మంకీ బీ వైరస్‌ లక్షణాలు ఏంటో తెలుసా ?

కరోనా నుండి పూర్తిగా కోలుకోకముందే కొత్త కొత్త వైరస్ లు పుట్టుకొస్తూ జనాలకి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పుడు కొత్తగా మంకీ బీ వైరస్ అనేది వెలుగులోకి వచ్చింది. ఇది కోతుల నుంచి మనుషులకు సోకుతుంది. ఇది కరోనా కన్నా కూడా డేంజర్ వైరస్ అట. ఈ వైరస్ ముందు చైనాలో వెలుగుచూసింది. చైనాలోని బీజింగ్ లో ఓ పశు వైద్యుడికి ఈ వైరస్ సోకింది. ఈ వైరస్ సోకి ఆ వైద్యుడు మరణించాడు.

Signs and Symptoms of Monkey B Virusమంకీ బీ వైరస్‌కు దశాబ్దాల చరిత్ర ఉంది. 1932లో దీన్ని తొలిసారి గుర్తించారు. మంకీ బీ వైరస్‌ను ‌హెర్పెస్ బీ వైరస్ అని కూడా అంటారు. సాధారణంగా ఇది మకాక్ జాతి కోతుల ద్వారా వ్యాపిస్తుంది. రీసస్ మకాక్, పిగ్-టెయిల్డ్ మకాక్, సైనో మోల్గస్ రకం కోతులు కూడా ఈ వైరస్‌ను వ్యాపింపజేస్తాయి. 2020 లోనూ ఈ వ్యాధి వచ్చింది. 2020 లో ఈ వైరస్ వచ్చినప్పుడు 21 మంది మరణించారు.

Signs and Symptoms of Monkey B Virusకోతుల నుంచి ముందుగా ఈ వైరస్.. మనుషులకు సోకుతుంది. మకాక్ జాతికి చెందిన కోతుల లాలాజలం, యూరిన్, మలంలో ఈ వైరస్ ఉంటుంది. వాటి ద్వారా ఇది మనుషులకు సోకుతుంది. కోతులతో డైరెక్ట్ కాంటాక్ట్ అయినా కూడా ఈ వైరస్ సోకుతుందట. నేరుగా తాకడం లేదంటే శరీరం నుంచి వెలువడే స్రావాలు, ద్రవ, ఘన పదార్ధాల ద్వారా ఇది ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. వస్తువుల ఉపరితలాలపై కొన్ని గంటలపాటు ఈ వైరస్ జీవించగలదు. ఈ వైరస్ సోకితే మరణించే ప్రమాదం 70 నుంచి 80 శాతం వరకు ఉంటుందట.

Signs and Symptoms of Monkey B Virusఈ వైరస్ తో ఇన్ఫెక్షన్ అయితే కోతి.. మనిషిని కరిచినప్పుడు లేదా అది తన గోళ్లతో గీరినప్పుడు అది కోతుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందుతుంది. పశు వైద్యులు లేదా ఈ కోతులకు దగ్గరగా పని చేసే వ్యక్తులు దీని బారిన పడే అవకాశం ఉంటుంది. ఈ వైరస్ బారినపడ్డ వ్యక్తులలో నెల రోజులలోపే లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు వారంలోపే కనిపించే అవకాశం కూడా ఉంటుంది. వైరస్ ఎంత వేగంగా శరీరంలోకి పాకుతుందనే దానిపై లక్షణాలు ఆధారపడి ఉంటాయి. అయితే, వైరస్ సోకిన వారందరిలో లక్షణాలు కనిపించకపోవచ్చు.

లక్షణాలు:

  • వైరస్ సోకిన ప్రాంతంలో పొక్కులు
  • గాయం దగ్గర నొప్పి, తిమ్మిరి, దురద
  • జ్వరం వచ్చినప్పుడు కనిపించే ఒళ్లు నొప్పులు
  • చలి, జ్వరం
  • రోజంతా తలనొప్పి
  • తీవ్రమైన అలసట
  • కండరాలు పట్టివేయడం
  • శ్వాస తీసుకోవడంలో

Signs and Symptoms of Monkey B Virusఇబ్బంది లక్షణాలు ప్రారంభమైన మొదటి రోజు నుంచి మూడు వారాల వరకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు కనిపించవచ్చు. వైరస్ తీవ్రంగా ఉంటే మరణానికి దారి తీయవచ్చు.

మనుషులకు ఈ వైరస్ సోకితే అది నాడీ వ్యవస్థ, మెదడు, వెన్నుపూసలపై ప్రభావం చూపుతుంది. ఈ వైరస్ కు ప్రస్తుతం ఎటువంటి చికిత్స లేదు. ఈ వైరస్ నెమ్మదిగా బ్రెయిన్ ను ఎఫెక్ట్ చేస్తుంది. బ్రెయిన్ ను డ్యామేజ్ చేయడంతో పాటు నర్వస్ సిస్టమ్ ను కూడా డ్యామేజ్ చేస్తుంది. నర్వస్ సిస్టమ్ పూర్తిగా దెబ్బతిని.. మనిషి చనిపోయే ప్రమాదం ఏర్పడుతుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR