శివుడు పినాకం అనే శివ ధనుస్సుతో, విష్ణువు సారంగం అనే విష్ణు ధనుస్సుతో యుద్ధం ఎందుకు చేసారు ?

శివుడి త్రిపురసుందరుడిని సంహరించడం కోసం శివధనస్సుని సృష్టించాడు. శ్రీ మహావిష్ణువు దగ్గర విష్ణు ధనుస్సు ఉంది. ఒకసారి శివుడికి విష్ణువుకి మధ్య యుద్ధం జరుగగా అప్పుడు శివుడు శివధనస్సుని వదిలేస్తాడు. మరి శివుడికి, విష్ణువుకి మధ్య యుద్ధం ఎందుకు జరిగింది? శివుడు శివధనస్సుని ఎవరికీ ఇచ్చాడు? శ్రీరాముడి దగ్గరికి విష్ణు ధనుస్సు ఎలా వచ్చిందనే విషయాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Interesting Facts Shiva Dhanussu

బ్రహ్మదేవుడికి ఒక సందర్భంలో విష్ణువుకి, శివుడికి మధ్య యుద్ధం జరిగితే ఎలా ఉంటుందో తెలుసుకోవాలని భావించి సృష్టికర్త బ్రహ్మ ఇద్దరి మధ్య యుద్ధం జరిగేలా చేసాడు. అప్పుడు శివుడు పినాకం అనే శివ ధనుస్సుతో, విష్ణువు సారంగం అనే విష్ణు ధనుస్సుతో యుద్ధంలోకి దిగారు. ఇద్దరిమధ్య ఘోర యుద్దాన్ని జరుగుతుండగా లోకాలన్నీ అతలాకుతలం అవుతుండగా సమస్త దేవతలు బయపడి బ్రహ్మ దగ్గరికి వెళ్లగా, అప్పుడు బ్రహ్మ దేవుడు సమస్త దేవతలు అందరు కలసి శివుడిని, విష్ణువుని శాంతించమని ప్రార్ధించగా వారు యుద్దాన్ని ఆపివేశారు.

Interesting Facts Shiva Dhanussu

ఆ తరువాత శివుడు తన ధనస్సు అయినా పినకాన్ని శివభక్తుడైన ఒక రాజుకి ఇచ్చాడు. ఆ రాజు వంశానికి చెందినవాడే జనకమహారాజు. అయితే జనకమహారాజు దగ్గర ఉన్న శివధనుస్సుని ఎక్కుపెట్టి విరిచి శ్రీరాముడు సీతాదేవిని వివాహం చేసుకున్నాడు. ఇది ఇలా ఉంటె, విష్ణువు తన ధనుస్సు అయినా సారంగం ని బుచీకుడు అనే మహర్షికి ఇచ్చాడు. బూచిక మహర్షి మనవాడే పరశురాముడు. క్షత్రియులని అంతం చేయాలనీ భావించిన పరశురాముడు శివధనస్సుని విరిచినందుకు ఆగ్రహానికి గురై శ్రీరాముడి దగ్గరికి రాగ శ్రీరాముడు సాక్షాత్తు శ్రీమహావిష్ణువే అని గ్రహించి తన దగ్గర ఉన్న విష్ణు ధనుస్సుని శ్రీరాముడికి ఇచ్చాడు.

Interesting Facts Shiva Dhanussu

పరశురాముడు ఇచ్చిన విష్ణు ధనస్సుతో శ్రీరాముడు రావణుడిని సంహరించి, తన అవతారం చాలించే సమయంలో వరుణ దేవుడికి ఆ ధనుస్సుని ఇచ్చాడు. ఆ తరువాత శ్రీకృష్ణుడు ఖండవా వన దహనం సమయంలో ఆ ధనుస్సుని ఉపయోగించాడు. ఇక కలియుగం ఆరంభంలో శ్రీకృష్ణుడు తన దగ్గర ఉన్న ఆ ధనుస్సుని సముద్రంలో పడివేయగా అది మళ్ళీ వరుణ దేవుడి దగ్గరికి చేరింది.

Interesting Facts Shiva Dhanussu

ఈవిధంగా సృష్టికర్త అయినా బ్రహ్మ దేవుడి వలన శివుడికి, విష్ణువుకి మధ్య యుద్ధం జరుగగా వారి ధనస్సులు ఆ తరువాత పరశురాముడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు ఉపయోగించగా చివరకు వరుణ దేవుడి దగ్గరికి చేరిందని పురాణం.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR