గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంచుకోటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసా ?

ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా గుండె సంబంధిత సమస్యలు పెరిగిపోతున్నాయి.. ఇదంతా మారిన ఆహారపు అలవాట్ల వలనే అని అందరికీ తెలుసు.. అయినా సరే కొంతమంది ఆ అలవాట్లు మార్చుకోలేరు.. మరి కొంతమంది మార్చుకోవాలని ఉన్నప్పటికీ కూడా ఎలా మార్చుకోవాలి.. గుండె ఆరోగ్యం కోసం ఎలాంటి ఆహార పదార్ధాలు తీసుకోవాలి.. ఏవి తీసుకోకూడదు తెలియక అలానే ఉండిపోతారు.. మరి మన గుండె ఆరోగ్యం మెరుగ్గా ఉంచుకోటానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో చూద్దాం..

Heart Problemఆరోగ్యకరమైన ఆహారంతో మన గుండె ఆరోగ్యం బాగుంటుంది. ఐతే ఈ ఆహారం సమయానికి తీసుకోవాలి. ఎంత హెల్దీ ఫుడ్ అయినా టైం కి తీసుకోకపోతే అది అనారోగ్యమే.. మనం ఏం తింటున్నామో, ఎంత తింటున్నామో తెలీకుండా తినడాన్ని బింజ్ ఈటింగ్ అంటారు. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ.. దీంతో ఊబకాయం, హార్ట్ స్ట్రోక్ ప్రాబ్లమ్స్ పెరిగే ముప్పు కూడా ఎక్కువే.. ప్రస్తుతం యుక్త వయసు వాళ్ళు కూడా హై కొలెస్ట్రాల్, డయాబెటీస్, హైబీపీ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇందుకు ప్రధాన కారణం వారి ఆహారం, అలవాట్లే.. కాబట్టి జంక్ ఫుడ్ తినడాన్ని పూర్తిగా తగ్గించి విటమిన్స్, న్యూట్రియెంట్స్‌తో సమృద్ధమైన ఆహారాన్ని తీసుకోవడం అలవాటు చేసుకోవాలి…

Heart Problemకడుపు నిండాక కూడా తినడం. ఎప్పుడు ఏదో ఒకటి తింటూ ఉండటం మానుకోవాలి.. అలాగే మనం తినే ఆహారంలో కొవ్వు పదార్దాలను అవాయిడ్ చేయాలి.. చాలా మంది ఆకలి అయినపుడు జంక్ ఫుడ్ తీసుకుంటారు.. ఇలాంటి ప్రాసెస్డ్ పదార్దాలలో ట్రాన్స్-ఫ్యాట్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. వీటిని తీసుకోవడం హై బ్లడ్ కొలెస్ట్రాల్‌కి దారి తీస్తుంది. అంతేకాక, కరోనరీ ఆర్టరీ డిసీజ్ వచ్చే ముప్పు కూడా పెరుగుతుంది. బ్లడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగితే హార్ట్ ఎటాక్, స్ట్రోక్ వచ్చే ప్రమాదం కూడా పెరుగుతుంది. అందుకని ఇలాంటి పదార్ధాలను కూడా అవాయిడ్ చేయాలి తద్వారా శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గించవచ్చు..

Heart Problemగుండె ఆరోగ్యాన్ని కాపాడటంలో ప్రోటీన్స్ పాత్ర అమోఘం.. లీన్ మీట్, చికెన్, ఫిష్ పప్పులు, ఫ్యాట్ తక్కువ ఉన్న పాలూ, పాల పదార్ధాలూ, ఎగ్స్‌లో ప్రోటీన్ పుష్కలంగా లభిస్తుంది. కొన్ని రకాల చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ ఉంటాయి. ఇవి లిపిడ్ లెవెల్స్‌ని తగ్గిస్తాయి. పప్పులు, బీన్స్, బఠానీలు వంటి వాటిని మీట్ బదులు తీసుకోవచ్చు. వీటిలో ఫ్యాట్ తక్కువ, కొలెస్ట్రాల్ అసలు ఉండదు, ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. మన బాడీ ప్రోటీన్‌ని తేలిగ్గా అబ్జార్వ్ చేసుకుంటుంది.

Heart Problemఅలాగే బ్లడ్ ప్రెజర్ ని రెగ్యులేట్ చేసి గుండె ఆరోగ్యం గా ఉండేటట్లు చూడడంలో హోల్ గ్రెయిన్స్ ప్రధాన పాత్ర పోషిస్తాయి. వీటిలో ఫైబర్, న్యూట్రియెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. రెఫైండ్ గ్రెయిన్స్ బదులు హోల్ గ్రెయిన్స్ వాడితే హార్ట్ హెల్దీగా ఉంటుంది. ఇక శాఖాహారమైన కూరగాయలూ, పండ్లలో విటమిన్స్, న్యూట్రియెంట్స్ లభిస్తాయి. వీటిలో కాలరీలు తక్కువ, ఫైబర్ ఎక్కువగా ఉంటాయి. కూరగాయలూ, పండ్లూ వంటివి శాకాహరం లో ఉండే కొన్ని గుణాలు కార్డియో వాస్క్యులర్ డిసీజెస్ రాకుండా చేస్తాయి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR