దీవెనలు పొందుతారు. భారతదేశంలో అన్నీ తెగల గిరిజనులు ఈ వేడుకలో పాలుపంచుకోవడం మరో విశేషం.

sammakka4) సమ్మక్క అనే పాప కొందరు గిరిజనులకు అడవిలో దొరకగా.. ఆమెను వారు పెంచి పెద్ద చేసి పగిడిద్ద అనే రాజుకిచ్చి వివాహం చేస్తారు. వారికి పుట్టిన సంతానమే సారక్క, నాగమ్మ, జంపన్న.

sammakkasammakka5) 14వ దశాబ్ధంలో పన్ను కట్టే విషయంలో కాకతీయ రాజ్యంతో వచ్చిన విబేధాలు యుద్ధానికి దారితీస్తాయి. ఆ యుద్ధంలో పగిడిద్ది రాజుతోపాటు సమ్మక్క, సారక్క, జంపన్న కూడా పాల్గొంటారు.

sammakka6) కానీ అసంఖ్యాకమైన కాకతీయ సైనికుల ముందు ఎక్కువసేపు నిలువలేక వీరమరణం చెందుతారు. జంపన్న సైనికుల కత్తికి బలై పక్కనే ఉన్న వాగులో పడి తుది శ్వాస విడవగా.. ఆ వాగుకు జంపన్న వాగు అనే పేరు పెట్టారు. ఆయన రక్తంతో తడిసినందువల్లే ఇప్పటికీ ఆ వాగులో నీరు ఎర్రగా ఉంటుందని అక్కడి ప్రజల నమ్మకం.

sammakka7) సమ్మక్క పోరాటంలో రక్తమోడ్చి గుట్టపైకి వెళ్ళి అక్కడ్నుంచి కనుమరుగైందని అంటారు. ఆమె కోసం వెతుకుతూ వెళ్ళిన అనుచరులకు ఆమె కనపించకపోగా అక్కడి గుట్ట దగ్గరలో ఒక భరిణ కనిపించగా.. ఆ భరిణనే సమ్మక్కగా భావించి పూజించడం ప్రారంభించారు.

sammakka8) జాతర మొదటి రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మను గద్దెకు తీసుకువస్తారు. రెండవ రోజున చిలుకల గుట్టలో భరిణె రూపములో ఉన్న సమ్మక్కను గద్దెపై ప్రతిష్టిస్తారు. మూడవ రోజున అమ్మవార్లు ఇద్దరు గద్దెలపై కొలువు తీరుతారు. నాలుగవ రోజు సాయంత్రము ఆవాహన పలికి దేవతలను ఇద్దరినీ తిరిగి యద్ద స్థానానికి తరలిస్తారు.

8 - uuregimpu9) 1998 వరకూ మేడారం వెళ్లాలంటే ఎద్దుల బండ్లు లేదా కాలిబాటే మార్గం. కానీ.. ఇప్పుడు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పండుగ నాలుగు రోజులు స్పెషల్ బస్ లు వేస్తోంది.

9 - special buses10) ఈ ఏడాది జనవరి 30 నుంచి ఫిబ్రవరి 2వరకూ జరిగే సమ్మక్క సారక్క జాతర కోసం తెలంగాణా ప్రభుత్వం 172.54 కోట్ల రూపాయలు మంజూరు చేయడమే కాక జాతర అత్యంత వైభవంగా జరిగేలా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకొంటుండడం విశేషం.

10 - 2018 jathara