ఆలివ్ ఆయిల్ ఉపయోగిస్తే చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉందా ?

ఆలివ్ నూనెతో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో వంటల్లో కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారు అయితే ఈ మధ్య చర్మ సౌందర్యానికి ఆలివ్ ఆయిల్ ను చాలా మంది వాడుతున్నారు. చర్మంతో పాటు జుట్టు సంరక్షణకు కూడా ఈ నూనె ఉపయోగపడుతుంది. రసాయనాలతో చేసిన ఉత్పత్తులను వాడటానికి బదులుగా ఆలివ్ నూనెను బ్యూటీ ప్రొడక్ట్‌గా వాడుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఆలివ్ ఆయిల్ లో విటమిన్ ఏ, విటమిన్ కె,ఒమేగా 6, ఒమేగా 3 ప్యాటీ యాసిడ్స్ సమృద్ధిగా ఉంటాయి.

skin problems if olive oilమార్కెట్లో లభించే ఉత్పత్తులు అందరికీ పడకపోవచ్చు. వీటి వల్ల దుష్ప్రభావాలు కూడా ఎదుయ్యే ప్రమాదం కూడా ఉంది. అందువల్ల వాటికి బదులు ఆలివ్ నూనెను వాడితే అది చర్మం, జుట్టును మృదువుగా, మెరిసేలా చేస్తుంది. మేకప్ తొలగించడానికి కూడా ఆలివ్ నూనెను ఉపయోగించవచ్చు. మేకప్‌ను తొలగించడానికి నేరుగా సబ్బు, క్రీమ్‌లతో కడగకుండా ముందు కొంచెం ఆలివ్ నూనె రాయాలి. దీంట్లో ఉండే సహజ కొవ్వులు ముఖం మీద వేసుకునే మేకప్‌కు అతుక్కుంటాయి. దీంతో కడిగినప్పుడు మేకప్ అవశేషాలు పూర్తిగా తొలగిపోతాయి.

skin problems if olive oilఅయితే ఆలివ్ ఆయిల్ అనేది అన్ని చర్మ తత్వాలకు సెట్ అవ్వదు. జిడ్డు చర్మం ఉన్నవారు ఆలివ్ ఆయిల్ వాడకుండా ఉంటే మంచిది ఒకవేళ ఆలివ్ ఆయిల్ ఉపయోగిస్తే చర్మ సమస్యలు వచ్చే అవకాశం ఉంది జిడ్డు చర్మం ఉన్నవారు ఆలివ్ ఆయిల్ రాసినప్పుడు చర్మంపై ఎక్కువగా దుమ్ము,ధూళి పేరుకుపోతాయి దాంతో బ్లాక్ హెడ్స్,మొటిమలు వంటివి వస్తాయి.

skin problems if olive oil ఇక పొడిచర్మం వారి విషయానికొస్తే లిమిట్ గా ఉపయోగించవచ్చు. ఎక్కువగా ఉపయోగిస్తే చర్మంపై తేమ తొలగిపోయింది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,690,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR