తలలో జిడ్డు సమస్య నుండి సులభంగా బయట పడే సులువైన పద్ధతులు

జుట్టుకు ఎలాంటి నూనెలు ఉపయోగించకుండానే మీ జుట్టు జిడ్డుగా కనబడితే దాన్ని ఆయిలీ హెయిర్ గా పిలుస్తారు. ఈ సమస్యను తగ్గించుకోవడానికి రోజు తలస్నానం చేస్తే, జుట్టులో ఉండే న్యాచురల్ ఆయిల్ తగ్గిపోయి, జుట్టు డ్యామేజ్ అవుతుంది. అయితే మనం ఇంటిలో అందుబాటులో ఉండే కొన్ని వస్తువులతో తలలో జిడ్డు సమస్య నుండి సులభంగా బయట పడవచ్చు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Some home tips to reduce greasy on the headస్కిన్ అండ్ హెయిర్ బ్యూటీ కోసం నిమ్మరసంను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. నిమ్మరసంలో ఉండే విటమిన్, మినిరల్స్ వల్ల తలలో ఎక్సెస్ సెబమ్ ఉత్పత్తి కాకుండా కంట్రోల్ చేసి తలలో జిడ్డును తొలగిస్తుంది. రెండు కప్పుల నీటిలో రెండు నిమ్మకాయల రసాన్ని పిండి ఈ మిశ్రమాన్ని జుట్టుకు అప్లై చేసి 10 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. ఈ చిట్కాను వారంలో రెండు సార్లు ఫాలో అయితే చాలు మంచి ఫలితం ఉంటుంది.

Some home tips to reduce greasy on the headపుదీనాలో ఉండే ఆస్ట్రిజెంట్ గుణాలు తలలో ఎక్సెస్ ఆయిల్ ను తొలగించడానికి ఫర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. పుదీనా ఆకులను నీళ్ళలో వేసి 15 నిముషాలు ఉడికించాలి. తర్వాత ఆ నీటిని ఒక గిన్నెలోనికి వడగట్టుకుని, చల్లారనివ్వాలి. ఈ నీటిని రెగ్యులర్ షాంపుతో మిక్స్ చేసి తలకు అప్లై చేసి 15 నిముసాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి.

Some home tips to reduce greasy on the headరెండు స్పూన్ల ఆలివ్ ఆయిల్ లో రెండు చుక్కల టీ ట్రీ ఆయిల్ ని వేసి బాగా కలిపి ఈ నూనెను తలకు రాసుకుని వేడి నీటిలో ముంచిన కాటన్ టవల్ తలకు చుట్టి 15 నిమిషాల పాటు ఉంచి చన్నీళ్లతో తలస్నానము చేయాలి. ఈ విధంగా క్రమం తప్పకుండ నెల రోజుల పాటు చేస్తే తలలో జిడ్డు సమస్య తొలగిపోతుంది.

Some home tips to reduce greasy on the headతలలో చుండ్రు, ఇన్ఫెక్షన్స్ నివారించడంలో సొరకాయ జ్యూస్ బాగా సహాయపడుతుంది. సొరకాయ జ్యూస్ లో బీట్ రూట్ జ్యూస్ వేసి మిక్స్ చేసి తలకు అప్లై చేసి 10 నిముషాల తర్వాత తలస్నానం చేయాలి. వారంలో రెండు సార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

Some home tips to reduce greasy on the headబేకింగ్ సోడ తలలో ఎక్సెస్ ఆయిల్ ను గ్రహిస్తుంది. తలలో జిడ్డు లేకుండా హెయిర్ ఫ్రెష్ గా, క్లీన్ గా మార్చుతుంది. బేకింగ్ సోడలో కొద్దిగా నీళ్ళు మిక్స్ చేసి చిక్కని పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ ను జుట్టుకు అప్లై చేసి 10 నిముషాలు అలాగే ఉంచాలి. పది నిముషాల తర్వాత చన్నీటితో తలస్నానం చేయాలి. ఇలా వారానికొకసారి చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

Some home tips to reduce greasy on the headకలబంద తలను శుభ్రం చేసి, తలలో ఎక్సెస్ ఆయిల్, ఇతర మలినాలను, ఇన్ఫెక్షన్స్ ను నివారించే ఎంజైమ్స్ ఉన్నాయి. ఇంకా అలోవెరలో ఉండే విటమిన్స్, మినిరల్స్ జుట్టును స్మూత్ గా మార్చి, దురద, చుండ్రు తగ్గిస్తుంది. జుట్టును హెల్తీగా మార్చుతుంది.

Some home tips to reduce greasy on the headఅలోవెర జెల్, నిమ్మరసం రెండు పదార్థాలను బాగా మిక్స్ చేసి తలకు అప్లై చేసి 15 నిముషాలు తర్వాత తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేయడం వల్ల మీ జుట్టు జిడ్డు తొలగిపోయి అందంగా కనిపిస్తుంది.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR