హంసలదీవి గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు!

హంసలదీవి, ఇది విజయవాడ నుంచి 110 కి.మి దూరంలో ఉంది. అవని గడ్డ నుంచి 25 కి.మి. దూరం. ఇక్కడి నుండి బస్ సౌకర్యం ఉంది. పూర్వం పాపాత్ములు అందరూ గంగా నదిలో స్నానాలు చేసి తమ పాపాలు పోగొట్టుకునే వారు. ఆ పాపాల విముక్తికై గంగ మహావిష్ణువుని శరణు వేడుకుంది. దానికి విష్ణుమూర్తి నువ్వు పాపాల కారణంగా నల్లగా మారిపోయావు.

Hansaladevi!నువ్వు అన్ని పవిత్ర తీర్థాలలో స్నానం చేస్తూ వెళ్లు, ఎక్కడ నీ మాలిన్యం పోయి తెల్లని హంసలాగా స్వచ్ఛంగా మారతావో అది ప్రసిద్ధ పుణ్య క్షేత్రం అవుతుంది అని చెప్పాడు. ఆ విధంగా కాకి రూపం లో వున్నగంగ అన్ని నదులలో స్నానం చేస్తూ కృష్ణవేణి సాగర సంగమంలో కూడా చేసింది. అప్పుడు ఆవిడకు కాకి రూపం పోయి తెల్లని హంస రూపం వచ్చింది. అందుకే దీనికి హంసల దీవిగా పేరు వచ్చింది.

Hansaladevi!కృష్ణా నది సముద్రంలో కలిసే ఈ అందమైన ప్రదేశంలో సత్యభామ, రుక్మిణీ సమేత శ్రీ వేణు గోపాల స్వామి ఆలయం ఉంది. దీన్ని దేవతలు నిర్మించారని చరిత్ర చెబుతోంది. పూర్వం దేవతలు ఈ ఆలయాన్ని ఒక రాత్రి లోనే ఈ ఆలయాన్ని నిర్మించినట్లు తెలుస్తోంది. అయితే కోడి కూసే సమయానికి రాజ గోపురం సగమే అయ్యిందట. దాంతో తెల్లవారి పోయిందని దాన్ని అలాగే వదిలేసి వెళ్లిపోయారట. తరువాత కాలంలో చోళ, మౌర్య రాజుల కాలంలో ఆలయ పునరుద్దరణ జరిగినా ఆ గాలి గోపురం అసంపూర్తిగానే వదిలేశారు.

Hansaladevi!నిర్మాణమే కాదు పూర్వం మహర్షులు, దేవతలకు మధ్య అనేక విషయాలు జరిగిన ప్రదేశం కూడా ఇదే అని చరిత్ర చెబుతుంది. ఇక్కడి దైవాన్ని దేవతలు ప్రతిష్టించారని, దీన్ని చూడటానికి పెద్దలు, పిల్లలు కూడా ఎంతో ఆసక్తి చూపుతారు. ఎందుకంటే సముద్ర తీరంలో చల్లని ఆహ్లాదకరమైన వాతావరణంలో సేద తీరడానికి ఇది చాలా అనువైన ప్రదేశం.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,690,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR