Home Unknown facts సీతారామ లక్ష్మణులు వనవాసంలో 11 సంవత్సరాలు నివసించిన ప్రదేశం

సీతారామ లక్ష్మణులు వనవాసంలో 11 సంవత్సరాలు నివసించిన ప్రదేశం

0

రామాయణం ప్రకారం శ్రీరాముడు 14 సంవత్సరాలు వనవాసం చేసాడు. అయితే 14 సంవత్సరాల వనవాసంలో 11 సంవత్సరాలు ఈ ప్రదేశంలోనే నివసించాడని చెబుతారు. మరి ఆ ప్రదేశం ఎక్కడ ఉంది? అక్కడి ప్రాంత విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Lord Rama

మధ్యప్రదేశ్ రాష్ట్రం, అలహాబాద్ కి కొన్ని కిలోమీటర్ల దూరంలో చిత్రకూట్ ఉంది. ఇక్కడే సీతారామ లక్ష్మణులు 11 సంవత్సరాలు నివసించారని చెబుతారు. ఇక్కడి ప్రాంతంలో మందాకిని నది ప్రవహిస్తుంది. ఈ ప్రాంతం అంత వర్షాలు లేక బాధపడుతుంటే అనసూయాదేవి తన తపోశక్తితో శివుడిని ప్రార్ధించి గంగను భువికి తీసుకువచ్చిందని అందుకే ఈ నదికి మందాకిని అనే పేరు వచ్చినది అని చెబుతారు.

ఇక్కడే రామఘాట్ ఉంది. శ్రీరాముడు ఇక్కడ నివసించేపుడు ప్రతి రోజు ఈ నదిలోనే స్నానం చేసేవాడని అందుకే భక్తులు ముందుగా ఇక్కడ స్నానం చేసి మిగిలిన ప్రదేశాలను దర్శిస్తారు. ఇక్కడే రామదర్శన్ అనే ఆలయం ఉంది.

కామత్ గిరి:

ఇక్కడి చిత్రకూట్ కి దగ్గరలోనే ఒక పర్వతం ఉంది. దీనిపేరు కామత్ గిరి అని అంటారు. ఈ కొండపైన శ్రీరాముడు కొంత కాలం నివసించాడని చెబుతారు. అందుకే భక్తులు ఈ కొండచుట్టు ప్రదక్షిణాలు చేస్తారు.

గుప్త గోదావరి:


శ్రీ రాముడు, లక్ష్మణుడు సీతాదేవిని వెతుకుంటూ వెళుతుండగా వారికీ స్రుగ్రీవుడు, ఆంజనేయుడు కలసిన ప్రదేశం ఇదేనని చెబుతారు. సుమారు 150 అడుగుల ఎత్తుగా ఉన్న కొండపైన ఒక గుహ ఉంది. ఆ గుహలోకి వెళితే ఒక కుండం ఉండగా అందులో నీరు ఎప్పుడు బయటకి ఉబికి వస్తుంది. అలానే ముందుకు వెళుతుంటే గుహలో ఒక్కరు మాత్రమే పట్టేంత స్థలం మాత్రమే ఉంటుంది. ఆలా అందులో నుండి నడుచుకుంటూ వెళితే చల్లని నీరు కాళ్ళకి తగులుతాయి, అలానే మరికొంత దూరం ముందుకు వెళ్లగా కాలికింద నీరు ఎక్కువ అవుతాయి. ఆ ప్రదేశాన్ని గుప్త గోదావరి అని పిలుస్తారు.

స్పటిక శిల:

ఇక్కడి నది ఒడ్డున 10 అడుగుల ఎత్తుతో, 15 అడుగుల వెడల్పుతో ఒక పెద్ద శిల ఉంది. దీనిని స్పటిక శిల అని అంటారు. ఈ శిలమీద రెండు పాదముద్రలు ఉన్నవి. ఇవి సీతాదేవి పాదముద్రలని చెబుతారు.

హనుమాన్ ధార:

చిత్రకూట్ గ్రామానికి చివరలో ఒక గుహ ఉంది. ఇక్కడి గుహలో పంచముఖ హనుమాన్ విగ్రహం ఉంది. ఇది ప్రత్యేకంగా ప్రతిష్టించిన శిల్పం కాదు, గుహలోకి గోడలోనే చెక్కిన శిల్పమూర్తి విగ్రహం. అయితే లంకాదహనాన్ని చేసినప్పుడు ఆంజనేయుడి తోకకు ఉన్న అగ్నిని శ్రీరాముడు ఇక్కడ ఉన్న పర్వత జలపాతంలోని నీటితోనే ఆర్పివేశాడని స్థానికులు చెబుతారు.

భరత్ కుప్:

దశరథుడు చనిపోయిన తరువాత అన్ని విషయాలను తెలుసుకున్న భరతుడు ఇక్కడి కి వచ్చి శ్రీరాముడిని అయోధ్యకి రమ్మంటు వేడుకున్నాడని, అప్పుడు రాముడు దానికి అంగీకరించకుండా నువ్వే రాజ్యాన్ని పరిపాలించాలని చెప్పి నేనే నీకు స్వయముగా పట్టాభిషేకం చేస్తానని చెప్పి దేశంలోని అన్ని పుణ్యనదులలో ఉన్న నీటిని తెప్పిస్తాడు. కానీ భరతుడు రాజుగా ఉండనని నీవు వచ్చే వరకు ఎదురుచూస్తానని రాముని పాదుకలను అడిగి తీసుకొని వెళ్తాడు. అప్పుడు శ్రీరాముడు ఆ నీటిని ఒక గుంటలో పోయిస్తాడు. దానినే భరత్ కుప్ అని అంటారు. కుప్ అంటే బావి అని అర్ధం. ఈ బావిలోని నీటితో స్నానం చేస్తే సర్వపాపాలు తొలగిపోయాయని భక్తుల నమ్మకం.

ఇలా ఈ కొన్ని ప్రదేశాలలో శ్రీ రాముడు తన వనవాస కాలంలో 11 సంవత్సరాలు గడిపారని చెబుతారు.

Exit mobile version