Home Unknown facts మన పురాణాల్లో చెప్పబడిన రెక్కలు ఉండే ఆ పర్వతం ఏంటి?

మన పురాణాల్లో చెప్పబడిన రెక్కలు ఉండే ఆ పర్వతం ఏంటి?

0

అంతరిక్షంలో ఉన్న గ్రహ శకలాలను యాస్టిరాయిడ్స్ అని అంటారు. అయితే పూర్వం నుండే గ్రహశకలాలకు సంబంధించిన ప్రస్తావన అనేది ఉందని చెబుతారు. రామాయణంలో వాల్మీకి కూడా గ్రహశకలాల గురించి వివరించాడు. మరి పురాణాల్లో చెప్పబడిన రెక్కలు ఉండే ఆ పర్వతం ఏంటి? గ్రహశకలాలకు సంబంధించిన మరిన్ని విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Hindu Mythology

సూర్యుని చూట్టు తిరిగే గ్రహశకలాల వలయం ఉంది. చిన్న రాయి సైజు నుండి పెద్ద పెద్ద పర్వతాలంతటి సైజు వరకు ఇలా అనేక రకాల సైజు లో ఉంటూ గుంపులు గుంపులుగా కొన్ని కోట్ల సంఖ్యల్లో తిరుగుతూ ఉండే వీటిని గ్రహ శకలాల వలయం అని అంటారు. ఈవిధముగా తిరిగే ఈ గ్రహశకలాలు ఏదైనా పెద్ద గ్రహానికి దగ్గరికి వెళితే ఆ గ్రహ ఆకర్షణకు లోనై ఆ గ్రహంలో పడిపోతాయి. ఈలాంటి శకలాలు భూమికి దగ్గర వచ్చి వెళుతుంటాయి. ఒకవేళ ఈ శకలాలు కనుక భూమిపైనా పడితే భూమికి అంతం తప్పదని శాస్త్రవేత్తలు వారి పరిశోధనలో ఎప్పుడో చెప్పారు.

అయితే 2018 లో భూమికి అతి దగ్గరగా రెండు గ్రహ శకలాలు వచ్చాయి. కాలిఫోర్నియాలోని పాలోమర్‌ మౌంటెన్‌ రేంజ్‌ వద్ద గల అబ్జర్వేటరీలోని ఖగోళ శాస్త్రవేత్తలు చెప్పిన వివరాల ప్రకారం ఈ రెండు గ్రహ శకలాలు కూడా చాలా వేగంతో భూమికి చాలా దగ్గరికి వచ్చి భూమిపైనా పడకుండా పక్కకి వెళ్లిపోగా వాటి కారణంగా ఎటువంటి ప్రమాదం లేదని తేల్చారు. అయితే ఇదివరకు శాస్త్రవేత్తలు కొన్ని గ్రహశకలాలకు బయపడి వాటికీ పేర్లని కూడా పెట్టడం జరిగింది. ఆలా శరవేత్తలు పేరు పెట్టిన గ్రహశకలాల్లో ముఖ్యమైనది ఇకారస్.

ఇక రామాయణం విషయానికి వస్తే, రామాయణం సుందరకాండ లో హనుమంతుడు సముద్రాన్ని దాటుతున్నప్పుడు సముద్రం నుండి ఒక పర్వతం బయటకు వస్తుంది. ఆ పర్వతం పేరే మైనాకుడు. అయితే ఇలా సముద్రం నుండి బయటకి వచ్చిన మైనాకుడు హనుమంతుడిని కాసేపు తనపైన విశ్రాంతి తీసుకోమని కోరుకుంటాడు. అప్పుడు హనుమంతుడు మైనాకుడితో నీవు నాకు ఈవిధంగా దేనికి సహాయం చేస్తున్నావని అడుగగా మైనాకుడు తన కథని హనుమంతుడితో ఇలా వివరిస్తాడు.

మేనక మరియు హిమవంతుల సంతానం మైనాకుడు. పూర్వం కృతయుగంలో పర్వతాలకు రెక్కలు ఉండేవి. అవి ఎప్పుడు రెక్కలు ఉండటంతో అందరు వారి ప్రాణాలకు ఎప్పుడు హాని కలుగుతుందో అని బయపడుతుండగా ఒకసారి ఇంద్రుడు తన వజ్రాయుధంతో వాటి రెక్కలను నరకడంతో ఆ పర్వతాలన్నీ పడిపోతుండగా ఆ పర్వతాల్లో ఒకటైన మైనాకుడు కూలిపోతుంటే వాయుదేవుడికి జాలి కలిగి మైనాకుడిని జారిపోకుండా పట్టుకొని హిందూ మహాసముద్రంలో వదిలిపెడతాడు. ఇక ఆ కృతజ్ఞత వలనే నీవు వాయు పుత్రుడవు కనుక నీకు సహాయం చేస్తున్నాను అని హనుమంతుడితో మైనాకుడు అని అంటాడు.

ఈవిధంగా రామాయణంలో పర్వతం అని చెప్పబడే మైనాకుడి కథ ఉండగా వేదకాలం నుండే ఇవన్నీ ఉన్నాయని చెబుతారు.

Exit mobile version