శివుడి కోసం పార్వతీదేవి తపస్సు చేసిన ప్రదేశం గురించి తెలుసా ?

0
3600

పార్వతీదేవి ఇక్కడ శివుడి కోసం గోర తపస్సు చేసిందని స్థల పురాణం చెబుతుంది. దేశంలో ఎక్కడ లేని విధంగా ఈ ఆలయంలో అమ్మవారు తపస్సు ఆచరించే భంగిమలో భక్తులకి దర్శనం ఇస్తుంటారు. మరి పార్వతి దేవి ఇక్కడ శివుడి కోసం ఎందుకు గోర తపస్సు చేసింది? ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఆలయంలోని విశేషాలు ఏంటనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ammavaariతమిళనాడు రాష్ట్రం, కాంచీపురం జిల్లా కి కొన్ని కిలోమీటర్ల దూరంలో మాంగాడు అనే గ్రామంలో అతి ప్రాచీనమైన కామాక్షి అమ్మవారి ఆలయం ఉంది. మాంగాడు అంటే మామిడి తోట అని అర్ధం. ఇక పూర్వం ఆది శంకరాచార్యుల వారు ఈ క్షేత్రం దర్శించి ఇక్కడ శ్రీ చక్రం ప్రతిష్ట చేసినట్లు ప్రసిద్ధి. ఈ అమ్మవారు మామిడితోటలో పంచాగ్నుల మధ్య నిలబడి తపస్సు చేసిన పవిత్ర స్థలంగా భక్తులు ఈ మామిడి తోటను భావిస్తారు.

ammavaariఈ ఆలయ పురాణానికి వస్తే, కైలాసంలో శివపార్వతులు పాచికలాడుతుండగా ఆటలో భాగంగా పార్వతీదేవి తన చేతులతో పరమేశ్వరుని నేతలను మూసింది. అప్పుడు సృష్టి మొత్తం అంధకారమైనది. అప్పుడు ప్రాణులు అల్లకల్లోలం అయినా విషయం గ్రహించిన శివుడు కోపంతో పార్వతి దేవి చేతిని తొలగించాడు. అప్పుడు సృష్టి యధాప్రకారం మారింది. పచ్చాత్తాపం చెంది తన తప్పు మన్నించమని పార్వతీదేవి శివుడిని వేడుకుంది. అందుకు పార్వతిని శివుడు మాంగాడులో తపస్సు చేయమని ఆజ్ఞాపించాడు. ఆ స్వామి ఆజ్ఞ ప్రకారం పార్వతీదేవి ఈ ప్రదేశానికి వచ్చి గోరతపస్సు చేసినట్లు స్థలపురాణం. అయితే ఆమె రగిల్చిన అగ్ని ఇంకా ఇచట రగులుతూనే ఉన్నది. అయితే ఆదిశంకరాచార్యుల వారు ఈ ప్రదేశానికి వచ్చినప్పుడు ఆ అగ్ని శిఖలను చల్లబరిచి శ్రీ చక్రాన్ని ప్రతిష్టించాడని తెలుస్తుంది. అమ్మవారి శక్తి అంత కూడా శ్రీ చక్రంలోనే ప్రవేశపెట్టినందువల్ల ఇచట శ్రీ చక్రనికే పూజలు చేస్తారు. అమ్మవారి విగ్రహానికి పూజలు అనేవి చేయరు.

ammavaariఈ ఆలయంలోని అమ్మవారు అగ్నిహోత్రం మీద తన ఎడమపాదం అగుష్ఠం అన్చ్చి నిలిచి నాలుగు దిక్కుల నాలుగు అగ్నులు ప్రజ్వరిల్లుతూ ఉండగా కుడికాలు మడచి ఎడమకాలుపై ఆనించిన భంగిమలో ఇక్కడ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఎడమచేయి హృదయస్థానంలో ఉంచి, తలమీదికి ఎత్తిన కుడిచేతిలో అక్షరమాల దాల్చి ఉంటుంది. ఇలా గోర తపస్సు చేసిన ఈ అమ్మవారు తపస్స్సు ఫలితంగా కాంచీపురంలోని ఏకామ్రేశ్వరస్వామిని (శివుడు) అమ్మవారు ఇక్కడ వివాహం ఆడినట్లు స్తల పురాణం తెలియచేస్తుంది.

ammavaariఇక వివాహం కావాల్సిన కన్యలు ఇక్కడికి వచ్చి ఈ అమ్మవారికి మొక్కుకుంటే త్వరలోనే వారికీ వివాహం జరుగుతుందని భక్తులు విశ్వసిస్తారు.

5 tapassu acharinche bangimalo