Here Are Some Lesser Known Facts About Our Mother Tongue ‘Telugu’

దేశ భాషలందు తెలుగు లెస్స – శ్రీ కృష్ణదేవరాయలు చెప్పిన ఈ మాట వెనక ఉన్న అర్ధం మన దేశంలో, ఎన్ని భాషలు ఉన్న తెలుగుకి ఏ భాష సాటి రాదు అని చెప్పడానికి అలా అన్నారు.

తెలుగు భాషలోని మాధుర్యం అంతా ఇంతా కాదు. ఉగ్గు పాల నుండి ఒక బిడ్డకి తల్లి పాట పాడేందుకు వీలైన భాష. తెలుగు భాషలోని స్పష్టత, నేర్పు, భావం, కూర్పు చాలా అందంగా ఉంటాయి. ఎందరో మహనీయులు, కవులు, కవయిత్రులు మన తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను గురించి చాటిచెప్పారు.

మన తల్లిదండ్రులను మమ్మీ, డాడీ…..అని కాకుండా అమ్మ, నాన్న అని పిలిస్తే వచ్చే ఆ అనుభూతి వేరు. మన తెలుగు అనే కాదు ప్రపంచంలో ఎక్కడైనా, ఎవరైనా, వాళ్ళ వాళ్ళ మాతృ భాషలో మాట్లాడటానికి ఇష్టపడతారు. కానీ ఈ 21st సెంచరీలో మన అందరికి ఆంగ్లం మాట్లాడటం అనేది అవసరంతో పాటు అది ఒక భాగం అయిపోయింది. అయితే చదువు, వృత్తిరీత్యా ఆంగ్లం అనేది ఎంత అవసరం అయిపోయిన మాతృ భాష మూలాలు మాత్రం మర్చిపోకూడదు. ప్రాశ్చ్యత్య దేశాలు సైతం మన భాషను, మన భాషలోని కమ్మదనాన్ని మెచ్చుకొని ఆదరిస్తున్నప్పుడు మనం మన తెలుగు భాషని అగౌరవించడం బావ్యం కాదు.

అందుకే, ఆంగ్ల భాష మోజులో పాడి మన మాతృ భాషని మర్చిపోతున్న మన తెలుగు వారి కోసం తెలుగు భాష గురించి మీకు తెలియని నిజాలు, మరియు తెలుగు భాష గొప్పతన్నాని చెప్పే కొన్ని విషయాలు ………….!

1. పురాతత్వ పరిశోధనల ప్రకారము తెలుగు భాష ప్రాచీనత 2400 సంవత్సరాల నాటిది.

Mother Tongue ‘Telugu’

2. 2012 లో ‘ఇంటర్నేషనల్ ఆల్ఫాబెట్ అసోసియేషన్’ వారు మన తెలుగు బాషాకి ‘సెకండ్ బెస్ట్ స్క్రిప్ట్’ అవార్డు ని ఇచ్చారు. ఫస్ట్ ప్లేస్ కొరియాకి దక్కింది.

Mother Tongue ‘Telugu’

3. శ్రీ లంకలో ఒక తెగకు చెందిన వారు తెలుగు బాషా లోనే మాట్లాడుకుంటారు.

Mother Tongue ‘Telugu’

4. భారతదేశంలో హిందీ, బెంగాల్ తరువాత ఎక్కువ మాట్లాడే భాష మన తెలుగే, మూడవ స్థానం. ప్రపంచంలో ఎక్కువ మాట్లాడే భాషలలో మన తెలుగు భాష స్థానం 15.

Mother Tongue ‘Telugu’

5. తెలుగు భాష మాట్లాడటం వల్ల మన శరీరం లోని 72,000 న్యూరాన్స్ ఒకేసారి ఆక్టివేట్ అవుతాయి.

Mother Tongue ‘Telugu’

6. 200 వందల సంవత్సరాల క్రితం 400 మంది తెలుగు వారు బానిసలుగా, మారిషస్ కి వెళ్లారు . ఇప్పుడు అక్కడ ఉన్న ఆ దేశ ప్రధాని తో సహా చాల మంది తెలుగులో మాట్లాడతారు.

Mother Tongue ‘Telugu’

7. ‘Able was I ere I saw elbA’ ఈ ఇంగ్లీష్ వాక్యం ఎటు నుండి చదివిన ఒకేలా చదవొచ్చు ఒకే అర్ధం వస్తుంది కూడా. కానీ ఇది 17వ శతాబ్దం వరకే, అంతక ముందే అంటే 14వ శతాబ్దంలోనే ‘దైవజ్ఞ సూర్య’ అనే తెలుగు కవి ‘రామకృష్ణవిలోమ’ అనే తెలుగు కావ్యం రచించాడు. ఈ కావ్యం విశిష్టత ఏంటంటే ముందు నుండి చదివితే రామాయణం, వెనక నుండి చదివితే మహాభారతం ఉంటాయి అంట.

Mother Tongue ‘Telugu’

ఉదహరణకి:

‘తాం భూసుతా ముక్తి ముదారహాసం
వందేయతో లవ్య భవం దయాశ్రీ
ఇదే వెనకనుంచి మొదటికి చూస్తే
శ్రీ యాదవం భవ్యలతోయ దేవం
సంహారదాముక్తి ముతా సుభూతాం’

ఇలా ఒకే కావ్యంలో బాసుతా అంటే సీత అని, యధవం అంటే కృశునుడి గురించి 40 శ్లోకాలు రాసారు.

8. రరోరరే రరరురో …అంటూ మన మన తెలుగు భాషలో ఒకే లెటర్ మీద ఒక కావ్యం ఉంది, ఇలా ప్రపంచంలో మరే భాషలో ఇలా లేదు.

Mother Tongue ‘Telugu’

రరోరరే రరరురో
రురూరూరు రురోరరే |
రేరే రేరారారరరే
రారేరారి రి రారిరా ||

యాయాయాయాయాయాయాయా
యాయాయాయాయాయాయాయా |
యాయాయాయాయాయాయాయా
యాయాయాయాయాయాయాయా

9. తెలుగులో ఉన్న ప్రతి పదము ‘అచ్చు’ అంటే (vowel)తో, పూర్తి అవుతుంది. ఇలా ప్రపంచంలో ఇటాలియన్ భాష తరువాత మన భాష మాత్రమే.

Mother Tongue ‘Telugu’

10. నోబెల్ గ్రహీత విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఓసారి తెలుగు కావ్యం ఒకటి విని ‘భారతదేశంలో’ తియ్యనైన భాష తెలుగే అని కితాబు ఇచ్చారంట.

Mother Tongue ‘Telugu’

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR