అరటిపండు ఆరోగ్యానికి ఎంత మేలు జరుగుతుందో తెలుసా ?

అరటిపండు.. అందరికి అందుబాటులో ఉండే బడ్జెట్ పండు.. రోజు ఒక ఆపిల్ పండు తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదని చెప్తూ ఉంటారు. అయితే ఆపిల్  మాత్రమే కాదు రోజు ఒక అరటిపండు తిన్న మనం ఆరోగ్యంగా జీవించవచ్చు.  అన్ని సీజన్లలో లభించే ఈ అరటి పండ్లను ఎక్కువగా తినడం వలన అనేక రకాల రోగాల బారి నుండి బయటపడవచ్చు. అరటి పండ్ల రంగూ, రుచి, వాసన అవి పక్వానికి వచ్చే దశలో ఉష్ణోగ్రతల ఆధారంగా మారుతుంటాయి. తక్కువ ఉష్ణోగ్రతల వద్ద అరటిపండ్లు పాడయిపోయి పాలిపోవడం వల్ల వీటిని రిఫ్రిజిరేటర్లలో పెట్టరు. అలాగే ఎక్కువ ఉష్ణోగ్రతకు పెట్టరు.. ఆలా పెడితే మగ్గి నల్లగా అవుతాయి.. అరటిలో పిండిపదార్థాలు, కార్బోహైడ్రేటులు ఎక్కువ ఉంటాయి. ప్రతి 100 గ్రాముల అరటిలో 20 గ్రాముల కార్బోహైడ్రేటులు, 1 గ్రాము మాంసకృత్తులు  అంటే ప్రోటీనులు, 0.2 గ్రాములు కొవ్వు పదార్థాలు, 80 కిలోక్యాలరీల శక్తి ఉన్నాయి. అంతే కాదు అరటి సులభంగా జీర్ణమై మలబద్ధకం రాకుండా శరీరాన్ని కాపాడుతుంది.

Health Benfits of Bananaఅరటి చెట్టులోని కాండం, ఆకులు, పువ్వులు కూడా మనకి మేలుచేసేవే..  అరటి పువ్వును వంటలలో ఉపయోగిస్తారు. అరటి కాండములోని సున్నితమైన మధ్య భాగమైన దూట కూడా వంటలలో ఉపయోగిస్తారు – అరటి పూవు తింటే జీర్ణ క్రియ తేలికగా జరిగి సుఖ విరోచనము అగును . ఇందులోని ఐరన్, కాల్సియం, పొటాసియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్, వగైరాలు నాడీ వ్యవస్థ మీద ప్రభావంచూపి సక్రమముగా పనిచేసేటట్లు చేస్తాయి..  ఇందులోని విటమిన్ సి వ్యాధినిరోధక శక్తిని అభివృద్ధి చేస్తుంది..  ఆడవారిలో బహిస్టుల సమయంలో అధిక రక్తస్రావము అరికట్టడానికి ఇది పనికొచ్చును. అలాగే మగవారిలో వీర్య వృద్ధికి దోహద పడుతుంది..  ఇక అరటి ఆకులు చాలా సున్నితంగా, పెద్దగా ఉంటాయి. ఇవి తడి అంటకుండా ఉంటాయి, అందువల్ల వీటిని గొడుగుకు బదులుగా వాడతారు. కొన్ని ప్రాంతాలలోవీటిని వంటకాలు చుట్టడానికి  ఉపయోగిస్తారు. అరటి ఆకులో భోజనం చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని చాలా మంది నమ్ముతారు. అరటిపండులో  74% కన్నా ఎక్కువగా నీరు ఉంటుంది. పచ్చి అరటిపండులో కార్బోహైడ్రేటులు స్టార్చ్ రూపములో ఉంటాయి, పండుతున్న కొద్దీ ఇవి చక్కరగా మార్పుచెందబడతాయి. అందుకే పండు అరటి తియ్యగా ఉంటుంది. పూర్తిగా మాగిన అరటిలో 1-2% చక్కర ఉంటుంది. అరటిపండు మంచి శక్తిదాయకమైనది. అంతే కాకుండా ఇందులో పొటాషియం కూడా ఉంటుంది. అందువల్ల ఇది రక్తపోటుతో బాధపడుతున్నవారికి చాలా విలువైన ఆహారం. అరటిపండు, పెద్ద పేగు వ్యాధిగ్రస్తులకు చాలా చక్కని ఆహారం. అందుకే అరటి పండు పేదవాడి ఆపిలు పండు అని అంటారు. ఎందుకంటే, రెండింటిలోనూ పోషక విలువలు సమానంగానే ఉంటాయి.

Health Benfits of Banana
అరటి పండులో ఉండే పోషకాలు అధిక రక్తపోటు మధుమేహం ఆస్తమా క్యాన్సర్ అజీర్తి జీర్ణ సమస్యలను నిరోధిస్తుంది.అరటి పండులో పొటాషియం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇది ఎముకలకు మరియు దంతాలకు చాలా మంచిది. కిడ్నీల ఆరోగ్యానికి కూడా ఇది ఉపకరిస్తుంది. వారానికి రెండు లేదా మూడు అరటి పండ్లు తినడం వల్ల మహిళలు కిడ్నీ జబ్బుల బారిన పడే ముప్పు నుండి తప్పించుకోవచ్చు అని ఒక అధ్యయనంలో తేలింది.

Health Benfits of Bananaరోజుకో అరటిపండు తినడం ద్వారా ఆస్తమా లక్షణాలు తగ్గుముఖం పడతాయి. అరటి పండ్లలో ఫైబర్ పొటాషియం ఎక్కువగా ఉంటాయి అవి రక్తపోటును తగ్గించి క్యాన్సర్ తో పోరాడుతాయి.అరటిపండులో  కొవ్వు ఉండదు అలాగే కాలోరీలు కూడా చాలా తక్కువ.  పూర్తిగా పక్వానికి రాని అరటిలో రెసిస్టన్స్ స్టార్చ్ ఉంటుంది. ఇది కడుపు నిండిన భావన కలిగించి  ఆకలిని తగ్గిస్తుంది. తద్వారా అరటి పండు బరువు తగ్గటానికి ఉపకరిస్తుంది. అరటిపండులోని పొటాషియం శరీర కండరాల్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. డైటింగ్ చేస్తున్నవాళ్లు ఒకపూట భోజనం లేదా టిఫిన్ మానేసి అరటిపండు, వెన్న తీసిన పాలు తీసుకుంటే శరీరానికి కావలసిన పోషకాలన్నీ అందుతాయి.
Health Benfits of Banana
ఈ పండ్లలో ఫైబర్ అధిక స్థాయిలో ఉంటుంది ఇది మలబద్దకం నుండి ఉపశమనం కలిగిస్తుంది. పేగులను ఉత్తేజితం చేసి జీర్ణాశయంలోని వ్యర్థాలను బయటకు పంపేందుకు సహకరిస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అరటికి ఎయిడ్స్‌ వైరస్‌పై పోరాడే శక్తి ఉంది.అరటిలోఉండే ‘బాన్‌లెక్‌’ అనే రసాయనం ఎయిడ్స్‌ వైరస్‌పై శక్తిమంతంగా పోరాడుతుందని తేల్చారు. ప్రస్తుతం వైరస్‌ నిరోధానికి వాడుతున్న ‘టీ20, మారావిరాక్‌’ మందులతో సమానంగా ఈ రసాయనం పనిచేస్తుంది..అరటిలోని లెక్టిన్‌ రసాయనం వైరస్‌ను శరీరంలో ప్రవేశించనీయకుండా అడ్డుకుని ఇన్‌ఫెక్షన్‌ను నిరోధిస్తుంది.ఈ రసాయనం ప్రొటీన్‌పై పరచుకుని హెచ్‌ఐవీ జన్యుపదార్థం మూసుకుపోయేలా చేస్తుంది.
Health Benfits of Banana
అరటిపండ్లలో ఉండే ట్రిప్టోఫాన్ అనే అమైనో యాసిడ్ శరీరంలో ప్రవేశించగానే సెరటోనిన్‌గా మారి ఒత్తిడిని తగ్గిస్తుంది. అందుకే రాత్రిపూట పాలు, అరటిపండు తీసుకుంటే నిద్ర బాగా పడుతుందని చెబుతారు. అయితే అరటి పండ్లను కొనేటప్పుడు కొన్ని విషయాలు తప్పకుండా గమనించాలి. కార్బైడ్ తో మరగబెట్టిన అరటి పండును తినడం ఆరోగ్యానికి హానికరం. ఇలా కార్బైడ్ తో మరగబెట్టిన అరటిపండు, అరటిపండు గుత్తి కూడా పచ్చగా ఉంటుంది. నిమ్మకాయలా పసుపురంగులోకి  మారుతుంది. ఎలాంటి మచ్చలు ఉండవు. అయితే సహజసిద్ధంగా పక్వము వచ్చిన  అరటిపండులో గుత్తి రంగు నల్లగా ఉంటుంది అలాగే తొక్క పై మచ్చలు ఉంటాయి,  అరటిపండు కూడా  లేత పసుపు రంగులో ఉంటుంది. ఇది చూసి మంచివి తీసుకుంటే మనం ఆరోగ్యంగా ఉండొచ్చు..

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,680,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR