Home Health ఎర్ర అరటి పండుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

ఎర్ర అరటి పండుతో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

0

సామాన్యుల నుంచి ధనికుల వరకు అందరికీ అందుబాటులో ఉంటుంది అరటిపండు. ఏ పండగొచ్చినా.. పబ్బమొచ్చినా అరటిపండును కొనకుండా ఉండలేం. ఇక ఫంక్షన్లు..పెళ్లిళ్లు ఇలా ఒకటేమిటి ప్రతి శుభకార్యక్రమానికి అరటిపండును ఆరగించేస్తాం. ఈ పండ్లలో పచ్చ, ఆకుపచ్చ, చక్కెరకేళి, అమృతపాణి వంటి రకాలు మాత్రమే మనకు తెలుసు కానీ, అరటి పండ్లలో వెయ్యి రకాలున్నాయని మీకు తెలుసా..!

health benefits of red bananaక్యావెండిష్‌, పిసాంగ్‌ రాజ, రెడ్‌, లేడీఫింగర్‌, బ్లూజావ, ప్లాంటేయిన్‌, మంజనో, బుర్రో, బరాంగన్‌, గోల్డ్‌ఫింగర్‌ వంటివి కొన్ని. వీటిలో ఎక్కువ ఎగుమతి అయ్యేది కవాండిష్‌. లేడీ ఫింగర్‌ అరటి చిన్నగా ఉంటుంది. కేవలం 4-5 అంగుళాలు ఉంటుంది. బ్లూజావా అరటి పండ్లను ఐస్‌క్రీం అరటి అని అంటారు. ఎందుకంటే వీటి రుచి వెనీలాలా ఉంటుంది. అందుకే ఐస్‌క్రీం అరటి అనే పేరు వచ్చింది. మంజానో అరటిని యాపిల్‌ బనానా అంటారు. ఎర్ర అరటి పండ్లను అమెరికాలో ఇష్టంగా తింటారు. వీటిని తూర్పు ఆఫ్రికా, ఆసియాల్లో పండిస్తారు.

ఎర్ర అరటి పండు మన దేశంలో అరుదు కానీ.. ఆస్ట్రేలియా, ఇతర దేశాల్లో ఈ అరటి పండుకు ఫుల్ డిమాండ్ ఉంటుంది. అవును ఎర్రటి అరటి పండు మనిషి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందని ఎన్నో అధ్యయనాలు తేల్చి చెప్పాయి. మనిషిని సంపూర్ణ ఆరోగ్యంగా ఉంచేందుకు ఈ అరటి పండు దోహపడుతుందని తేల్చారు. మరి ఎర్ర అరటి పండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టకుండా రక్షిస్తుంది :

సాధారణంగా, ప్రజలు అరటి పండ్లను ఎక్కువగా తింటారు. కారణం.. అరటి పండ్లలో పోషకాలు చాలా ఎక్కువ. అయితే, ఎర్రటి అరటి పండులో అంతకు మించి ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఖనిజాలు, విటమిన్లు, ఫైబర్ పదార్థాలు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉంటాయట. అంతేకాదు.. సాధారణ అరటిపండులో కంటే చాలా ఎక్కువ బీటా కెరోటిన్ కలిగి ఉంటుందట. బీటా కెరోటిన్ గుండె ధమనులు రక్తం గడ్డకట్టకుండా చూస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

బరువు తగ్గడంలో కీలక పాత్ర పోషిస్తుంది :

ఎర్ర అరటిపండ్లలో చాలా తక్కువ కేలరీలు ఉంటాయి, ఇవి మీ బరువు తగ్గడానికి సహాయపడుతాయి. అరటిపండు తినడం వల్ల కడుపు నిండినట్లు అనిపిస్తుంది. దాంతో అతిగా తినడం మానేస్తాం. అంతిమంగా ఇది బరువు తగ్గడానికి దోహదపడుతుంది.

తక్షణ శక్తినిస్తుంది :

ఎర్ర అరటి పండు సాధారణ అరటి పండు కన్నా ఎక్కువ శక్తిని ఇస్తుంది. ఎర్ర అరటిపండ్లు తీసుకోవడం తక్షణ శక్తి లభిస్తుంది. ఈ అరటిలో ఉన్న సహజ చక్కెర వెంటనే శక్తిని ఇవ్వడానికి దోహదపడుతుంది.

క్యాన్సర్, గుండె జబ్బులను దరిచేరనీయదు :

ఎరుపు రంగు అరటి పండు తినడం వల్ల క్యాన్సర్, గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా ఉంటాయి. ఈ అరటిపండు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ప్రభావవంతంగా పని చేస్తుంది. అంతేకాదు.. ఈ అరటి పండు తినడం వల్ల చెస్ట్ అలర్జీని తగ్గిస్తుంది.

రక్తపోటును నియంత్రించడంలో సహాయపడుతుంది :

ఎర్ర అరటిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ప్రతిరోజూ ఒక ఎర్ర అరటిపండు తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఈ పండులో పొటాషియం అధికంగా ఉంటుంది. ఆ కారణంగా.. గుండె పోటు రాకుండా కాపాడుతుంది.

రక్తహీనతను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది:

ఎరుపు రంగు అరటిపండ్లలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో హిమోగ్లోబిన్ శాతాన్ని గణనీయంగా పెంచుతుంది. ఇది కాకుండా, విటమిన్ బి 6 కూడా ఈ పండు తినడం ద్వారా శరీరానికి లభిస్తుంది. రక్తహీనత లోపాన్ని అధిగమించడానికి విటమిన్ బి 6 సహాయపడుతుంది.

 

Exit mobile version