Home Health ఉదయాన్నే పుదీనా రసం తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు

ఉదయాన్నే పుదీనా రసం తీసుకోవడం వలన కలిగే ప్రయోజనాలు

0

సులువుగా ఇళ్లల్లో కూడా పండించుకునే పుదీనా లో ఔషధ గుణాలు చాలా ఉంటాయి. మంచి ఫ్లేవర్ ని ఇచ్చే పుదీనా లో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. తరుచూ పుదీనాని తీసుకోవడం వల్ల అనేక సమస్యలు తరిమికొట్టొచ్చు. పుదీనా ఆకులు రోగ నిరోధక శక్తిని పెంచడానికి కూడా ఉపయోగపడతాయి దీనిలో విటమిన్ ఏ, విటమిన్ సి గుణాలు అధికంగా ఉంటాయి. ఉదయాన్నే ఒక కప్పు పుదీనా రసం తీసి దానిని తాగితే మనిషి శరీర పని తీరుకు అవసరమయ్యే పీచు, క్యాల్షియం, మాంగనీస్, పొటాషియం అందుతాయి.

Health Benefits of mint juiceపుదీనా మంచి మౌత్ ఫ్రెష్నర్ గా కూడా ఉపయోగ పడుతుంది. పుదీనాని తీసుకోవాలంటే సలాడ్స్ లో వేసుకుంటే మీకు తినడానికి ఈజీగా ఉంటుంది. లేదంటే మీరు టీ కూడా చేసుకోవచ్చు. నీటి లో పుదీనా ఆకుల్ని వేసి మరిగించి ఆ తరువాత వడకట్టి షుగర్ కి బదులుగా తేనె వేసి తాగొచ్చు. అది కూడా మంచి ప్రయోజనాన్ని ఇస్తుంది.

గర్భిణీలకు అవసరమైన ఫోలిక్ ఆమ్లం కూడా దీనిలో ఉంటుంది. రెగ్యులర్ డైట్ లో దీనిని తీసుకోవడం వల్ల జీర్ణ క్రియని మెరుగు పరచి వేగవంతం చేస్తుంది. పుదీనా ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు రోజ్ మ్యారిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటాయి. ఇది సీజనల్ గా వచ్చే అలర్జీలు తగ్గిస్తుంది. శరీరం లో మనకి తెలియకుండా పెరిగే కణుతులు పెరుగుదలకు అడ్డుకట్ట వేయడానికి పుదిన బాగా ఉపయోగ పడుతుంది.

ఐస్ వాటర్ లో రెండు మూడు పుదీనా ఆకుల్ని వేసి తీసుకోవడం వల్ల స్టొమక్ అప్ సెట్ ని నివారిస్తుంది. ఇలా ఇంత మంచి ఫ్లేవర్ కలిగిన పుదీనా తీసుకోవడం వల్ల మంచి ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి కనుక దీనిని రెగ్యులర్ గా తీసుకోండి. అనారోగ్యం నుంచి బయట పడండి. దీనితో సులువుగా సమస్యలకి చెక్ పెట్టేయొచ్చు.

 

Exit mobile version