శరీరం లోపల వేడిని నియంత్రణ చేసేందుకు కొన్ని ప్రభావవంతమైన మార్గాలు

0
991

మానవుని సాధారణ శరీర ఉష్ణోగ్రత 36.9 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండాలి. అప్పుడే బాహ్య వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నా అంతర్గత శరీర ఉష్ణోగ్రత, శరీరం యొక్క సాధారణ కార్యాచరణ నిర్వహించడానికి ఉపయోగపడుతుంది. శరీర వేడి వివిధ కారణాల వల్ల కలుగుతుంది. శరీరం చుట్టూ ఉండే పర్యావరణ వేడి కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వేసవి కాలంలో తీవ్రమైన ఎండలో ఉన్నప్పుడు శరీరం వేడి పొందుతుంది. తినే ఆహారం కూడా శరీర వేడి పెరగటానికి మరో కారణం కావొచ్చు. కొన్ని అనారోగ్యాలు లేదా మందులు కూడా శరీరం లోపల వేడి పెంచటానికి దోహదపడతాయి.

అంటువ్యాధులు ఉదాహరణకు జలుబు, జ్వరం , అస్వస్థత వంటివి వచ్చినపుడు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. థైరాయిడ్ వల్ల శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. డ్రగ్స్ లేదా కొన్ని మందులు ఉదాహరణకు కొకైన్ మరియు ఉత్ప్రేరకాలు తీసుకున్నపుడు శరీరం వేడికి గురి అవుతుంది. నరాలకు సంబంధించి ఏమైనా రుగ్మతలు ఉన్నప్పుడు, నిద్రపోతున్నపుడు కూడా అధిక శరీర వేడిని కలిగిస్తుంది.

Some effective ways to control heat inside the bodyశరీరం వేడిని పెంచే ఇతర కారణాలు… సోరియాసిస్, సిస్టిక్ ఫైబ్రోసిస్, మరియు తామర. ఎండలో ఎక్కువగా తిరగటం వల్ల కూడా శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఆల్కహాల్ మరియు ధూమపానం ఎక్కువగా సేవించే వారిలో వేడి ఎక్కువగా ఉంటుంది. సులభంగా శరీరం లోపల వేడిని నియంత్రణ చేసేందుకు కొన్ని ప్రభావవంతమైన మార్గాలు ఉన్నాయి. కొన్ని సహజ మూలికలు మరియు ఇంటిలో దొరికే ఔషధాలతో దీనిని నివారించవచ్చు.  అవేంటో ఇప్పుడు చూద్దాం…

->దానిమ్మ జ్యూస్ తీసి, అందులో ఆల్మండ్ ఆయిల్ నాలుగు చుక్క‌లు వేసుకుని తాగితే చ‌ల‌వ‌.

Some effective ways to control heat inside the body->గ్లాసుడు పాల‌లో రెండు టేబుల్ స్పూన్ల వెన్న‌ క‌లుపుకొని తాగితే వేడి త‌గ్గుతుంది.

Some effective ways to control heat inside the body->గ‌స‌గ‌సాలు వేడిని బాగా త‌గ్గిస్తాయి… కానీ, మోతాదు మించి తీసుకోవ‌ద్దు.

Some effective ways to control heat inside the body->గ్లాసుడు పాల‌లో చెంచాడు తేనె క‌లుపుకొని తాగితే శ‌రీరం అంతా కూల్ అవుతుంది.

Some effective ways to control heat inside the body->అలోవెరా జ్యూస్ చ‌ల‌వ చేస్తుంది… దాని ఆకుల మ‌ధ్య జెల్ నుదుటికి రాసుకుంటే చ‌ల్ల‌గా హాయిగా ఉంటుంది.

Some effective ways to control heat inside the body->గంధం చ‌ల్ల‌ని నీరు, లేదా పాల‌తో క‌లిపి నుదుట‌కు రాసుకుంటే వేడి మ‌టుమాయం.

->అన్నింటికీ మించి కొన్ని బార్లీ గింజ‌లు వేడి నీళ్ళ‌లో కాచి, మ‌జ్జిగ వేసుకుని ప‌ల‌చ‌గా తాగితే వేడి త‌గ్గుతుంది.

Some effective ways to control heat inside the body-> ఇవన్నీ చేయలేము అనుకుంటే నీళ్లు బాగా తాగితే చాలు… శ‌రీరంలో వేడి త‌గ్గిపోయి.. స‌మ ఉష్ణోగ్ర‌త ఏర్ప‌డుతుంది.

 

SHARE