హిమోగ్లోబిన్ శాతం పెరగాలంటే పాటించవలసిన కొన్ని పద్ధతులు

ఎక్కువశాతం ఆడవాళ్ళు ఎదుర్కొనే సమస్య ఈ రక్తహీనత. సాధారణంగా 12 శాతం ఉండాల్సిన రక్తం ఒకొక్కరికి 6 లేదా 5కి కూడా పడిపోయినపుడు వాళ్ళు ఎదుర్కొనే సమస్యలు చెప్పటానికి వీలులేనట్టుగా ఉంటాయి. ఎప్పుడయితే హిమోగ్లోబిన్ తగ్గుతుందో ఒంట్లో రక్తం ఉండాల్సిన ప్లేస్ ని నీరు ఆక్యుపై చేసి ఒళ్ళు బరువెక్కటం, కాళ్ళు తిమ్మెరలు, కూర్చుని లేచేటప్పుడు కళ్ళు తిరిగినట్టు ఉండటం, అధిక రక్తస్రావం ఇలాంటి సమస్యలు మొదలవుతాయి. హిమోగ్లోబిన్ శాతం పెరగాలంటే కొన్ని పద్దతులు పాటిస్తే మంచిది.

మన శరీరంలో ఐరన్, ఫోలిక్ ఆసిడ్, విటమిన్ సి, విటమిన్ బి12 ఇలాంటివాటిలో దేని పరిమాణం తగ్గినా అది రక్తహీనతకు దారి తీస్తుంది. వీటి లెవెల్స్ తగ్గకుండా చూసుకుంటే చాలు, ఎలాంటి సమస్య ఉండదు.

Bloodరక్తహీనతతో బాధపడే వాళ్ళు డాక్టర్ దగ్గరకి వెళితే ఐరన్ లేదా విటమిన్లతో కూడిన టాబ్లెట్స్ ఇస్తారు. అవి వాడితే సమస్య తగ్గుముఖం పట్టినట్లు కనిపిస్తుంది కాని టాబ్లెట్స్ వాడటం ఆపగానే సమస్య మళ్లీ మొదటికి వస్తుంది. అందుకే టాబ్లెట్ల ద్వారా హిమోగ్లోబిన్ ను పెంచుకోవటం కన్నా మనం తీసుకునే ఆహారం విషయంలో కాస్తంత జాగ్రత్త పాటింఛి దానిని పెంచుకోవటం మంచిది కదా.

రక్తంలో హిమోగ్లోబిన్ పెంచే ఆహారం:

మాంసం:

increase your hemoglobinరక్తంలోని హిమోగ్లోబిన్ వేగవంతంగా పెరగడానికి ప్రోటీన్స్ చాలా అవసరం. రెడ్ మీట్ (ఎరుపు రంగులో ఉండే మాంసం) ఇందుకు బాగా ఉపయోగడుతంది. బీఫ్, మటన్, మాంసంలోని కాలేయం వంటివి హీమోగ్లోబిన్ ఉత్పత్తికి అవసరమైన ఐరన్ పెరుగుదలకు తోడ్పడుతాయి. వీటిని ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. చికెన్ ను కూడా రెగ్యులర్ గా తీసుకుంటే మనకు కావాల్సినంత ఐరన్ లభిస్తుంది.
రెడ్ మీట్ లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీన్ని బాడీ కూడా తర్వగా తీసుకుంటుంది. అయితే రెడ్ మీట్ కొవ్వు పదార్థాలుస్థాయిలు అధిక మొత్తంలో ఉంటాయి. అందువల్ల దీన్ని ఎక్కువగా కూడా తీసుకోకూడదు. మనకు అవసరమైన మేరకు మాత్రమే దీన్ని తీసుకోవాలి.

పండ్లు:

increase your hemoglobinమామిడి, నిమ్మకాయలు, నారింజ వంటి అన్ని సిట్రస్ పండ్లలోనూ ఐరన్ ఎక్కువగా ఉంటుంది. వీటిలో శరీరానికి అవసరమైన విటమిన్- సి కూడా ఎక్కువగా ఉంటుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని త్వరగా పెంచడానికి ఈ పండ్లు ఉపయోగపడతాయి. స్ట్రాబెర్రీస్, యాపిల్స్, పుచ్చకాయలు, జామకాయలు, దానిమ్మ వంటి పండ్లు రక్తంలో హిమోగ్లోబిన్ ను పెంచుతాయి. అందువల్ల ఈ పండ్లను రెగ్యులర్ గ్ తింటూ ఉండాలి.

సీఫుడ్:

increase your hemoglobinసీఫుడ్ లోనూ హీమోగ్లోబిన్ స్థాయిని పెంచే గుణాలుంటాయి. వీటిలో ఐరన్, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిలను పెంచడానికి ఉపయోగపడతాయి. సముద్రపు చేపలు, ఓయిస్ర్టస్, క్లామ్స్ వంటివి ఎక్కువగా తింటూ ఉండాలి.

అపరాలు:

increase your hemoglobinఅపరాల్లో ఐరన్ అధికంగా ఉంటుంది. చిక్కుడు, సోయాబీన్స్, చిక్పీస్, బీన్స్ వంటి వాటిని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉండాలి. సోయా గింజల్ని అందుకు సంబంధించిన ఆహారపదార్థాలను ఎక్కువగా తీసుకుంటే మంచిది. ఇవన్నీ కూడా హిమోగ్లోబిన్ ను పెంచడానికి బాగా ఉపయోగపడతాయి.

తృణధాన్యాలు:

increase your hemoglobinతృణధాన్యాల్లోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. రైస్, గోధుమ, బార్లీ, మరియు వోట్స్ వంటి వాటిలో హిమోగ్లోబిన్ పెంచే గుణాలు ఎక్కువగా ఉంటాయి. రెగ్యులర్ గా వీటితో తయారు చేసిన ఆహారాన్ని తింటూ ఉండాలి. దీంతో శరీరానికి అవసరమైన కార్బోహైడ్రేట్లు అందుతాయి. ముఖ్యంగా బ్రౌన్ రైస్ వల్ల ఐరన్ ఎక్కువగా బాడీకి అందుతుంది. దీంతో బ్లడ్ లో హిమోగ్లోబిన్ పెరుగుతుంది.

తాజా కూరగాయలు:

increase your hemoglobinతాజా కూరగాయలతో తయారు చేసిన ఆహారపదార్థాలను ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అలాగే మినరల్స్ కూడా ఉంటాయి. బంగాళాదుంపలు, బ్రోకలీ, టమోటాలు, గుమ్మడికాయలు, బీట్రూట్ వంటి వాటిని ఎక్కువగా తింటూ ఉండాలి. అలాగే పాలకూరను రెగ్యులర్ గా తింటూ ఉండాలి. దీంతో రక్తంలో హిమోగ్లోబిన్ శాతం పెరుగుతుంది.

గుడ్లు:

increase your hemoglobinగుడ్లలోనూ ఐరన్ అధికంగా ఉంటుంది. ఇందులో పోషకాలు కూడా దండిగా ఉంటాయి. గుడ్డు పచ్చసొనలో ఎక్కువగా మినరల్స్, విటమిన్లు ఉంటాయి. రోజూ ఉడికించిన గుడ్లను తింటే చాలా మంచిది. బాడీకీ అవసరమైన ఐరన్ అందించడమేకాకుండా రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని కూడా ఇది పెంచుతుంది.

డ్రై ఫ్రూట్స్:

increase your hemoglobinడ్రై ఫ్రూట్స్ కూడా హిమోగ్లోబిన్ పెంచేందుకు బాగా ఉపయోగపడతాయి. ఆప్రికాట్లు, ఖర్జూరాలు వంటి వాటిలో ఐరన్, విటమిన్లు, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచేందుకు ఇవి బాగా ఉపయోగపడతాయి. అందువల్ల ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండండి

నట్స్:

increase your hemoglobinనట్స్ లో అధికంగ ఐరన్ ఉంటుంది. బాదం పప్పులో అధిక శాతం ఐరన్ ఉంటుంది. రోజు ఒక పిడికెడు బాదం పప్పులను తింటే 6 శాతం ఐరన్ శరీరానికి అందుతుంది. ఒకవేళ మీరు ఆస్తమా కలిగి ఉంటె మాత్రం, వేరుశనగను తినకండి. జీడిపప్పులోనూ ఐరన్ ఎక్కువగా ఉంటుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,590,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR