గులాబీ రేకుల వలన ఆరోగ్యానికి కలిగే మేలు ఏంటో తెలుసా ?

0
819

అందానికి, ప్రేమకు చిహ్నంగా రోజాను చూపిస్తారు. కానీ ఇప్పుడు మేము చెప్పేది తెలుసుకుంటే ఆరోగ్యానికి కూడా గులాబీని కేరాఫ్ అడ్రస్ గా చూపిస్తారు. చూడగానే కళ్ళకు ఎంతో అందంగా నయనానందకరంగా కనిపించే రోజా పూలకు ఎన్నో ఔషధ గుణాలున్నాయి. అవి అందానికే కాదు, ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అవేంటో తెలుసుకుందాం.

health benefits of rose petals->ముఖంపై మొటిమలు, నల్ల మచ్చలు ఉన్న ప్రదేశంలో రోజా రేకుల ముద్దను రాసుకుంటే సత్ఫలితం ఉంటుంది. క్రమేపీ నల్లమచ్చలు తగ్గిపోతాయి.

->రోజా పూల నుంచి వచ్చే సువాసనను పీల్చడం వల్ల శారీరకంగానే కాక మనసుకు కూడా ప్రశాంతత లభిస్తుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి దోహదపడుతుంది.

health benefits of rose petals-> వేడి నీటిలో రోజా రేకులు, బాత్‌సాల్ట్‌ వేసి ఆ మిశ్రమాన్ని క్రమం తప్పకుండా పీల్చితే మెదడు చురుగ్గా ఉంటుంది.

health benefits of rose petals->ఇది జీర్ణక్రియను కూడా మెరుగుపరుస్తుంది. కొద్దిగా మెంతులు, రోజా రేకులు కలిపి చేసుకున్న పేస్టును తినడం వల్ల శరీరంలో చెడు కొవ్వు తగ్గుతుంది. అధిక బరువు ఉన్నవారు ప్రతిరోజూ ఇది తినడం వల్ల బరువు తగ్గుతారు.

->రక్తాన్ని శుద్ధి చేసి రక్తప్రసరణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

health benefits of rose petals->రోజా రేకులతో తయారుచేసే కషాయం కూడా ఆరోగ్యానికి మంచిది. ఇది చర్మానికి మెరుపును అందిస్తుంది.

-> రోజు ఓ గుప్పెడు గులాబీ రేకుల తినడం వలన శృంగార సమస్యలు తొలగిపోతాయి.