శివుడికి అమ్మగా మారి ఉపచారాలు చేసిన బెజ్జమహాదేవి చరిత్ర

తల్లి గల్గిన నెల తపసిగానిచ్చు
తల్లి గల్గిన నెల తల జడల్గట్టు?
తల్లియున్న విషంబు త్రావనేలిచ్చు?
తల్లియుండిన తోళ్ళు దాల్పనేలిచ్చు?
తల్లిపాముల నెల ధరియింపనిచ్చు?
తల్లి పుచ్చునె సుతు వల్లకాటికిని”

పాల్కురికి సోమన పాత్రల్ని మనముందు నిలుపుతాడు. బెజ్జ మహాదేవి శివుడితో నువ్వు దేవదేవుడివే కావచ్చు కానీ ‘తల్లి గల్గిననేల తపసి కానిచ్చు?/ తల్లి గల్గిన నేల తల జడల్గట్టు?’ అంటూ పరమశివుడి నిరాడంబరతకు తల్లి లేకపోవడమే కారణంగా తలుచుకోవటం పాఠకులు ‘అయ్యో పాపం!’ అనుకునేలా చేస్తుంది. ఇంకా శివలింగాన్ని ఒళ్లొ పెట్టుకుని స్నానం చేయిస్తున్న విధానాన్ని ‘తొంగిళ్లపై నిడి లింగమూర్తికిని/ అంగన కావించు అభ్యంగనంబు/ ముక్కొత్తు చెక్కొత్తు ముక్కన్ను వులుము అని రాసిన ద్విపదలైతే పసివాడికి స్నానం చేయించేటప్పుడు తల్లి ఆప్యాయత, ప్రేమ ఎలా ఉంటాయో కళ్లముందు నిలుపుతాయి. శివుడి మూడు కళ్లకూ కాటుక పెట్టిన సందర్భం ఎంతటివారికైనా ‘ఆహా!’ అనిపిస్తుంది. ఇంతకీ ఆ బెజ్జమహాదేవి ఎవరు అనుకుంటున్నారా? అయితే ఆమెకు శివునిపై ఉన్న వాత్సల్యాన్ని తెలుసుకుందాం.

బెజ్జమహాదేవిఅమ్మ లాలనలో ప్రతి బిడ్డ ఏ ఆపదలు లేకుండా ఆనందంగా ఉంటాడు. తల్లి ఎప్పుడు తన బిడ్డ ఆయురారోగ్యాలతో కలకాలం సుఖంగా ఉండాలని కోరుకుంటుంది. తనకు పుట్టిన బిడ్డపైన ఏ తల్లి అయినా అమిత ప్రేమను పెంచుకుంటుంది. కాని ఇక్కడ భగవంతునికే తల్లిగా మారి తన ప్రేమను ఎలా చూపించిందో మనం తెలుసుకోవాలి. శివుడు స్మశానంలో ఉంటాడు. బూడిద ధరిస్తాడు. జుట్టు జడలు కట్టి ఉంటుంది. అమ్మ ఉంటే ఎవరైనా అలా ఉంటారా? అమ్మ అలా ఉండనిస్తుందా? అభవుడైన శివుని గురించి ఈ తల్లి ఆలోచనలో పడింది. శివుణ్ణి అభవుడు అంటారు కదా అదేంటి ఆయనకు పుట్టుక లేదా ఏ తల్లి కడుపున పుట్టలేదా చాలా ఆశ్చర్యంగా ఉందే.

బెజ్జమహాదేవిమరి శివుడు స్వయంభువుడుగా ఎలా పుట్టాడు  అంతా అయోమయంగా ఉంది అనుకుంది బెజ్జమహాదేవి. ఆమె ముత్తవ్వగా, అమ్మవ్వగా శంకరుని చేతనే కీర్తించబడింది. నిత్యత్వాన్ని పొందింది. ఆమె లింగ పూజలు చేస్తున్నంత సేపు ఆమెలో తెలియని బాధ చోటుచేసుకుంది. శివుడి తల్లి చిన్నప్పుడే చనిపోయిందేమో.. అని బాధ పడింది. చివరకు బెజ్జమహాదేవి ప్రశ్నకు సమాధానం దొరికింది.

బెజ్జమహాదేవిబెజ్జమహాదేవి బాలపరమేశ్వరుని చేసుకొని అతనికి ఎన్నో సేవలు, ఎన్నెన్నో పరిచర్యలు చేసింది. ఒక్క క్షణం కూడా ఊరుకోకుండా బాలుడై ఒడిలో చేరిన లింగడికి సర్వోపచారాలు చేసింది. అవి ఉపచారాలు అని ఆమెకు తెలియదు. తల్లి లేని శివుడికి తల్లియై పసిబాలుని అలా పెంచాలన్నదే ఆమె ఆలోచన. శివునికి ఏ కొరత లేకుండా చేయాలి అన్నదే ఆమె కోరిక. తల్లి ప్రేమకు శివుణ్ణి పాత్రుణ్ణి చేసింది ఆ తల్లి.

బెజ్జమహాదేవిశివుడు శిశివు రూపంలో ఉన్నాడు కదా.. ఆ శివుడికి నీళ్లు పోయటం దగ్గర నుంచి అన్ని పనులు చేయసాగింది. ఆమె తన కాళ్లను బారచాపి పసి లింగ మూర్తిని కాళ్లపై వేసుకొని లాల పోసింది. కనుముక్కు తీరు సక్రమంగా ఉండాలని వాటిని చక్కగా వత్తి తీర్చిదిద్దింది. పొట్టను వత్తి బోర్లా పడుకోబెట్టి నీళ్ల దోసిళ్లతో చరచి వీపు నిమిరింది. ఇదంతా ప్రతి తల్లి తన బిడ్డల శారీరక ఎదుగుదలకు చేసేదే అదే చేసింది ఈ తల్లి కూడా. ఉగ్గుపోసింది. పసివాడి మీద పక్షుల నీడ పడకుండా జాగ్రత్త చేసింది. పసివాడిని తన పొట్ట మీద పడుకోబెట్టి జోలపాడి నిద్ర పుచ్చింది. ఆ తల్లి నిశ్వార్ధ ప్రేమకు లొంగిపోయాడు భోళాశంకరుడు. అయినా తల్లి ప్రేమను మించింది ఈ విశ్వంలో ఏముంటుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR