సంవత్సరంలో నెలరోజులు మాత్రమే దర్శనమిచ్చే అద్భుత శివలింగం

త్రిమూర్తులలో ఒకరు పరమశివుడు అయన కైలాస అధిపతి. ఈయనను శంకరుడు, త్రినేత్రుడు, లయకారుడు, అర్ధనాదీశ్వరుడు ఇలా అనేక రకాల పేర్లతో కొలుస్తారు. శివ అంటే సంస్కృతంలో స్వచ్ఛమైనది అని అర్ధం. శివుడు లింగ రూపంలో దర్శనమివ్వగా మన దేశంలో ఎన్నో అద్భుత శివలింగాలు ఉండగా అందులో ఈ ఆలయంలోని శివలింగం కూడా ఒకటిగా చెప్పవచ్చు. ఈ ఆలయంలో విశేషం ఏంటంటే ఇక్కడ ఉన్న శివలింగం సంవత్సరంలో ఒక నెల మాత్రమే భక్తులకి దర్శమిస్తుంది. పరశురాముడు ఈ శివలింగాన్ని ఏడూ కోట్ల మంది సమక్షంలో ప్రతిష్టించాడట. మరి ఈ ఆలయం ఎక్కడ ఉంది? ఈ ఆలయంలో ఉన్న మరిన్ని అద్భుత విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

sivalingamఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, పచ్చిమగోదావరి జిల్లా, పెనుమంట్ర మండలంలో నత్త రామేశ్వరం లో రామేశ్వరస్వామి ఆలయం ఉంది. ఇక్కడ దక్షిణాభిముఖ, పశ్చిమాభిముఖ శివలింగాలు ఉన్నవి. ఇలా ఒకే ప్రాంగణంలో శివలింగాలు ఉండటం అనేది చాల అరుదైన విశేషం. ఇక్కడ ఉన్న ఈ రెండు శివలింగాలను ఒకటి శ్రీరాముడు ప్రతిష్టించగా, మరొకటి పరశురాముడు ప్రతిష్టించడం విశేషం. ఈ ఆలయంలో దక్షిణముఖంగా దర్శనమిచ్చే స్వామివారిని నిత్యం దర్శనం చేసుకోవచ్చు కానీ పశ్చిమ ముఖంగా ఉన్న స్వామివారిని మాత్రం వైశాఖ మాసంలో ఒక్క నెలలో మాత్రమే దర్శనం చేసుకోవచ్చు. మిగిలిన 11 నెలలు మాత్రం శివలింగం నీటిలోనే ఉంటుంది.

sivalingamఇక ఈ ఆలయ పురాణానికి వస్తే, రావణ సంహారం తరువాత శ్రీరాముడు బ్రహ్మహత్యాపాతకం పోగొట్టుకోవడానికి అనేక చోట్ల శివలింగాలను ప్రతిష్టించాడు. అయితే ఇక్కడి గోస్తనీ నదితీరం దగ్గరికి వచ్చిన శ్రీరాముడు శివలింగాన్ని ప్రతిష్టించాలని భావించి, ఈ నదిలో మధ్యాహ్నం సమయంలో త్రికోటి తీర్థములు వచ్చి చేరుతాయని  నదిలో నుండి నత్తలతో కూడిన ఇసుకమట్టిని తీసుకొని ఒక శివలింగాన్ని తయారుచేసి ప్రతిష్టించాడు. ఈవిధంగా నత్త గుల్లలు కలసిన మట్టితో శివలింగాన్ని ప్రతిష్టించడం వలన ఈ గ్రామానికి నత్తా రామేశ్వరం అనే పేరు వచ్చినదని స్థల పురాణం.

sivalingamఇంకా ఈ ఆలయంలో ఉన్న రెండవ శివలింగం పురాణానికి వస్తే, పూర్వం గోస్తనీ నదీ తీరంలో పరశురాముడు తొమ్మిది వేల సంవత్సరాలు తపస్సు చేసాడట. అయితే ఎంతో మంది క్షత్రియులను సంహరించిన పరశురాముడు హత్యల వలన ఏర్పడిన దోషాలను పోగొట్టుకోవడానికి కైలాసం వెళ్లి శివుడి ఆజ్ఞతో పర్వతం నుండి ఒక శివలింగాన్ని తీసుకువచ్చి ఇక్కడ ప్రతిష్టించాడట. అయితే పరశురాముడి కోపాగ్ని వలన ఆ లింగం అగ్ని లింగం లాగ కనపడేసరికి తన అహంకారం ఇంకా తగ్గలేదా అని బాధపడి ఆ శివలింగం చుట్టూ ఒక చెరువు ని తవ్వి  గోస్తనీ నది నీటితో నింపివేసాడట. ఆ తరువాత స్వామి నీవు చల్లబడిన తరువాత నీకు పూజలు ఎలా అని బాధపడుతుంటే, అప్పుడు శివుడు పరశురామ నేను 11 నెలలు నీటిలోనే ఉండి ఒక్క ఫాల్గుణ మాసంలో అందరికి కనిపిస్తాను అని మాట ఇచ్చాడని పురాణం.

sivalingamఈ విధంగా ఈ ఆలయంలో 11 నెలలు శివలింగం నీటిలోనే ఉండగా ఒక్క వైశాఖ మాసంలో మాత్రం గర్భగుడిలోని నీటిని తోడి ఆ నెలలో మాత్రమే పూజలు నిర్వహిస్తుంటారు. అయితే పరశురాముడు ఈ శివలింగాన్ని ఏడూ కోట్ల మంది సమక్షంలో ప్రతిష్టించాడట అందుకే ఈ శివలింగాన్ని సప్త కోటీశ్వర లింగం అని కూడా అంటారు. ఇలా ఎన్నో అద్భుత ఆధ్యాత్మిక విషయాలకి నిలయమైన ఈ ఆలయానికి వైశాఖ మాసంలో, శివరాత్రి సమయంలో భక్తులు అధిక సంఖ్యలో వస్తుంటారు. ఇక్కడి శివలింగాలను దర్శనం చేసుకుంటే సిరిసంపదలు లభిస్తాయని, ఆయురారోగ్యాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR